Bhuma Akhila Priya: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై, ఆమె చేస్తున్న అరాచకాలపై జిల్లా కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే గంగుల నాని, భూమా కిషోర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డలో ప్రభుత్వానికి చెందిన 600 మెట్రిక్ టన్నుల ఇసుకను దోచేసిన అధికారుల పట్టించుకోవడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
గ్రామాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేయకుండా వేధించడం సరికాదని ఎమ్మెల్యే అఖిలప్రియ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ చేస్తూ టిప్పర్లతో భారీగా మట్టి తవ్వకాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జిల్లా కలెక్టర్ కు చేసిన ఫిర్యాదులో వైయస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు.
ఎవరైనా అన్యాయం జరిగిందని నోరు ఎత్తితే వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గేట్లను వసూలు చేస్తూ ప్రజలకు వ్యాపారస్తులకు ఇబ్బందులను కలిగిస్తున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి మాజీ ఎమ్మెల్యే గంగుల నాని తీసుకెళ్లారు.
కాగా, ఇప్పటికే తనకు కూడా ఓ రెడ్ బుక్ ఉందని అఖిల ప్రియ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎవరినీ వదిలిపెట్టేది లేదని, తాను మంచిదానిలా నటించబోనని స్పష్టీకరించారు. అందరికథా చెబుతానని ఇప్పటికే ఆమె ప్రకటించారు.
Read also: Bhumana: సుప్రీంకోర్టును సైతం హెచ్చరించేలా పనవ్ విమర్శలు: భూమన
UP Journalist: ప్రభుత్వాలు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలి: సుప్రీంకోర్టు
Akhila Priya: చెప్పినట్టుగానే చేస్తున్న అఖిలప్రియ.. వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం
Akhila Priya: నాకూ ఓ రెడ్ బుక్.. 100 మంది ఇబ్బంది పడతారు: అఖిల ప్రియ
Andhra Pradesh: నేరం ఏదైనా.. నిందితులు మాత్రం ఇరు పార్టీల్లో ఎలా ఉంటారు!?
Gudivada Amarnath: వరదలపై ముందే సమాచారమున్నా ప్రజలను అలర్ట్ చేయలేదు
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ.. కిక్కిరిసిన వీఐపీ మార్గం
