HomeAndhra PradeshAP BJP List: ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు రిలీజ్.. నరసాపురం తప్ప అన్ని...

AP BJP List: ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు రిలీజ్.. నరసాపురం తప్ప అన్ని సీట్లూ వలస నేతలకే!

AP BJP List: ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులను నిన్న ప్రకటించారు. పొత్తులో భాగంగా ఆరు ఎంపీ సీట్లను బీజేపీకి కేటాయించారు. ఈ ఆరు సీట్లలో కేండేట్ల ఎంపికపై చాలా రోజులుగా కసరత్తు కొనసాగింది. ఎట్టకేలకు నిన్న అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో నరసాపురం ఎంపీ అభ్యర్థి తప్ప.. మిగతా అన్ని సీట్లూ వలస నేతలకే దక్కడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైయస్సార్‌ సీపీ నుంచి బీజేపీలోకి చేరిన రోజే ఎమ్మెల్యే వరప్రసాద్‌కు తిరుపతి సీటు ఖాయం చేయడం కలకలం రేపుతోంది. ఇంత కాలం బీజేపీలో కష్టపడిన వారికి టికెట్లు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. AP BJP List

మరోవైపు కడప నుంచి అనకాపల్లికి వచ్చి పోటీ చేసేందుకు వీలు కల్పిస్తూ సీఎం రమేష్‌కు సీటు ఖాయం చేసింది బీజేపీ అధిష్టానం. అలాగే ఈ మధ్య కాలంలోనే చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి సైతం రాజంపేట ఎంపీ సీటు ఇచ్చారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి రాజమండ్రి సీటు కేటాయించారు. 2014 ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన, ఆ తర్వాత సొంత పార్టీ పెట్టి అదీ వర్క్‌ ఔట్‌ కాక బీజేపీలో చేరిన కొత్తపల్లి గీతకు అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు.

ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని పోరాటం సాగిస్తున్న వారి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. కనీసం ఎమ్మెల్యే సీట్లు అయినా కేటాయించాలని కోరుతూ కొందరు నేతలు ఢిల్లీకి పయనమయ్యారు.

పొత్తులో భాగంగా 6 ఎంపీ సీట్లను నిన్న బీజేపీ ప్రకటించింది. అయితే, తమకు అవకాశం కల్పించలేదని సీనియర్లు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. విశాఖ నుంచి బీజేపీ సీటు ఆశించి జీవీఎల్‌ భంగపడ్డారు. రాజమండ్రి నుంచి సీటు ఆశించిన సోమువీర్రాజుకు నిరాశ తప్పలేదు. నర్సాపురం, రాజంపేట, తిరుపతి సీట్లలోనూ సీట్లు ఆశించి సీనియర్‌ నేతలు భంగపడ్డారు. నేడో, రేపో అసెంబ్లీ సీట్ల ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేతలు ఢిల్లీ బాటపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలని బీజేపీ సీనియర్లు కోరుతున్నారు.

మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతూ, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సోము వీర్రాజు, జీవీఎల్‌, విష్ణువర్ధన్‌రెడ్డి లాంటి సీనియర్లకు ఎంపీ అభ్యర్థుల జాబితాలో పేర్లులేకపోవడం మింగుడు పడటం లేదు.

ఇవీ చదవండి: AP BJP News: ఏపీ బీజేపీలో టీడీపీ ముద్ర.. కేండేట్ల ఎంపికలో అన్యాయంపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదుల వెల్లువ!
BJP 2nd List: బీజేపీ రెండో జాబితా విడుదల.. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి డీకే అరుణ పోటీ
YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు