Hindu Temple in Abu Dhabi: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఆలయం ప్రారంభోత్సవానికి మన ప్రధాని నరేంద్ర మోదీ సైతం హాజరయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్ స్వామి నారాయణ్ సంస్థ అతి పెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు. Hindu Temple in Abu Dhabi
ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ విశిష్ట అతిథిగా ఈ అతి పెద్ద హిందూ దేవాలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవం గావించారు. ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. బోచసన్వాసి అక్షర్‌పురుషోత్తం స్వామినారాయణ్ పేరుతో అబుదాబిలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈ హిందూ దేవాలయానికి ఏడు గోపురాలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 7 ఎమిరేట్‌లకు ప్రతీకగా ఈ గోపురాల్ని నిర్మించడం విశేషం.
ఈ ఆలయ నిర్మాణంలో వినియోగించిన పాలరాయిని రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వేలాది మంది శిల్పులు, కార్మికులు దాదాపు మూడేళ్ల పాటు అలుపెరుగకుండా శ్రమించారు. ఈ అద్భుత కట్టడంలో ఎందరో భాగస్వామ్యం అయ్యారు.
402 తెల్ల పాలరాతి స్తంభాలను ఈ ఆలయ నిర్మాణంలో అమర్చడం గమనార్హం. ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు… ఇలా అనేక రకాల శిల్పాలను చెక్కి భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా చేశారు.
సుమారు రూ.700 కోట్ల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణం చేశారు. ఈ దేవాలయం దిగువ భాగంలో పవిత్ర గంగా, యమునా నదీ ప్రవాహాన్ని మరిపించేలా కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేయడంతో చూపరులను అబ్బురపరుస్తోంది. దుబై-అబుదాబి మార్గంలో 55,000 చదరపు మీటర్ల పరిధిలో దీని నిర్మాణం జరిగింది.
యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ ఆధ్వర్యంలో 42 దేశాలకు చెందిన రాయబారులు తమ జీవిత భాగస్వాములతో కలిసి అద్భుత ఆలయాన్ని దర్శనం చేసుకున్నారు. అసాధ్యమనుకున్నది వాస్తవరూపం దాల్చిందని సంజయ్ సుధీర్ తెలిపారు. బాప్స్ హిందూ ఆలయ ప్రాజెక్టు చీఫ్ స్వామి బ్రహ్మవిహారి దాస్ ఆలయ చారిత్రక ప్రాముఖ్యత, నిర్మాణం, ఇతర అంశాలను మీడియాకు వివరించారు.
ఇవీ చదవండి: Mattelu: కాలి మట్టెలు, తాళిబొట్టు ఎందుకు ధరిస్తారు? హిందూ ధర్మం ప్రకారం వీటి విశిష్టత ఏంటంటే..
Puja vidhanam: హిందూ ధర్మం ప్రకారం పూజా విధానాలు.. ఎలాంటి పద్ధతులు అనుసరించాలంటే..
Hindu Dharmam: హిందూ మతానికి, హిందూ ధర్మానికి తేడా ఏంటి? హిందూ సనాతన ధర్మం ఏం చెబుతుంది?
AP Endowment: గత ప్రభుత్వంలో దేవాలయాలు కూల్చేస్తే.. సీఎం జగన్ వాటిని పునరుద్దరించారు.. రూ.1600 కోట్లతో ఆలయాల అభివృద్ధి
Bhagavad Gita in audio: ఆడియో రూపంలో భగవద్గీత.. మరో ప్రయోగానికి సిద్ధమైన ఆర్పీ పట్నాయక్
