Richard Mille Watch: మంచి వాచ్ కట్టుకోవాలని చాలా మందికి కోరిక ఉంటుంది. ప్రముఖులైతే కోట్లాది రూపాయల విలువైన వాచీలు కట్టుకుంటూ ఉంటారు. సినిమా హీరోలు, క్రికెటర్లు, బిజినెస్‌మెన్లు ఈ లిస్టులో టాప్‌లో ఉంటారు. ఇటీవల స్మార్ట్ వాచ్‌లు కట్టుకోవడం చూస్తున్నాం. అయితే ఇటీవల ప్రపంచంలోని టాప్ ధనవంతులలో ఒకరైన మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య అనంత్ అంబానీని అతని వాచ్ గురించి అడిగిన సంగతి తెలిసిందే.
ఈ విషయం ఇటీవల వైరల్ అయ్యింది. ఆ వాచ్ రిచర్డ్ మిల్లే బ్రాండ్. బ్రాండ్ బిలియనీర్స్ వాచ్ గా పేరున్న ఈ కంపెనీ రెండు దశాబ్దాలుగా మార్కెట్‌లో తన మార్క్ పోటీ ఇస్తోంది. రూ.38 కోట్ల విలువైన వాచ్, సంవత్సరానికి 5,300 వాచీలు మాత్రమే తయారు చేస్తుందట.
లగ్జరీకి మారుపేరు
రిచర్డ్ మిల్లే బ్రాండ్ వాచీలు ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ వాచీలకు ఫేమస్. ఏడాదికి 5,300 వాచీలనే తయారు చేసే దీని సగటు ధర $250,000. రాఫెల్ నాదల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ఫేమస్ క్రీడాకారులు ఈ బ్రాండ్‌కు చెందిన వాచ్‌లనే కట్టుకుంటారట. ఈ విభిన్న డిజైన్ కారణంగా వాచీల ప్రపంచంలో దీనికి ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇది టైటానియం, కార్బన్ ఫైబర్ వంటి పదార్థాలతో తయారు చేసినది.దీని Rm52-05 మాన్యువల్ వైండింగ్ టూర్‌బిల్లాన్ ఫారెల్ విలియమ్స్ 49.94 Mm మోడల్ ధర దాదాపు రూ.37.71 కోట్లుగా పలుకుతోంది.
రిచర్డ్ మిల్లే బ్రాండ్ 2001 సంవత్సరంలో మార్కెట్లోకి ప్రవేశించింది. దాని ఆదాయం 2022లో $1.5 బిలియన్లకు చేరింది. గత రెండు దశాబ్దాల్లో ఈ బ్రాండ్ సాధించిన విజయాలు స్విస్ వాచ్ పరిశ్రమలో సాటిలేనివిగా నిలబడ్డాయి. బ్రాండ్ సహ వ్యవస్థాపకుడు రిచర్డ్ మిల్లే 1970 దశకంలో ఫ్రెంచ్ వాచ్‌మేకర్ ఫిన్‌హోర్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అతను డొమినిక్ గునాట్‌తో కలిసి తన సొంత సంస్థను మొదలు పెట్టాడు. 2001లో అతను తన మొదటి వాచీ RM 001 ట్రబిల్లాన్‌ను రిలీజ్ చేశాడు. దీని ధర $135,000. ఇది వాచ్ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించింది. పటేక్ ఫిలిప్ వాచ్ పరిశ్రమ రోల్స్ రాయిస్‌గా పిలిచారు. అందుకు కారణం దీని వాచీల ధర చాలా ఎక్కువగా ఉండటమే. కానీ రిచర్డ్ మిల్స్ వాచీలు మరింత కాస్ట్‌లీ. ఇప్పుడు ఈ కంపెనీకి చెందిన వాచీలు స్టేటస్ సింబల్స్‌గా మారిపోవడం విశేషం. ఇది బిలియనీర్ల బ్రాండ్‌గా మార్కెట్‌లో రాజ్యం ఏలుతోంది.
ఇవీ చదవండి: Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఫొటో గ్యాలరీ
Aditi Rao Hydari And Siddharth: అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్.. పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు!
Others Things : ఇతరుల వస్తువులు వాడుతున్నారా? వాడితే జరిగేది ఇదే..!
