HomeAndhra PradeshMargani Bharat on CBN: లిక్కర్, ఇసుక ఆదాయం మొత్తం కూటమి నాయకుల జేబుల్లోకే

Margani Bharat on CBN: లిక్కర్, ఇసుక ఆదాయం మొత్తం కూటమి నాయకుల జేబుల్లోకే

Margani Bharat on CBN: అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న కూటమి పార్టీలు మరో ఐదేళ్లు ప్రజలతో పని లేదన్నట్టుగా ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నాయని.. ఇసుక, లిక్కర్‌ మాఫియాతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో విజన్‌–2047 అంటూ కోతలు కోస్తున్నారని మాజీ ఎంపీ, వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌ అన్నారు.

ఇసుక, లిక్కర్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని తన పార్టీ నాయకులకు దోచిపెడుతూ 2047 నాటికి రాష్ట్రం 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ స్థాయికి చేరుకుంటుందని సీఎం చంద్రబాబు ఢిల్లీలో చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇండియా ఎకానమీనే 3.1 ట్రిలియన్‌ డాలర్లుందన్న భరత్‌.. చంద్రబాబు విజన్‌ గురించి సాక్షాత్తూ ప్రధాని మాట్లాడారని ఎల్లో మీడియా రాయడం ఎవరి చెవుల్లో పూలు పెట్టడం కోసమని ఎద్దేవా చేశారు. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టి.. యథేచ్ఛగా ప్రభుత్వ సంపద పంచుకు తింటున్నారని మాజీ ఎంపీ దుయ్యబట్టారు.

విశాఖ రైల్వే జోన్‌కు తమ నాయకుడు జగన్‌ చొరవతో గతంలోనే కేంద్రం ఆమోదం తెలిపిందని, శంకుస్థాపన మాత్రమే మిగిలి ఉందని మార్గాని భరత్‌ స్పష్టం చేశారు. పోలవరం నిధులకు ఆమోదం లభించిందని గొప్పగా చెబుతున్నారన్న ఆయన.. అసలు ఎప్పుడు, ఎన్ని నిధులు వస్తాయి? ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

లిక్కర్‌ మాఫియా, ఇసుక దోపిడి చూస్తే.. నేతి బీరకాయిలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో.. చంద్రబాబుకి నిజాయితీ ఉండదనేది కూడా అంతే నిజమని మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు. వైన్‌షాప్‌ల టెండర్లలో కూటమి ఎమ్మెల్యేల అక్రమ దందా వల్ల, బిడ్లు దాఖలు కాక, నాన్‌ రిఫండబుల్‌ డిపాజిట్ల రూపంలో ప్రభుత్వం దాదాపు రూ.2500 కోట్లు కోల్పోయిందని చెప్పారు. తెలంగాణలో ఒక్కో షాపుకు కనీసం 50 టెండర్లు వస్తే, ఇక్కడ సగటున మూడు మాత్రమే రావడాన్ని ఆయన ఉదహరించారు.

కూటమి పెద్దలు, ప్రజా ప్రతినిధుల దోపిడి వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని, దీని వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైందని మార్గాని భరత్‌ గుర్తు చేశారు. చివరకు విజయవాడ వరద బాధితుల సాయంలో కూడా గోల్‌మాల్‌ లెక్కలతో రూ. 534 కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. చంద్రయాన్‌ కోసం ఇస్రో చేసిన ఖర్చు రూ. 615 కోట్లయితే, విజయవాడ వరదల పేరుతో చంద్రబాబు చేసిన దోపిడీ రూ.534 కోట్లని మార్గాని భరత్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇవీ చదవండి: Margani Bharath: పోలవరం పనుల్లో చంద్రబాబు చారిత్రక తప్పిదం: మార్గాని భరత్
MP Margani Bharath: వలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్నారు.. : ఎంపీ మార్గాని భరత్
KS Bharath with CM Jagan: సీఎం వైఎస్‌ జగన్‌తో కేఎస్ భరత్‌.. ఏం మాట్లాడారంటే..!
Chandrababu Naidu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు