Friendship: స్నేహం నిలబడాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పు గురించి పెద్దలు కొన్ని విషయాలను చెబుతున్నారు. స్నేహితులు, బంధువుల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలటని అంటుంటారు పెద్దలు. స్నేహితుల మధ్య అనుబంధం కలకాలం కొనసాగాలన్నా, ఎన్ని అవాంతరాలు వచ్చినా స్నేహితులు చిరకాలం ఆప్యాయతలు పంచుకోవాలన్నా కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీలు, అప్పులు ఇచ్చే విషయంలో కొన్ని టిప్స్ పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఓ లుక్కేయండి.. (Friendship)
స్నేహితుల మధ్యలో ఆర్థిక సంబంధాలు అసలే ఉండకూడదని స్పష్టం చేస్తున్నారు. అప్పు ఇవ్వకండి, అప్పు చేయకండి అని సూచిస్తున్నారు. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహితులు వచ్చి అప్పు కావాలని అడిగిన సందర్భాల్లో తప్పించుకొనే మార్గాలను కూడా చెబుతున్నారు. స్నేహితులు, లేదా బంధువులు అప్పు అడిగిన సందర్భాల్లో ఎంతో కొంత దానంగా ఇచ్చేయాలని సూచిస్తున్నారు.
Read Also : Money Tips: ఇంట్లో ధనం పుష్కలంగా ఉండాలంటే.. ఉప్పుతో ఇలా చేయండి!
అప్పుగా ఇస్తే శత్రుత్వం తయారవుతుందంటున్నారు. మనతో మాట్లాడాలంటేనే అప్పు తీసుకున్న వారు ఇబ్బంది పడతారని, తర్వాత మనం అడిగిన సందర్భాల్లోనూ కాస్త మాటా మాటా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇలా చివరకు ఆ బంధం తెగిపోయేదాకా వెళ్తుందని, అదే ముందే మేల్కొని అప్పు ఇవ్వకుండా దానంగా కొంతమేర ఇచ్చేసి చేతులు దులుపుకుంటే తర్వాత ఎప్పుడు ఎదురుపడినా, పలకరించుకున్నా బంధం అలాగే కొనసాగుతుందంటున్నారు. అప్పుగా కాకుండా విరాళంగా ఇవ్వడం వల్ల ఇలా అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
ఒకసారి దానం చేసిన తర్వాత దాని గురించి మర్చిపోవాలని పెద్దలు సూచిస్తున్నారు. బంధువుల విషయంలోనూ ఈ సూత్రం ఫాలో కావడం ఉత్తమమని చెబుతున్నారు. తప్పనిసరి సందర్భాల్లో మొహమాటానికి పోయి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు స్నేహితులకు లేదా బంధువులకు ఇచ్చి కోరి శత్రుత్వం తెచ్చుకొనే బదులుగా అంతో ఇంతో ఇచ్చి వారిని వదిలించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
Read Also : Devotional Tips: ఇంట్లో ప్రమాదకరమైన వస్తువులివే.. వెంటనే తీసేయండి!