Dasara: విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల (Dasara) పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. దేవాలయ శాఖ అదనపు కమిషనర్ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన చివరి నాలుగు రోజుల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు, అన్ని విభాగాలను సమన్వయపరచుకునేందుకు ఆయనను నియమించారు. ఉత్సవాలను రాష్ట్ర పండుగ గా ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పై ఉందని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మూలా నక్షత్రం రోజైన అక్టోబర్ 9వ తేదీన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం సులభంగా కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర పండుగగా గుర్తించిన దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పై ఉందని, సీనియర్ అధికారులు ఉత్సవాల నిర్వహణలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి, భక్తులకు అమ్మవారి దర్శనం నభూతో న భవిష్యత్ అనిపించేట్లుగా పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు.
ఇవీ చదవండి: Pothina Mahesh: దుర్గమ్మ ఆలయ ఆదాయం టీడీపీ నేత జేబుల్లోకి.. మూడు నెలల్లో రూ.4 కోట్ల అవినీతి!
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం.. దుర్గమ్మకు సీఎం జగన్ పట్టు వస్త్రాలు
Goddess Durga: సూర్యభగవానుని, దుర్గమ్మను ఎలా పూజించాలి?
Kanakadhara stotram: ఎక్కడ దరిద్రం ఉన్నా తొలగిపోవడం ఖాయం.. కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే ఎంతటి ప్రయోజనాలో!
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ.. కిక్కిరిసిన వీఐపీ మార్గం
Krishna River Retaining Wall: కృష్ణమ్మ జల విహార్.. రిటైనింగ్ వాల్ పూర్తితో కృష్ణలంక వాసుల కల సాకారం
Lalitha Sahasranamam: లలితా సహస్రనామ పారాయణంతో సకలపాప హరణం.. తప్పక పారాయణం చేయండి!
Andhra Pradesh: ఏపీ అప్పులపై కేంద్రం ఏమందంటే..
