Wife Husband: భారతీయ సంప్రదాయాల ప్రకారం పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. ఏడేడు జన్మల బంధంగా అభివర్ణిస్తారు. అయితే, మారుతున్న సమాజంలో వివాహం విషయంలో మన ఆలోచనలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు మారిపోతున్నాయని చెప్పక తప్పదు. సమాజంలో కుదిరిన పెళ్లిళ్లు సర్వసాధారణమైనప్పటికీ, నేటి యువతరం ప్రేమ వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి పరిస్థితిలో వివాహం విషయంలో, భార్యా భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలన్న దానిపై నేటి యువత ఆలోచనలు చేస్తున్నారు.
టీమిండియా మాజీ దిగ్గజం, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ భార్య అంజలి అతని కంటే నాలుగేళ్లు పెద్దది అన్న సంగతి తెలిసిందే. అయితే, సైన్స్ ప్రకారం, మన సంప్రదాయం ప్రకారం స్త్రీ పురుషుల మధ్య బంధానికి వయసుతో సంబంధం ఉందా? ఉంటే దాంపత్య జీవితంలో అడుగు పెట్టే వారికి ఎంత గ్యాప్ ఉండాలి?
సైన్స్‌లో కాపులేషన్ (భౌతిక సంబంధం) అనే ఆంగ్ల పదాన్ని దీనికి ఉపయోగిస్తారట. దీని ప్రకారం స్త్రీ, పురుషుల శరీరం హార్మోన్ల మార్పులకు లోనైనప్పుడు, వారు శృంగార సామర్థ్యాన్ని కలిగి ఉంటారని చెబుతారు. సాధారణంగా బాలికలకు రుతుక్రమం మార్పు మొదలయ్యే వయసు 13 ఏళ్ల నుంచి ఉంటుందని చెబుతారు. కొందరు అంతకన్నా తక్కువ వయసులోనే మార్పులకు లోనవుతారు. తినే ఆహారం, వాతావరణంలో కాలుష్యం ఇలా రకరకాల మార్పులు దీనికి కారణం అవుతాయి.
మగవారిలో ఈ మార్పు 9 నుంచి 15 సంవత్సరాల మధ్య సంభవిస్తుందని చెబుతారు. అంటే పురుషుల కంటే స్త్రీలలో ఈ హార్మోన్ల మార్పు త్వరగా ఏర్పడుతుంది. ఈ కారణంగా పురుషుల కంటే త్వరగా శారీరక సంభోగానికి ఆడవారు అర్హులు అవుతారు.
అయితే, ఈ హార్మోన్ల మార్పు జరిగిన వెంటనే స్త్రీలు లేదా పురుషులు పెళ్లి చేసుకుంటారని లెక్క కాదు. ప్రపంచంలోని చాలా దేశాలు శృంగారంలో పాల్గొనడానికి కనీస వయస్సును ఆయా దేశాల చట్టాలను బట్టి నిర్ణయం చేసుకుంటాయి. ఈ వయస్సు 16 నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. భారత దేశంలో శృంగారంలో పాల్గొనడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలుగా చట్టంలో ఉంది.
మన దేశంలో వివాహానికి కనీస వయస్సు చట్టబద్ధంగా అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా నిర్ధారించారు. దీని ప్రకారం, భార్యాభర్తల మధ్య మూడు సంవత్సరాల గ్యాప్ చట్టబద్ధంగా అంగీకరిస్తారు. అయితే ఇటీవల మహిళల కనీస వివాహ వయస్సును 21కి పెంచడంపై దేశంలో చర్చ నడుస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు కావడం గమనార్హం. కానీ సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది.
ఏతా వాతా చూస్తే.. సంప్రదాయంగా కొనసాగుతున్న పద్ధతి ప్రకారం అయితే భారతీయ సమాజంలో భార్యాభర్తల ఏజ్ లో కనీసం మూడు నుంచి ఐదు సంవత్సరాల గ్యాప్ ఆమోదయోగ్యమైనదిగా చెబుతారు. స్త్రీలు పురుషుల కంటే తక్కువ వయస్సులో ఉండాలని పురాణాల నుంచి మన సమాజం చెబుతూ వస్తోంది. సేమ్ ఏజ్ గ్రూపు, పురుషుడి కంటే ఆడవాళ్ల వయసు ఎక్కువ ఉన్న జంటలు కూడా నేటి సమాజంలో పెరిగాయి. పాత కాలంలో అయితే కనీసం 10 నుంచి 15 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉండేది. ఇప్పటి సమాజాన్ని బట్టి చూస్తే కనీసం 3 సంవత్సరాలు గ్యాప్ ఉంటే బెటరని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: Wife: భార్య ప్రవర్తన మారాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో..
Wife and Husband: భర్త మాట భార్య వినాలంటే ఏం చేయాలి?
Vijay Deverakonda on marriage: పెళ్లయ్యాక నా భార్యతో ఇలా ఉండాలనుకుంటున్నా.. విజయ్ దేవరకొండ కామెంట్స్
Dharma Raju: జూదంలో భార్యని ఓడిన ధర్మరాజు.. ధర్మానికి ప్రతీక ఎలా అవుతాడు?
Wife and Husband Relationship: భార్యా భర్తల మధ్య నిందలు పెరిగాయా?
