HomeLife StyleKiss benefits: ముద్దుతో ఎన్ని ప్రయోజనాలో.. అనుబంధం అల్లుకుపోవాల్సిందే!

Kiss benefits: ముద్దుతో ఎన్ని ప్రయోజనాలో.. అనుబంధం అల్లుకుపోవాల్సిందే!

Kiss benefits: చిన్నపిల్లలను చూస్తుంటే ఎవరికి ముచ్చటేయదు చెప్పండి. ఆ ముచ్చటతో పిల్లలను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోవాలనిపించని వారు ఉండరు. తల్లికి తన పిల్లల మీద ఉన్న ప్రేమను, భర్తకు భార్యపై, ప్రియుడికి ప్రేమికురాలిపై.. ఇలా ఎవరు ఎవరిపై ఎంత ప్రేమ ఉన్నా దానిని వ్యక్తీకరించడానికి ఉన్న మంచి మార్గం ముద్దు.

ముద్దు పెట్టుకోవడం వల్ల ఎదుటి వ్యక్తికి మనం ఏమీ చెపపకుండానే వారిపై మనకున్న ప్రేమను వ్యక్తపరిచే వీలుంటుంది. ముద్దులు పెట్టుకోవడంవల్ల అనుబంధం బలపడుతుందట. ఇది అనేక అధ్యయనాల్లో సైతం స్పష్టమైంది. ఆరోగ్యానికి కూడా ముద్దు ఎంతో మంచిది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకునే వారు ఉంటారు. ఒకరిని ఇంకొకరు ముద్దు పెట్టుకోవడం ద్వారా మెదడు నుంచి రసాయనాలు విడుదలవుతాయన్నది మనకు తెలిసిన విషయమే. విడుదలైన రసాయనాలు శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి దోహదపడతాయి. దీనివల్ల హాయిగా మంచి అనుభూతి ఏర్పడుతుంది.

భాగస్వామిని ముద్దుపెట్టుకోవడం వల్ల శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ స్థాయి బాగా తగ్గిపోతుంది. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు. ఒత్తిడి అనేక వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే కార్టిసాల్‌ను నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం.

రక్తపోటును అదుపులో ఉంచుతుంది..
ముద్దు పెట్టుకొనే సమయంలో గుండె బాగా కొట్టుకుంటుంది. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణలో నూతనోత్తేజం వస్తుంది. శరీరంలో ఈ ప్రక్రియ సజావుగా సాగడంవల్ల రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది. రక్తపోటు కూడా అదుపులో ఉండే అవకాశం ఉంటుంది.

ముద్దు వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి తలనొప్పి, కడుపునొప్పి లాంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. ముద్దు వల్ల రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది. నిజానికి ముద్దు ద్వారా నోట్లోకి బదిలీ అయ్యే కొత్త జెర్మ్స్ హాని చేయవని అధ్యయనాలు స్పష్టీకరిస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఒత్తిడి మాయం
పుప్పొడి, దుమ్ము పురుగుల వల్ల కలిగే అలర్జీ లక్షణాలను ముద్దు బాగా తగ్గించేస్తుంది. ఒత్తిడి వల్ల అలర్జీలు ఎక్కువగా వస్తాయి. ముద్దులు పెట్టుకోవడం ఒత్తిడిని గణనీయంగా తగ్గించేస్తుంది. ఇటువంటి విషయాలన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి.

మీ భాగస్వామిని ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం పరస్పర బంధాన్ని బలంగా ఉండేలా చేస్తుంది. మీరు చాలా కాలం పాటు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు ముద్దులుపెట్టుకోవడం అనే విషయం ఉపయోగపడుతుంది.

ఇవీ చదవండి: Munaga Kayalu: ఇవి తింటే శృంగార సామర్థ్యం జోరందుకోవాల్సిందే.. ములక్కాడల ప్రత్యేకతలు ఇవీ..
NNN: ఏమిటీ NNN? ఈ నవంబర్‌లో శృంగారానికి దూరంగా ఉండటం ఎవరికి సాధ్యం?
Friendship: స్నేహ బంధంలో ఆర్థిక బంధాలు కొనసాగిస్తున్నారా? చివరకు ఏమవుతుందంటే..
Romance tips: రొమాన్స్‌లో బెస్ట్‌ టిప్స్.. ఇలా చేస్తే దూసుకెళ్లడం ఖాయం!
Ileana D’Cruz: నా చెలికాడు ఇతడే.. బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఇలియానా

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు