HomeLife StyleDonkey milk: శిశువులకు గాడిదపాలు పట్టడం వల్ల ఉపయోగాలు తెలుసా?

Donkey milk: శిశువులకు గాడిదపాలు పట్టడం వల్ల ఉపయోగాలు తెలుసా?

Donkey milk: గాడిదపాలు ఆరోగ్యానికి ప్రయోజనం అన్నది పూర్వ కాలం నుంచే పెద్దలు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శిశువులకు గాడిదపాలు ఓరెండు స్పూన్లు అయినా సరే.. తప్పక పట్టాలని సూచిస్తుంటారు పెద్దలు. ఈ క్రమంలో గాడిదపాల వల్ల కలిగే ప్రయోజనాలు, ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.

పసి పిల్లలు గాడిదపాలు తాగడం వల్ల వారికి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గాడిదపాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది.

ఆవు, మేక, గొర్రె, గేదె, ఒంటె లాంటి ఇతర పాడి జంతువులు ఇచ్చే పాలతో పోలిస్తే, గాడిద పాలు తల్లి పాల పోషకాలకు చాలా దగ్గరగా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. 19వ శతాబ్దంలో ఆకలితో అలమటిస్తున్న అనాథ శిశువుల కడుపు నింపడానికి గాడిద పాలనే ఎక్కువగా వాడారని చరిత్ర చెబుతోంది.

నాటి నుంచి గాడిద‌ల పెంపకం, పాల విక్రయం క్రమంగా పెరుగుతోంది. అయితే, ఒక్కో గాడిద‌ రోజుకు 1 లీటరు పాలు మాత్రమే ఇస్తుందట. ఈ నేపథ్యంలోనే వీటికి అధిక డిమాండ్‌ ఉంది. గాడిద పాలలో ఔషధ గుణాలు, అందాన్ని పెంచే సుగుణాలు పుష్కలంగా ఉంటాయట.

గాడిదపాలతో ప్రయోజనాలు ఇవీ..
* గాడిద పాలలో తల్లి రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
* శిశువులకు గాడిదపాలు పట్టించడం వల్ల విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.
* గాడిద పాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇవి తాగడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్ డి బాగా అందించినట్లవుతుంది. ఇవి లాక్టోస్ రూపంలో అందుతాయి.

* ఆర్థరైటిస్, దగ్గు, జలుబు వంటి ఇన్‌ఫెక్షన్లను నయం చేయడంలో గాడిదపాలు కీలక పాత్ర పోషిస్తాయి. గాయాలకు చికిత్సలో గాడిదపాలను వాడతారు.
* గాడిద పాలలో ఉండే యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటు వ్యాధులను, బ్యాక్టీరియాలను దూరం చేస్తాయి. వైరస్‌ల నుంచి కాపాడతాయి.
* గాడిదపాలు శిశువులకు పట్టడం వల్ల అలర్జీ లాంటివి దూరమవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

* ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలలో 5 రెట్లు తక్కువ కెసిన్, సమాన స్థాయిలో ప్రోటీన్లు లభిస్తాయి. గాడిదపాలు శిశువులకు పట్టడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏవీ ఉండవని నిపుణులు చెబుతున్నారు.
* గాడిద పాలలో ఇంకో ముఖ్యమైన అంశం లాక్టోస్. ఇది చిన్నారుల శరీరం కాల్షియం గ్రహించడానికి దోహదపడుతుంది. ఎముక‌ల‌ను బ‌లంగా తయారు చేస్తుంది.

* గాడిద పాలు రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు సైటోకిన్‌ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
* గాడిద పాలు కణాలను నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తాయి. రక్త నాళాలను విడదీసి, నైట్రిక్ ఆక్సైడ్ మీ రక్త నాళాలకు అందించి రక్త ప్రవాహాన్ని బాగుపరుస్తుంది. రక్తపోటు తగ్గుతుంది.

* గాడిద పాలలో ఉండే ప్రొటీన్లు నీటిని ఆకర్షిస్తాయి. పట్టు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి శిశువుల శరీరానికి మంచి మాయిశ్చరైజర్ గా వర్క్‌ చేస్తాయి.
* వీటిలోని ప్రోటీన్లు యాంటీఆక్సిడెంట్లుగా కూడా పనికొస్తాయి. అవి సూర్యరశ్మి వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి కణాలను కాపాడటంలో దోహదపడతాయి.

ఇవీ చదవండి: Cow milk: బరువు తగ్గాలా? ఆవు పాలు మంచిదా? గేదె పాలు మంచిదా?
Lose belly fat: కొవ్వును కరిగించేందుకు ఆపసోపాలు పడుతున్నారా? ఈ టిప్స్‌ పాటించండి
CM Jagan review on cooperation: అగ్రి కార్యకలాపాలు, మహిళల స్వయం ఉపాధికి తక్కువ వడ్డీకే రుణాలు: సమీక్షలో సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు