Type 2 diabetes: టైప్-2 డయాబెటిస్‌ను ముందే గుర్తించగలమా? నిర్ధారణ అయితే ఏం చేయాలి?

Type 2 diabetes: టైప్-2 డయాబెటిస్ ను ముందుగానే గుర్తించకపోతే.. అప్పటికే శరీరంలోని చాలా అవయవాలు వ్యాధికి ప్రభావితం అవుతాయి. అలా కాకుండా ఉండాలంటే… ముందుగానే అప్రమత్తమై.. ఆహారంలో, జీవన శైలిలో తగిన మార్పులు చేసుకుంటూ మెడిసిన్ తీసుకుంటే… సాధారణ జీవితం గడపవచ్చు. డయాబెటిస్‌ను చాలామంది ముందుగా గుర్తించలేరు. (Type 2 diabetes)

శరీరంలో చాలాకాలం ఆ వ్యాధి ఉన్నా.. వ్యాధి తీవ్రమైన తర్వాతనే లక్షణాలు బయట పడుతుంటాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ చాలా ఆలస్యంగా లక్షణాలు చూపిస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… టైప్-2 డయాబెటిస్ ను ముందుగానే గుర్తించవచ్చని, తగిన జాగ్రత్తలు పాటిస్తే… వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ రెండు రకాలు. అవి టైప్-1 డయాబెటిస్, టైప్-2 డయాబెటిస్. టైప్-1 డయాబెటిస్ వంశపారంపర్యంగా వస్తుంది. ఇక టైప్-2 విషయానికొస్తే… అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అధిక బరువు కారణంగా వస్తుంది. ఒక్కోసారి టైప్-2 డయాబెటిస్ ను మందులతో నియంత్రించినా… ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

రక్తంలో షుగర్ శాతం మోతాదుకు మించి ఉండడాన్ని డయాబెటిస్ అంటారు. ఈ వ్యాధి వల్ల… ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, అధిక దాహం, కంటి చూపు మందగించడం, శరీర బరువు తగ్గడం, అరికాళ్ళలో మంటలు వంటి లక్షణాలు టైప్-2 డయాబెటిస్ లక్షణాలుగా కనిపిస్తాయి. డయాబెటిస్ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే ఆ ప్రభావం ఇతర అవయవాలపై పడుతుంది. కంటి చూపు మందగిస్తుంది. కిడ్నీలు దెబ్బతింటాయి. నాడి వ్యవస్థపై ప్రభావం వల్ల నడవడం కూడా కష్టమవుతుంది. గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

వ్యాయామం చేయడం వల్ల కండరాలు పట్టిష్టపడతాయి. తద్వారా కణాలకు ఇన్సులిన్ గ్రహించే శక్తి మెరుగుపడుతుంది. ఎండార్ఫిన్, సెరొటోనిన్ ల ఉత్పత్తి పెరగడం వల్ల ఉల్లాసం కలుగుతుంది. వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించవు. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గడం చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గడం ద్వారా డయాబెటిస్ ను నియంత్రించవచ్చు. సరైన సమయానికి నిద్ర లేవడం, నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం వల్ల వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే టైప్-2 డయాబెటిస్ ను నియంత్రించవచ్చు.

ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలితో టైప్-2 డయాబెటిస్ దరిచేరకుండా చూసుకోవచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత అయినా జాగ్రత్తలు పాటిస్తే… ఇతర దుష్పరిణామాలను అరికట్టవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు…. వైద్యులను సంప్రదించి టెస్టులు చేయించుకోవాలి. వ్యాధి ఉందో లేదో వైద్యులు నిర్ధారిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులు వాడడమో… జీవనశైలిలో మార్పులు చేసుకోవడమో సూచిస్తారు.

వ్యాధి రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

టైప్-2 డయాబెటిస్ రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం.. శరీర బరువును అదుపులో పెట్టుకోవాలి. తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. రోజుకు అరగంట వాకింగ్, ఏరోబిక్ వంటి వ్యాయామాలు దినచర్యలో భాగం చేసుకోవాలి. పని ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలి. ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. తీసుకోవాల్సిన సరైన ఆహారాన్ని కూడా మోతాదులోనే తీసుకోవాలి.

ఇదీ చదవండి: Dragon Fruit For Diabetes: డయాబెటిస్‌కు డ్రాగన్‌ ఫ్రూట్‌తో ఇలా చెక్‌..!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles