Right to Abortion: గర్భం అన్నది మహిళ కలలుగనే చిరకాల వాంఛ. మనదేశంలో ఎంతో మంది మహిళలు పిల్లలు లేక అల్లాడిపోతుంటారు. కానీ కొందరు మాత్రం అవాంచిత గర్భాలను తొలగించుకుంటూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో మహిళలు తమకు ఇష్టం లేని గర్భాన్ని తొలగించుకునేలా హక్కుగా కల్పిస్తూ ఓ దేశంలో ఏకంగా రాజ్యాంగాన్ని మార్చేశారు.
అబార్షన్‌ను హక్కుగా ఓ దేశం ప్రకటించింది. గర్భవిచ్చిత్తిని రాజ్యాంగ హక్కుగా ప్రకటించింది. గర్భవిచ్చిత్తిని రాజ్యాంగ హక్కుగా ఫ్రాన్స్ దేశం పేర్కొంది. ప్రపంచంలోనే అబార్షన్‌ను హక్కుగా ప్రకటించిన తొలిదేశం ఫ్రాన్స్ దేశమే కావడం గమనార్హం. ఈ విషయంలో ఫ్రాన్స్ దేశం కీలక నిర్ణయం తీసుకుందట.
పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో 1958 రాజ్యాంగాన్ని మార్చేసినట్లు తెలుస్తోంది. 780-72 ఓట్ల తేడాతో అబార్షన్ హక్కుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దేశం గర్వించదగ్గ విషయం అని అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ ఇటీవల వ్యాఖ్యానించారు. కానీ యాంటీ అబార్షన్ గ్రూపులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 1975 నుంచి ఫ్రాన్స్‌లో గర్భస్త్రావాన్ని లీగల్‌గా పరిగణిస్తున్నారు. అయితే రాజ్యాంగ సవరణ ద్వారా అబార్షన్ హక్కును కాపాడుకునేందుకు ఫ్రాన్స్‌లో 85 శాతం మంది పాజిటివ్‌గా ఉన్నారు.
ఇవీ చదవండి: Congress Guarantees: మహిళా న్యాయ గ్యారంటీ కింద కాంగ్రెస్ 5 హామీలు
Marta: ఆ మహిళ వయసు 39.. పిల్లలు 19 మంది.. ప్రతి పిల్లాడికీ తండ్రులు వేర్వేరు వ్యక్తులే!
YSR Asara at Kankipadu: అన్ని సంక్షేమ పథకాలనూ మహిళల పేరిటే అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్: మంత్రి జోగి రమేష్
