YS Sharmila: తిరుపతి వారాహి సభలో రాహుల్ గాంధీపై కామెంట్స్ చేసిన పవన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. రాహుల్ ను విమర్శించే నైతికత పవన్ కళ్యాణ్ కి లేదన్నారు. సెక్యులర్ పార్టీ జనసేన కాస్తా రైటిస్ట్ పార్టీ అయ్యిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు మోడీ డైరెక్షన్ లో నటిస్తున్నారన్నారు. లడ్డూ పై స్పెషల్ సిట్ ను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు. ఆమె మీడియాతో మాట్లాడిన ముఖ్యాంశాలివీ..
– విశాఖ స్టీల్ పై చంద్రబాబు గతంలో లేఖ రాసి ఇచ్చారు
– స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తాం అని సంతకం పెట్టారు
– ఇప్పుడు ప్లాంట్ కోసం రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది
– వైజాగ్ స్టీల్ పై బీజేపీ మోసం చేస్తూనే ఉంది
– స్టీల్ ప్లాంట్ పై కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తుంది అని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అంటున్నారు
– ఉక్కు శాఖ మంత్రిని అడుగుతున్నాం
– ఎవరివి చిల్లర రాజకీయాలు ?
– ఎవరి హయంలో ప్లాంట్ లాభాల్లో ఉంది ?
– UPA హయంలో లాభాల్లో ఉన్న ప్లాంట్ నీ ఎన్డీయే హయంలో బలహీనం చేశారు
– అదానీ,అంబానీ కన్ను విశాఖ స్టీల్ మీద పడింది.
– చిల్లర రాజకీయాలు మీవి
– కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది.
– విశాఖ స్టీల్ మన రాష్ట్రానికి తలమానికం
– కాంగ్రెస్ హయంలో ప్లాంట్ నెలకొల్పారు
– ప్లాంట్ కి హాని జరిగితే ఊరుకోం
– కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా పోరాటం చేస్తుంది
– అన్ని పార్టీల తో కలిసి త్వరలో సీఎం చంద్రబాబు ను కలుస్తాం
– మీరు రాసిచ్చిన లేఖ పై కట్టుబడి ఉండాలని అడుగుతం
ఉప పవన్ కళ్యాణ్ పై…
– రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత పవన్ కి లేదు
– అధికారం వచ్చాక పవన్ వేషం,భాష రెండు మారాయి
– ఉన్నత మైన హోదాలో ఉన్నారు
– భాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు
– అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది
– అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది
– అలాంటి మీరు ఒక మతమే ముఖ్యం అని వ్యవహరిస్తున్నారు
– ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు
– జనసేన ఒక సెక్యులర్ పార్టీ
– ఇప్పుడు జనసేన అంటే రైటిస్ట్ పార్టీ
– మతం పేరుతో రాజకీయాలు చేయడం RSS సిద్ధాంతం
– బీజేపీ వాళ్ల సిద్ధాంతమే మత రాజకీయం
– మీరు కూడా RSS కి డబుల్ యెజెంట్ గా మారారా?
– మీకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు
– మణిపూర్ లో క్రిస్టియన్ లా మీద ఊచకోత కోస్తే ఎక్కడ పోయారు ?
– గోద్రా అల్లర్లు జరుగుతుంటే ఎక్కడ పోయారు ?
– రాహుల్ గాంధీ ప్రేమను పంచుతున్నారు
– అన్ని మతాలను సమానంగా చూస్తున్నారు
– ఈ దేశంలో సోదర భావాన్ని పెంచుతున్నారు
– అలాంటి రాహుల్ పై మీరు మాట్లాడి మీ స్థాయి మీరు తగ్గించుకోకండి
– బీజేపీ డైరెక్షన్ లో మీరు ఎందుకు యాక్ట్ చేస్తున్నారు ?
లడ్డూ పై సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ సిట్ పై ….
– స్పెషల్ సిట్ వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది
– లడ్డూ కల్తీ పై మొదటగా సీబీఐ విచారణ మేమే అడిగాం
– సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరాం
– ఇండిపెండెంట్ సిట్ తోనే విచారణ వేగవంతం అవుతుంది
– లడ్డూ కల్తీ పై రాజకీయాలు చేయొద్దని సుప్రీం చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం.
Read also: Sharmila: 48 గంటల్లోపే కార్మికులను విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ విజయం
YS Sharmila: 4,200 మందిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి: షర్మిల డిమాండ్
YS Sharmila Reddy: అన్నపై షర్మిల మరోసారి ఆక్రందన.. విలీనం, జగన్ మళ్లీ రాడంటూ…
Vizag boat Fire Accident: సీఎం జగన్ ఉదారత.. బోట్లు కోల్పోయిన విశాఖ మత్స్యకారులకు 80 శాతం సాయం
