HomeLife StyleType 2 Diabetes: టైప్-2 డయాబెటిస్ లక్షణాలు.. ఎలా కంట్రోల్‌ చేయాలంటే..

Type 2 Diabetes: టైప్-2 డయాబెటిస్ లక్షణాలు.. ఎలా కంట్రోల్‌ చేయాలంటే..

Type 2 Diabetes: ఇటీవలి కాలంలో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. ఇండియాలో డయాబెటిస్‌ రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటిస్‌ రావడానికి కారణాలు, చికిత్స గురించి అందరూ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. డయాబెటిస్‌ జబ్బు ఇటీవలి కాలంలో వేగంగా విస్తరిస్తోంది.

నిత్యజీవితంలో ఆహారపు అలవాట్లుగానీ, మారిన జీవన శైలి గానీ ఇందుకు కారణం అవుతోందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మధుమేహం వ్యాధిని చాలా మంది మొదట గుర్తించలేరు. తెలియకుండానే ఒక్కోసారి పదేళ్ల వరకు మధుమేహానికి చికిత్స లేకుండా చాలా మంది గడిపేస్తుంటారు. దీర్ఘ కాలం చికిత్స తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఇతర అవయువాలు పని చేయడంపై ప్రభావం చూపుతుంది. వ్యాధి బాగా ముదిరిపోవడం వల్ల తవ్ర నష్టం వాటిల్లుతుంది.

డయాబెటిస్‎ను ముందుగా గుర్తించడమే దీనికి చికిత్సల్లో మొదటిది. టైప్-2 డయాబెటిస్ లక్షణాలు చాలా ఆలస్యంగా బయట పడటం ఇందుకు ప్రధాన కారణం. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మధుమేహం వ్యాధిని ముందుగానే పసిగట్టవచ్చు.

ఇక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. మధుమేహాన్ని గుర్తించడానికి చిన్న రక్త పరీక్ష చేస్తే సరిపోతుంది. 40 ఏళ్లు దాటినవారు… సరిగా శారీరక శ్రమ చేయని వారు, ఊబకాయం ఉన్నవారు డయాబెటిస్ టెస్టులు ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ముఖ్యంగా మధుమేహం వ్యాధిని ముందుగా గుర్తించకపోతే.. శరీరంలో ఇతర అవయువాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కిడ్నీ, లివర్, కళ్లు, గుండె వంటి ముఖ్యమైన శరీర భాగాలపై డయాబెటిస్ ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముందుగానే అప్రమత్తమై.. ఆహారంలో, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే డయాబెటిస్ తీవ్రత ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడవచ్చు.

డయాబెటిస్‌ వ్యాధి రెండు రకాలు అని నిపుణులు చెబుతున్నారు. వాటిలో మొదటిది టైప్-1 డయాబెటిస్, రెండోది టైప్-2 డయాబెటిస్. టైప్-1 డయాబెటిస్ కుటుంబ వంశపారంపర్యంగా వస్తుందని చెబుతున్నారు. కుటుంబ వంశ చరిత్ర, ముందుతరాల వారికి మధుమేహం ఉంటే.. వారసులకు టైప్ 1 డయాబెటిస్ ఆటోమేటిక్‌గా వస్తుంది.

మరోవైపు టైప్-2 డయాబెటిస్ విషయానికి వస్తే.. క్రమశిక్షణ లేని జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అధిక బరువు కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఒక్కోసారి టైప్-2 డయాబెటిస్‎ను మందులతో నియంత్రించినా.. తీవ్రత పెరిగితే ప్రతి రోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితికి చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టైప్-2 డయాబెటిస్ లక్షణాలెలా ఉంటాయంటే..
బ్లడ్‌లో చక్కెర శాతం మోతాదుకు మించి ఉంటే.. మధుమేహం వచ్చినట్లు లెక్క. డయాబెటిస్ వల్ల ఎక్కువ సార్లు మూత్రం వస్తుంటుంది. ఎక్కువగా దాహం వేయడం, కంటి చూపు తగ్గిపోవడం, శరీర బరువు తగ్గడం, పాదాలలో మంటలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే ఆ ప్రభావం శరీరంలో ఇతర అవయవాలపై పడే ప్రమాదం ఉంది. దీనివల్లే కంటి చూపు క్షీణిస్తుంది. మూత్ర పిండాలు దెబ్బతింటాయి. నాడీ వ్యవస్థపై ఎఫెక్ట్‌ పడుతుంది. గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి పరిస్థితులూ ఎదరవుతాయి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
టైప్-2 డయాబెటిస్ బారిన పడిన వారు బరువు తగ్గడం అత్యవసరం. బరువు తగ్గడం ద్వారా డయాబెటిస్‎ను కంట్రోల్‌ చేయొచ్చు. సరైన సమయానికి నిద్ర పోవడం, నిద్ర లేవడం, పోషకామారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచొచ్చు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే టైప్-2 డయాబెటిస్‎ను అదుపులో ఉంచొచ్చు.

ప్రతి రోజూ ఎక్సర్‌సైజులు చేయడం మంచిది. దీని వల్ల కండరాలు గట్టిపడతాయి. తద్వారా కణాలకు ఇన్సులిన్ తీసుకొనే పవర్‌ పెరుగుతుంది. ఎండార్ఫిన్, సెరొటోనిన్ల ఉత్పత్తి పెరగడం వల్ల ఉల్లాసం ఏర్పడుతుంది. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

డయాబెటిస్‌ రాకుండా ముందు జాగ్రత్తలు ఇవీ..
* మన శరీర బరువును నియంత్రించుకోవాలి.
* తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. అంటే తప్పనిసరిగా ఎక్సర్‌సైజులు చేయాలి.
* ప్రతిరోజు కనీసం అరగంట పాటు నడక, ఇతర వ్యాయామాలు చేయాలి.
* వ్యాయామం మన దినచర్యలో మాలు దినచర్యలో ఒక పార్ట్‌ కావాలి.
* టెన్షన్, పని ఒత్తిడి లేకుండా ఉండాలి.
* ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో తీసుకోవాలి.
* జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.
* తగిన మోతాదులోనే ఆహారం తీసుకోవడం బెటర్‌

ఇవీ చదవండి: Type 2 Diabetes cure: టైప్‌ 2 డయాబెటిస్‌ లక్షణాలు, నివారణ ఇలా..
Alcohol: మందు తాగడం మానేస్తే శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయంటే..
Type 2 diabetes: టైప్-2 డయాబెటిస్‌ను ముందే గుర్తించగలమా? నిర్ధారణ అయితే ఏం చేయాలి?
Pista: పిస్తాపప్పు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? తప్పక తెలుసుకోండి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు