HomeAndhra PradeshYS Jagan: మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి కుటుంబానికి వైయస్‌ జగన్‌ పరామర్శ

YS Jagan: మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి కుటుంబానికి వైయస్‌ జగన్‌ పరామర్శ

YS Jagan: ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తూ ఇవాళ ఆయన అడుసుమిల్లి ఇంటికి వెళ్లారు.

విజయవాడ మొగల్రాజపురంలోని జయప్రకాష్‌ నివాసానికి వెళ్లిన వైయస్‌ జగన్, అడుసుమిల్లి చిత్రపటానికి పూలు సమర్పించి, నివాళులర్పించారు. అడుసుమిల్లి కుటుంబ సభ్యులతోనూ ఆయన మాట్లాడారు. మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్‌ తనదైన ముద్ర వేసుకున్నారని ఈ సందర్భంగా జగన్‌ గుర్తు చేసుకున్నారు. జయప్రకాష్‌ కుమారుడు తిరుమలేష్‌తో పాటు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జయప్రకాష్‌ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

పార్టీ కార్యకర్తకు ఫోన్లో పరామర్శ
పల్నాడు జిల్లా గురజాల మండలం తేలుకుట్లకు చెందిన చల్లా నాగరాజు తొలి నుంచి వైయస్సార్‌సీపీలో చురుకైన కార్యకర్త. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామంలో పార్టీ తరపున పోలింగ్‌ ఏజెంట్‌గా వ్యవహరించాడు. దీంతో నాగరాజుపై కక్ష కట్టిన స్థానిక టీడీపీ నాయకులు, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆయన్ను బెదిరిస్తుండడంతో, కూటమి నేతల నుంచి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి, తేలుకుట్ల వదిలి పులిపాడు వచ్చి అక్కడే ఉంటున్నాడు.

కాగా, గత నెల 20న, వ్యక్తిగత పనిమీద తేలుకుట్ల వెళ్లి పులిపాడు తిరిగి వస్తుండగా, గ్రామ శివారులోని గాడిదల వాగు వద్ద కాపుకాసిన 10 మంది టీడీపీ గుండాలు, నాగరాజుపై విచక్షణా రహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. రెండు కాళ్లునూ నాలుగు చోట్ల విరగ్గొట్టారు. గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత, మెరుగైన చికిత్స కొరకు నర్సారావుపేట జీబీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. నాగరాజు కుడి కాలు చికిత్స చేసే అవకాశం లేదని, మోకాలు కింద నుంచి కాలు తొలగించాల్సి వస్తుందని డాక్టర్లు భావిస్తున్నారు.

నాగరాజు పరిస్థితి తెలుసుకున్న వైయస్‌ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. నాగరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాగరాజును జాగ్రత్తగా చూసుకోమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని ఆదేశించారు.

Read also: Pithapuram: పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం.. ప్రతిపక్షంలో ఉంటే పవన్ ఎలా స్పందించే వారు?
Wife Husband: భార్యా భర్తల నడుమ ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి?
YS Jagan: పాలన కుప్పకూల్చి దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు: జగన్ ధ్వజం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు