Satyam Sundaram Review: సత్యం సుందరం.. కార్తీ, అరవిందస్వామి నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది?
సినిమా పేరు : సత్యం సుందరం
నటీనటులు: కార్తీ, అరవింద స్వామి, శ్రీవిద్య, రాజ్‌కిరణ్ ఇతర నటులు
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజు
మ్యూజిక్ : గోవింద్ వసంత
ఎడిటింగ్: ఆర్.గోవింద రాజు
రచన, దర్శకత్వం: సి.ప్రేమ్ కుమార్
నిర్మాత: జ్యోతిక సూర్య;
రిలీజ్ తేదీ: 28-09-2024
సున్నితమైన ప్రేమకథలను తెరపైకి బాగా చూపించగలనని నిరూపించిన దర్శకుడు సి.ప్రేమ్ కుమార్. ఇది 96 చిత్రంతో రుజువైంది. దాదాపు ఆరు సంవత్సరాల బ్రేక తర్వాత సత్యం సుందరం (Satyam Sundaram 2024) చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తీ (Karthi), అరవింద్ స్వామి (Aravind Swamy) ఈ సినిమాలో కీ రోల్స్ పోషించారు. తమిళ స్టార్ హీరో సూర్య, జ్యోతిక దంపతులు ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎలా ఉందో (satyam sundaram review 2024) ఓ లుక్కేద్దాం.
కథ ఎలా సాగింది..
చిన్నతనంలో జరిగిన ఓ ఘటనతో ఇబ్బంది పడి వేరే ప్రాంతంలో సెటిల్ అయిపోయి, మూడు పదుల వయసులో తిరిగి ఊరికి వచ్చిన యువకుడికి ఎదురైన అనుభవాలను ఈ చిత్రంలో చూపించారు. సత్యం (అరవింద్ స్వామి)ది గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయుని పాలెం. ఆ ఊరు అంటే అతనికి మహా ఇష్టం. సమీప బంధువులు చేసిన మోసం వల్ల ఆ కుటుంబం ఇల్లు కోల్పోయి యుక్త వయసులో అక్కడి నుంచి వెళ్లిపోయి విశాఖలో సెటిల్ అవుతారు. ఇలా దాదాపు 30 ఏళ్లు గడిచిపోతాయి.
అయితే ఇన్నేళ్లు గడిచినా సత్యం.. తన ఊరు, ఇంటి జ్ఞాపకాలన మరచిపోలేకపోతుంటాడు. ఓసారి తన బాబాయ్ కుమార్తె కూతురు వివాహం కోసం అనివార్యంగా ఊరికి వస్తాడు. ఈ క్రమంలోనే అతడిని బావా.. అని పిలుస్తూ కార్తీ వెంట పడతాడు. నిజానికి అతని పేరు కూడా సత్యానికి గుర్తు ఉండదు. ఎవరో తెలిసిన వాళ్లు అనుకుని మొహమాటానికి నటిస్తూ వస్తాడు (satyam sundaram review karthi) తొలుత అతడి అతి చేష్టలు, అతి మాటలు, కలుపుగోలుతనం చూసి జిడ్డులా భావిస్తాడు సత్యం. కానీ, ఇద్దరూ కలిసి ప్రయాణించేకొద్దీ ఆప్యాయత, ప్రేమానురాగాలు కనిపిస్తాయి. చివరకు వీళ్లిద్దరి ప్రయాణం ఎక్కడి వరకు వెళ్లింది, ఆ కార్తీతో సత్యంకు ఉన్న బంధం ఏమిటన్నది మిగతా కథ సినిమాలో చూడాల్సిందే.
కథనం ఎలా ఉంది..
పుస్తకంలో నవల చదినట్టుగా కథనం సాగుతుంది. గ్రామాల్లో మట్టి వాసనలు వెదజల్లేలా సన్నివేశాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. చిన్ననాటి జ్ఞాపకాలు, భావోద్వేగాలతో ఓ అందమైన జీవితంలో సాగిన కథగా ఈ స్టోరీ ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీగా ప్రమోషన్లలోనే తెలిసిపోయింది. అయితే, కథ పరంగా ఇందులో కొత్తదనం లోపించింది. (satyam sundaram review) బంధువుల చేతుల్లో మోసపోయి సొంతూరు వదిలి వెళ్లిపోయిన ఓ వ్యక్తి ఏళ్ల తర్వాత మళ్లీ ఓ శుభకార్యం కోసం ఆ ఊరికి వెళ్తే అక్కడ తనకు ఎదురైన అనుభవాలే ఈ కథ.
ఈ చిత్రం పూర్తిగా రెగ్యులర్ కమర్షియల్ మూవీలకు భిన్నంగా ఉంది. సినిమా ఆసాంతం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇలా ఎలాంటి ఒడిదొడుకుల్లేకుండా మూడు గంటలపాటు ప్రేక్షకుల్ని తీసుకెళ్తాడు దర్శకుడు. సత్యం ఊరి వదిలి వెళ్లిపోవడానికి వెనక ఏ కారణం ఉందో చూపిస్తూ కథ కాస్త ఇంట్రస్టింగ్ గానే ప్రారంభం అవుతుంది. (satyam sundaram review rating) అయితే తనకు ఊరితో, అక్కడున్న తన ఇంటితో అనుబంధాన్ని పరిచయం చేసి ఓపెనింగ్ సీన్లలోనే ఎమోషనల్ టచ్ ఇచ్చేందుకు దర్శకుడు ప్రయత్నించాడని అర్థం అవుతుంది. కార్తీ పాత్ర పరిచయం, కొంటెతనం, తనెవరో గుర్తురాక సత్యం పడే అగచాట్లు, అతని పేరు తెలుసుకోవడానికి ప్రయత్నాలు, కాస్త ఫన్నీగా ఉంటాయి. పెళ్లి వేదికపై తన చెల్లికి సత్యం ఓ గిఫ్ట్ ఇవ్వగానే దాన్ని ఆమె వేదికపైనే చింపేసి అందులోని ఆభరణాల్ని అన్నతోనే స్వయంగా తొడిగించుకుంటుంది. ఈ సీన్ కాస్త ఎమోషనల్ గా పండించే ప్రయత్నం చేశారు. మొత్తంగా చాలా సీన్లు సింపుల్ గా, నెమ్మదిగా సాగిపోతాయి.
సెకండాఫ్ లో కథ కార్తీ ఇంటికి మళ్లుతుంది. అక్కడికి వెళ్లాక సత్యానికి ఎదురయ్యే అనుభవాలు, అక్కడి పరిస్థితులు బాగా కామెడీగా, ఎమోషనల్ గా అనిపిస్తాయి. కార్తీ కుటుంబాన్ని మార్చిన సత్యం సైకిల్ ఎపిసోడ్.. అందర్నీ ఆకట్టుకుంది. పాత రోజుల్ని గుర్తు చేసేలా సన్నివేశాలుంటాయి.
ఎవరెలా నటించారు..
భిన్న కథలతో అలరించే హీరో కార్తీ (Karthi) సహా అరవింద్ స్వామి (Aravind Swamy) కూడా ఈ కథ ఎంచుకోవడంలో తమ ఛాయిస్ వెరైటీగా ఉంటుందని చెప్పకనే చెప్పారు. పూర్తిగా కమర్షియల్ వైపు కాకుండా ఇలాంటి భిన్న కథలను ఎంచుకోవడం వారి అభిరుచిని తెలియజేస్తుంది. కార్తీ పాత్ర ఓవైపు నవ్విస్తూనే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అరవింద స్వామి ఒకే స్టైల్ లో కనిపించినా క్లైమాక్స్ లో నటన ఆకట్టుకుంటుంది. కథతో దర్శకుడు మెప్పించాడు. డబ్బింగ్ మూవీ అయినా తెలుగు మూవీ మాదిరే అనిపిస్తుంది. సినిమా (Satyam Sundaram Movie) స్టోరీ కాస్త నెమ్మదిగా సాగడం ప్రేక్షకులకు కాస్త బోర్ అనిపిస్తుంది. విజువల్స్ మాత్రం సింప్లీ సూపర్బ్ అని చెప్పక తప్పదు. మ్యూజిక్ ఈ చిత్రానికి ఫర్వాలేదనిపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో సంగీతం బాగుంది. ఈ మూవీకి కథ, కార్తీ, అరవింద స్వామి నటన హైలైట్.
చివరిగా..
సత్యం సుందరం.. స్లోగా నడిచే ఇద్దరు పల్లెటూరి యువకుల అందమైన కథ.. (Satyam Sundaram Review)
రేటింగ్ 3/5
Read also: Jayam Ravi: జయం రవితో సహజీవనంపై స్పందించిన సింగర్..
Devara Review: దేవర సినిమా రివ్యూ.. మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ ఎలా ఉందంటే..
Devara: రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఓవర్సీస్లో 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది
Devara Trailer: దేవర ట్రైలర్.. సోషల్ మీడియా షేక్ అవ్వాలి.. చూసేందుకు రెడీనా?
