Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ (Director Shankar) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా ఫిల్మ్ గా వస్తోంది. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల లేటెస్ట్ అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి ’’రా మచ్చా.. మచ్చా..‘‘ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో చిత్ర బృందం బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ‘రా మచ్చా.. మచ్చా’ అనే పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ చిత్రానికి తమన్ (SS Thaman) బాణీలు సమకూర్చారు. పూర్తి లిరికల్ పాటను ఈనెలాఖరు 30వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ ను నకాష్ అజీజ్ పాడారు.
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు ఇష్టమైన కథానాయిక ఎవరో తెలుసా?
Ram Charan: చరణ్ వాడే వస్తువుల ఖరీదు అన్ని కోట్లా?
Jr NTR: తమిళ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ హాట్ కామెంట్స్
Ram Charan Daughter: మెగా ఇంట ప్రిన్సెస్.. కుమార్తెకు జన్మనిచ్చిన ఉపాసన
