HomeAndhra PradeshPawan Kalyan: స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: పవన్

Pawan Kalyan: స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: పవన్

Pawan Kalyan: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సి.బి.ఐ. నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుందని తెలిపారు.

’’తిరుమల శ్రీవారి లడ్డూ తయారీల్లో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెల్లడైనప్పటి నుంచి సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారు. గత పాలకులు నియమించిన టీటీడీ బోర్డుల హయాంలో లడ్డూ ప్రసాదం కావచ్చు, స్వామివారికి చేసే కైంకర్యాలు కావచ్చు, అన్న ప్రసాదం కావచ్చు… అన్నిటా నాణ్యత ప్రమాణాలు లోపించాయనే భక్తులు ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలి. పవిత్ర క్షేత్రం తిరుమలలో గత పాలక మండళ్ళు చేసిన నిర్ణయాలు, వారి పాలన తీరును – సమగ్రంగా సమీక్షించి, సంస్కరించే బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పుడు నిర్ణయాలకు, అపవిత్ర చర్యలకు కారకులైన వారిని నిబంధనల ప్రకారం బాధ్యులను చేస్తాం’’. అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

చంద్రబాబుకు చెంపపెట్టు: ప్రకాశ్ రెడ్డి
తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. తిరుపతి లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు విశ్వాసాన్ని కోల్పోయినందునే విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిందన్నారు. సుప్రీంకోర్టు చంద్రబాబుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మడం లేదన్నారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం భగవంతున్ని సైతం వదలకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ పతనం ఆరంభమైందని, చంద్రబాబు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Read also: Pawan on YSRCP: జగన్ అమాయకుడు కాదు.. పవన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ధి రాలేదు
Pawan Kalyan: ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ కల్యాణ్
Varahi Decleration: వారాహి డిక్లరేషన్.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
Tirupati Varahi Sabha: ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కీలక వ్యాఖ్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు