HomeAndhra PradeshCBN on Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CBN on Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CBN on Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. విశాఖ స్టీల్ పై చంద్రబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ (CBN on Vizag Steel) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన ఏమన్నారంటే..

’’ఈరోజు రాత్రి 11.15కు స్టీల్ ప్లాంట్ విషయమై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడుతాం. కుమార స్వామితో కూడా మాట్లాడాం. వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో అవన్నీ మాట్లాడాం. దీనిపై శ్రద్ధ పెట్టకుండా ఈ ఇండస్ట్రీని సిక్ చేసే పరిస్థితికి వచ్చారు. రూ.1400 కోట్ల నుంచి రూ.1500 కోట్లు డబ్బులు ఇచ్చారు. దాన్ని రివైవ్ చేయడానికి ఒక ఫర్నేస్ పని చేస్తోంది. బీఏఫార్ కు పోయే సమయంలో ఆ డబ్బులు బ్యాంకులకు కట్టారు. అందువల్ల వాళ్లు కొంత వెయిట్ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే దీన్ని పూర్తిగా రివైవ్ చేయాలి. ఏమేం ప్రత్యామ్నాయాలున్నాయో అవన్నీ వర్కౌట్ చేస్తున్నారు. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవన్నీ ఓవర్ కమ్ కావాలి.

ఎలా శాశ్వత పరిష్కార మార్గం ఉంటుంది? దానిపైన ఎగ్జామిన్ చేస్తున్నాం. రాత్రికి ఒకసారి మాట్లాడిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తాం. మొత్తం తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పోరాడి, ఇదొక మనోభావాలకు సంబంధించిన అంశం. అయితే దీన్ని సక్రమంగా చేయకుండా ఎవరు ఏ విధంగా చేశారో నా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు గానీ కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, రాంగ్ టైమ్ లో కొన్ని నిర్ణయాలు చేయడం కావచ్చు, అల్టిమేట్ గా ప్రాజెక్టు అయితే ఇబ్బందుల్లో పడింది. ఇది ఏ విధంగా కాపాడాలి, మళ్లీ ఏ విధంగా దీన్ని ట్రాక్ లో పెట్టాలి? ఏ విధంగా చేస్తే ఇది ముందుకెళ్తుందన్న విషయాలు సీరియస్ గా ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి డిజిన్వెస్ట్ మెంట్ ఆగినా దానికి చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు మనం అగ్రిమెంట్ చేసింది ఎన్టీపీసీ కాదు, ఎన్‌హెచ్‌పీసీ.

సెయిల్ లో విలీనం చేయాలి. అదొక ఆల్టర్నేటివ్, వాళ్లు ఒప్పుకోవాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవాలి. అదొక ప్రాబ్లమ్ ఉంది. ఎన్ఎండీసీకి ల్యాండ్ ఇచ్చినా కూడా వాళ్లు కొంత డబ్బులిస్తే అది తాత్కాలికం, ఆ డబ్బులు చాలదు. ఒక వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో టెంపరరీగా ఇస్తే ఆ డబ్బుతోనే ఇది రివైవ్ కాదు. దీనికి ఒక ప్యాకేజీ కింద కాంప్రహెన్సివ్ గా ఆలోచిస్తే తప్ప రివైవ్ చేయలేం. ఇది పూర్తిగా రివైవ్ చేయాలి. రా మెటీరియల్ కూడా లేదు. అది కూడా ఒక ప్రాబ్లమ్ అయ్యింది. ఏ విధంగా కూడా ప్రైవేటైజేషన్ చేయకుండా దీన్ని కాపాడాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాం. ఇదొకటే మాకు జఠిలమైన సమస్య.

మొత్తం కూడా కొంచం ఫెయిర్ గా డిస్కషన్ చేయకపోతే ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. లేదంటే దానికి ఎవరో ఒకరు డబ్బులు ఇవ్వాలి కదా. కాంక్రీట్ గా లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సెంట్రల్ గవర్నమెంట్ లేదా, స్టేట్ గవర్నమెంట్ లేదా, బ్యాంకులన్నా ఇవ్వాలి. ప్రైవేటీకరణ ఆపేస్తామని చెబుతున్నాం. అలా అని చెప్పి దాన్ని రివైవ్ చేయాలి కదా. మేం అపోజిషన్ లో ఉన్నప్పుడు మాకు మొత్తం పిక్చర్ ఉండదు. అది గుర్తు పెట్టుకోవాలి.

సాదుకొండ, ఎర్రకొండ హిల్స్.. అని రెండు కొండలు తంబళ్లపల్లెలో ఉన్నాయి. అక్కడ కూడా ఐరన్ ఓర్ ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా ఐరన్ ఓర్ వచ్చింది. ఇప్పుడు సెయిల్ కు ఐరన్ ఓర్ పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి వాళ్లు అది ఎక్కడికక్కడ విస్తరిస్తున్నారు కాబట్టి రా మెటీరియల్ వెరీ కాస్ట్ ఎఫెక్ట్ ఉంది. అలాంటి ఫెసిలిటీ ఆర్ఐఎన్ఎల్ కు కూడా ఇవ్వాలి. అదొక ఆల్టర్నేటివ్. అప్పుడు వచ్చిందంటే చాలా వరకు సెయిల్ తరహాలో చేయొచ్చు.

రెండోది మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎవడో మేనేజర్ రావడం, ఇష్టానుసారంగా చేసేయడం, వెళ్లిపోవడం ఇలాంటివి చాలా జరిగాయి. ప్రాపర్ మేనేజ్మెంట్ లేదు. ఆల్ పార్టీ మీటింగ్ పెడితే రాజకీయాలు చేస్తారు. అందుకే వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. మీరు ఏం చేస్తారో చేయండి.. మాకవన్నీ అనవసరం.. ఏం చేస్తారో చెప్పమంటున్నారు. సొల్యూషన్ లేకుండా చెబితే ఏమొస్తుంది? ఉద్యోగుల కన్సర్న్ అడ్రస్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలవాలి. ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం. అదే మాదిరిగా కేంద్రంలో కూడా చాలా పెద్ద ఎత్తున సహకారం కావాలి. దాని కోసమే రెండు మూడు సార్లు కూర్చున్నాం.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: YS Jagan: మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి కుటుంబానికి వైయస్‌ జగన్‌ పరామర్శ
Pithapuram: పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం.. ప్రతిపక్షంలో ఉంటే పవన్ ఎలా స్పందించే వారు?
Wife Husband: భార్యా భర్తల నడుమ ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి?
Haryana Congress: హర్యానాలో కాంగ్రెస్‌కు షాక్ వెనుక 5 కారణాలు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు