Alcohol: మద్యం మితంగా తీసుకున్నా, ఎక్కువగా తీసుకున్నా ఒకటే. ఆరోగ్యానికి హానికరమే. ఇందులో అనుమానం అవసరం లేదంటున్నారు నిపుణులు. అయితే, మందు మానేయడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు స్పష్టంగా గమనించవచ్చని చెబుతున్నారు. బాడీ మళ్లీ హైడ్రేట్ అవుతుందని, గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. మందు మానేస్తే చేకూరే ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. Alcohol
మద్యంతో ఆరోగ్యం, కుటుంబం ఇబ్బందులు పాలవుతుందని తెలిసినా చాలా మంది ఆ అలవాటు మానుకోలేరు. కొంతమంది ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య కారణాల ద్వారా మద్యం అలవాటును దూరం చేసుకోవడానికి ట్రై చేస్తారు. దానికి తోడు శరీరం ఇచ్చే సూచనలను అర్థం చేసుకొని ఆల్కహాల్ మానుకోవాల్సి ఉంటుంది.
లేకపోతే అనారోగ్యాల ముప్పు పెరిగిపోతుంది. మందు మానేయాలనే నిర్ణయం, ఒక వ్యక్తి జీవితంలో చాలా మార్పులు తీసుకొని వస్తుంది. ఆరోగ్యపరంగానే కాదు మానసికంగా, వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. మద్యం మానేసిన వెంటనే శరీరంలో మార్పులు మొదలవుతాయి. దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు పొందుతారు. మద్యపానానికి దూరంగా ఉంటే శరీరంలో వచ్చే మార్పులు చాలా ఉంటాయి.
బాగా మందు తాగేవారు, సడన్‌గా ఆల్కహాల్ మానేసిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తేలికపాటి ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, వణుకు, మూర్ఛ, మతిమరుపు లాంటివి చూస్తారు. ఈ లక్షణాల తీవ్రత, తీసుకునే ఆల్కహాల్ శాతాన్ని బట్టి ఉంటుంది. కొన్ని రోజుల నుంచి చాలా వారాల వరకు ఈ లక్షణాలు ఉంటాయి.
ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేసేస్తుంది. మద్యపానం మానేసినప్పుడు శరీరం మళ్లీ హైడ్రేట్ కావడం మొదలు పెడుతుంది. ఇది చర్మాన్ని మెరుగ్గా కనిపించేలా చేస్తుంది. మరింత శక్తిని అందిస్తుంది. దీంతో శరీరక విధులు, అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
మానసికంగా చాలా మెరుగవుతారు
ఆల్కహాల్ తాగినప్పుడు మానసిక స్థితి గందరగోళంగా ఉంటుంది. కానీ మద్యపానం మానేస్తే జోష్ వేరేలా ఉంటుంది. లిక్కర్ మానేయడం వల్ల మానసికంగా మెరుగైన అనుభూతి కలుగుతుంది. ఇది బంధాలు, అనుబంధాలు వృద్ధి చెందడానికి దోహదపడుతుంది. చాలా మంది మద్యం మానేయడం చాలా కష్టం అని చెబుతారు. కానీ ఆచరణలో ప్రయత్నిస్తే పెద్ద ఇబ్బందేమీ కాదు.
మందు తాగడం మానేయాలని నిర్ణయం తీసుకుంటే, ఇందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఆల్కహాలిక్ ఎనానిమస్ వంటి గ్రూపుల నుంచి సపోర్ట్ తీసుకోవడం ఉత్తమం. కొత్త క్రియేటివ్ హాబీస్ అలవాటు చేసుకోవాలి. దీంతో డ్రింక్స్‌పైకి దృష్టి మళ్లకుండా ఉండొచ్చు.
ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎక్కువగా నిద్రపోయినా సరే.. అది నిద్ర నాణ్యతను మరింత దిగజార్చేలా చేస్తుంది. మద్యపానం మానేసినప్పుడు నిద్ర మెరుగవుతుంది. దీంతో తగినంత విశ్రాంతి తీసుకొనే వీలుంటుంది. ఆల్కహాల్ శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగేలా చేస్తుంది. అయితే మందు తాగడం మానేసినప్పుడు, శరీరం ఈ సమస్యను చక్కగా పరిష్కరించుకుంటుంది. ఆల్కహాల్ మానేస్తే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గిపోతుంది.
మద్యంలో చాలా కేలరీలు ఉంటాయి. కాబట్టి ఈ అలవాటు మానేస్తే బరువు తగ్గేందుకు చక్కటి మార్గం కనిపిస్తుంది. ఆల్కహాల్ తీసుకోనప్పుడు శరీరం ఫ్యాట్‌ను మెరుగ్గా బర్న్ చేసేస్తుంది. ఎక్కువగా తాగడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కానీ ఈ అలవాటు మానేస్తే, కాలేయం నయం కావడం ప్రారంబం అవుతుంది. పూర్తిగా మెరుగుపడకపోవచ్చు, కానీ మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
లిక్కర్ మానేయడం వల్ల గుండె ఆరోగ్యంగా తయారవుతుంది. ఇది అధిక రక్తపోటు, గుండె సమస్యలు, స్ట్రోక్ వచ్చే అవకాశాలను క్షీణింపజేస్తుంది. అతిగా తాగడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మద్యపానం మానేస్తే, ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి.
కాలక్రమేణా ఆత్రుత, విచారం కూడా తగ్గుతాయి. ఆల్కహాల్ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. మద్యపానం మానేసినప్పుడు శరీరం బలంగా ఉంటుంది. అనారోగ్యంతో మెరుగ్గా పోరాడే శక్తి పెరుగుతుంది.
ఇవీ చదవండి: Elections in AP: సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలి.. పటిష్ట నిర్వహణపై సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష
Type 2 Diabetes cure: టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు, నివారణ ఇలా..
Karthika Masam: కార్తీక మాసంలో ఏ పూజలు చేస్తే పుణ్య ఫలాలు కలుగుతాయి?
Romance Facts: శృంగారం చేయకూడదని సమయాలేంటి? ఆసక్తికర విశేషాలు
Pawan Kalyan on Volunteers: మారిన పవన్ స్వరం.. వలంటీర్లు తనకు సోదర సమానులన్న జనసేనాని!
