HomeAndhra PradeshBus Yatra: వైయస్‌ జగన్‌ బస్సు యాత్రకు సర్వం సిద్ధం.. రెండు రోజుల షెడ్యూల్‌ ఇదీ..

Bus Yatra: వైయస్‌ జగన్‌ బస్సు యాత్రకు సర్వం సిద్ధం.. రెండు రోజుల షెడ్యూల్‌ ఇదీ..

Bus Yatra: వైయస్సార్‌ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమైంది. ఆ పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఎల్లుండి అంటే ఈనెల 27వ తేదీన బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా బస్సు యాత్ర సాగనుంది.

2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మేమంతా సిద్ధం (YS Jagan bus yatra) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈనెల 27న ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయకు సీఎం జగన్‌ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రార్థనల అనంతరం నివాళి అర్పించి అక్కడి నుంచి ప్రొద్దుటూరు బయల్దేరుతారు. అక్కడి నుంచి వయా వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా బస్సు యాత్ర సాగుతుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు వెళ్తారు. మధ్యలో వయా దువ్వూరు, చాగలమర్రి మీదుగా రాత్రికి బస ఆళ్లగడ్డలోనే చేస్తారు.

జోరుమీదున్న వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు
ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచే సిద్ధం పేరుతో అధికార వైఎస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉంది. సిద్ధం సభలతో హోరెత్తించారు సీఎం జగన్‌. టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు.. పొత్తులు, ఎత్తులు, టికెట్లు రాక నైరాశ్యంలో మునిగిన వేళ.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తోంది. ఈ దశలో సీఎం జగన్‌ బస్సు యాత్రతో వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణులను ‘మేం సిద్ధం.. మా బూత్‌ సిద్ధం.. ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం’ పేరుతో గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టంగా ఎన్నికలకు సిద్ధం చేసేలా సీఎం జగన్‌ కసరత్తు చేశారు. ఏప్రిల్‌ 18న రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆలోపే బస్సు యాత్ర పూర్తి చేసుకోవాలని జగన్‌ సంకల్పించారు.

ఇవీ చదవండి: YS Jagan Bus Yatra: జనం మధ్యలోకి జగన్‌.. బస్సు యాత్రతో వైయస్సార్‌ సీపీలో జోష్‌!!
PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌ వేర్వేరు కాదని కామెంట్స్‌
YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు