Ileana D’Cruz: దేవదాస్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. పోకిరి మూవీతో ఇండస్ట్రీ హిట్‌కొట్టిన సంగతి తెలిసిందే. పోకిరి తర్వాత అవకాశాలు పెద్ద సంఖ్యలో వచ్చి చేరాయి. అలా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీలో ఉంది. అయితే, వివాహం కాకముందే బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇప్పటి వరకు తన బాయ్‌ఫ్రెండ్ ఎవరో ప్రపంచానికి తెలియజేయలేదు ఇలియానా. ఇటీవల తన ఇన్‌స్టా గ్రామ్‌లో చెలికాడిని పరిచయం చేసింది. (Ileana D’Cruz)
ఇటీవల తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ వాటిలో బాయ్ ఫ్రెండ్ గురించి క్లారిటీ ఇవ్వలేదు ఇలియానా. అంతేకాకుండా ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీని ప్రకటించి అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా తాను ఎవరితో రిలేషన్‌లో ఉందనేది మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు. తాజాగా తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also : Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఫొటో గ్యాలరీ..
ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఉంది ఇలియానా. తన భాయ్‌ఫ్రెండ్‌ను ఫోటోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. డేట్ నైట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. అతనితో ఉన్న ఫోటోలను పంచుకుంది. అయితే అతని పేరును మాత్రం ఇలియానా చెప్పలేదు. గతంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలియానా గర్భం దాల్చిందన్న వార్తలతో అందరూ సెబాస్టియన్ ఇందుకు కారణంగా భావించారు.
అయితే, తాజా సోషల్ మీడియా ఇలియానా పోస్ట్ చిత్రాలలో ఉన్న వ్యక్తి సెబాస్టియన్ కాదని తేలింది. దీంతో ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ ముద్దుగుమ్మ అతి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పటిలోగా తన భాయ్‌ఫ్రెండ్ పేరును చెబుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రెగ్నెన్సీకి ముందు ఇలియానా బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌ల్లో నటించింది.
Read Also : Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ జోరు.. రెమ్యునరేషన్ పెంచేసిందిగా.. వయ్యారి భామ ఫొటో గ్యాలరీ