Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)పై డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ (KS Ravikumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కాంబోలో వచ్చిన ‘లింగ’ (linga) మూవీలో రజనీకాంత్ వేలు పెట్టాడని ఆరోపించారు. ఎడిటింగ్‌లో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారని చెప్పారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.
ఎడిటింగ్ విషయంలో రజనీ జోక్యం చేసుకున్నారని చెప్పారు. సీజేఐ (కంప్యూటర్ గ్రాఫిక్స్) విషయంలో తనకు సమయం ఇవ్వలేదన్నారు. సెకండాఫ్ మొత్తాన్ని ఆయన మార్చేశారంటూ కామెంట్స్ చేశారు. అనుష్కతో ఉండే ఒక పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను రిమూవ్ చేశారని చెప్పారు. కృతిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ యాడ్ చేశారని, ‘లింగ’ను గందరగోళం చేశారంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కె.ఎస్.రవికుమార్‌కు కోలీవుడ్‌లో దర్శకుడిగా మంచి పేరు ఉంది. రజనీకాంత్‌తో ఆయన గతంలో ‘ముత్తు’, ‘నరసింహ’ చిత్రాలు తీసి మంచి విజయాలను దక్కించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో 2014లో వచ్చిన మూవీ ‘లింగ’. భారీ బడ్జెట్‌లో యాక్షన్ కామెడీ ఫిల్మ్‌గా ఇది రిలీజ్ అయ్యింది.
రజనీకాంత్ రెండు పాత్రల్లో ఈ మూవీలో కనిపించారు. సోనాక్షిసిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ పరాజయం పాలైంది. ఈ సినిమా ఫలితం గురించి 2016లో రవికుమార్ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మా సినిమా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అది అంత సులభం కాదు. కలెక్షన్లపరంగా మా సినిమా బంపర్ హిట్టే’’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ తరహా కామెంట్స్ చేయడం విశేషం.
ఇవీ చదవండి: Dasara: దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
Nara Lokesh: పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నా: లోకేష్
Hardik Pandya: యాట్యిట్యూడ్ స్టార్.. హార్దిక్ స్టైలిష్ ఆటపై భిన్నాభిప్రాయాలు!
Drone Summit: ఈనెల 22 నుంచి అమరావతిలో డ్రోన్ సమ్మిట్
Laptop brightness: ల్యాప్ టాప్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎంత పర్సెంట్ ఉంటే మంచిది?
