HomeAndhra PradeshMLC Botcha: టీటీడీలో కల్తీ నెయ్యి ఆరోపణల్లో చంద్రబాబే దోషి

MLC Botcha: టీటీడీలో కల్తీ నెయ్యి ఆరోపణల్లో చంద్రబాబే దోషి

MLC Botcha: టీటీడీలో కల్తీ నెయ్యి ఆరోపణల్లో చంద్రబాబే దోషి అని, ఆధారాలన్నీ ఆయనవైపే వేలెత్తి చూపిస్తున్నాయని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. అది నిజం కాదని చంద్రబాబు నిరూపించుకోగలరా? అని ప్రశ్నించారు. దమ్ముంటే విచారణ కోరగలరా? కేంద్రం, సుప్రీంకోర్టు, హైకోర్టుకు లేఖ రాయగలరా? అని సవాల్‌ చేశారు. తిరుమలలో ఆ నెయ్యి సరఫరా జరిగింది, నాణ్యత పరీక్షలో కల్తీ అని తేలింది.. ఈ ప్రభుత్వం వచ్చాకే అని బొత్స గుర్తు చేశారు.

తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారంటూ, సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని కోరుతూ, ఇప్పటికే తమ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన విషయాన్ని గుర్తు చేసిన బొత్స, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తామూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోరారు.

జగన్‌ తిరుమల పర్యటనపై అనవసర రాద్దాంతం చేసిన ప్రభుత్వం, ఆయన డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ కొత్తగా రాజకీయం మొదలు పెట్టిందన్నారు. జగన్‌ పర్యటన సందర్భంగా భారీ అల్లర్లకు కుట్ర చేసిన టీడీపీ, బీజేపీ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. ఒకవైపు తమ పార్టీకి చెందిన రాయలసీమ నాయకులందరికీ నోటీసులు ఇచ్చి, హౌజ్‌ అరెస్ట్‌ చేశారని, మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలను తిరుపతికి తరలించినా, పోలీసులు పట్టించుకోలేదని ప్రస్తావించారు. వీటన్నింటి నేపథ్యంలో, తిరుపతిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే, జగన్‌ పర్యటన వాయిదా వేసుకున్నారని చెప్పారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం, ఏ సమస్య వచ్చినా దాన్ని గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఆపాదిస్తోందని బొత్స తెలిపారు. అంతే కాకుండా, ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడం సీఎం చంద్రబాబుకు అలవాటని గుర్తు చేశారు. తాజాగా 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు అతి పవిత్రమైన శ్రీవారి లడ్డూపై సీఎం దారుణ ఆరోపణలు చేశారని, అది బెడిసి కొట్టడంతో, జగన్‌ తిరుపతి పర్యటనపై రాద్దాంతం చేశారన్నారు. జగన్‌ తిరుమల వెళ్లడం, శ్రీవారిని దర్శించుకోవడం ఇది తొలిసారి కాదన్న విషయాన్ని గుర్తించాలని కోరారు.

కార్మికుల తొలగింపు దారుణం
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, అందుకే 4 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించే ప్రక్రియ మొదలైందని బొత్స అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. దీనికి ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు. అసలు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన కోరారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 100 రోజుల్లోనే ఏకంగా రూ.25 వేల కోట్ల అప్పులు చేశారని, వాటితో ఏమేం చేశారని ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదని, అలాంటప్పుడు ఎందుకంతగా అప్పు చేస్తున్నారని ప్రశ్నలు గుప్పించారు.

ఇవీ చదవండి: YSRCP MLC: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స
Botcha Satyanarayana: నాకు తండ్రిలాంటి వాడు.. సీఎం జగన్‌ వ్యాఖ్యలతో మంత్రి బొత్స భావోద్వేగం!
Botcha: పీకే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు: మంత్రి బొత్స
Satyam Sundaram 2024 Movie Review: సత్యం సుందరం మూవీ రివ్యూ.. 
Bhumana Karunakar Reddy: సనాతన ధర్మం తెలిసిన వారెవరూ ఇలా అడ్డు చెప్పరు
RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు