బుధవారం, 21 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Akhila Priya: నాకూ ఓ రెడ్ బుక్.. 100 మంది ఇబ్బంది పడతారు: అఖిల ప్రియ

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 7 సెప్టెంబర్ 2024

Akhila Priya: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన మొత్తం రెడ్ బుక్ మయంగా మారిపోయిందంటూ వైయస్సార్ సీపీ నేతల కామెంట్లు వినిపిస్తున్న వేళ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకూ ఓ రెడ్ బుక్ ఉందని, అందులో కొందరి పేర్లు ఉన్నాయన్నారు. వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

“ఎవ్వరినీ ఇబ్బంది పెట్టనని నేను చెప్పానా? అధికారంలోకి వస్తే తోలుతీస్తానని చెప్పినాను కదా? నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా? నేను మంచి పద్ధతిలో పోతానని దయచేసి అనుకోకండి. నాక్కూడా రెడ్‌ బుక్‌ ఉంది. మీ పేర్లన్నీ అందరిలో ఉన్నాయి. అందులో 100 మంది పేర్లు ఉన్నాయి. వారంతా ఇబ్బంది పడబోతున్నారు. మీడియా ముందు ఓపెన్‌గా చెప్తున్నాను’’ అంటూ భూమా అఖిల ప్రియ ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వడం కలకలం రేపుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల రెడ్ బుక్ అమలవుతోందని వైసీపీ ఇప్పటికే విమర్శలు చేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే వైయస్ జగన్ పలుమార్లు కామెంట్ చేశారు. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ లో ఉన్న పేర్లు, వారిపై కక్ష సాధింపులకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఎన్నికల ముందు ఇంత బహిరంగంగా లోకేష్ గానీ, ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు గానీ కక్ష సాధింపులకు పాల్పడతామంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నా అటు న్యాయస్థానాలు గానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్లు గానీ సుమోటోగా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇలాంటిదే జగన్ హయాంలో జరిగి ఉంటే మాత్రం ఈ పాటికి రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఓ వర్గం మీడియా, నాయకులు కోడై కూసేవారంటూ వైసీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవీ చదవండి: YS Jagan in Nellore: దాడులు ఆపాలి.. చంద్రబాబుకు వైయస్ జగన్ హెచ్చరిక
Chevireddy: చంద్రగిరిలో పోలింగ్ అనంతర అల్లర్లపై చెవిరెడ్డి రియాక్షన్ ఇదీ
Koneti Adimulam: టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు
Vinayaka Chaviti: తెలుగు వారికి వైయస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు
Vijayawada Floods: విజయవాడ వరద బాధితులకు వైయస్సార్ సీపీ ప్రజా ప్రతినిధుల విరాళం

ట్యాగ్స్: , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading