Mobile Theft: ప్రస్తుతం యువత సాధారణంగా స్కిల్డ్ కోర్సులను అభ్యసిస్తూ సర్టిఫికెట్లు పొందుతుంటారు. దీనికి అనుగుణంగా సాధిస్తూ మంచి జీతాలు పొంది జీవితాలను సన్మార్గంలో వెళ్లేలా చేసుకుంటూ ఉంటారు. కానీ కొందరు కేటుగాళ్లు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవడం గ్యారెంటీ. మొబైల్ ఫోన్లను ఎలా చోరీ చేయాలి? ఎక్కువ చోరీ చేసిన వారికి బోనస్‌లు, శిక్షణ పూర్తయ్యాక రూ.25 వేల జీతం.. ఇదీ వారి దొంగ తెలివి. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. Mobile Theft
మొబైల్ ఫోన్లు ఎలా కొట్టేయాలి? ఏయే ప్రాంతాల్లో దొంగతనం చేస్తే దొరక్కుండా ఉంటారు.. ఎలాంటి వ్యక్తులను ఎంచుకోవాలనే విషయాలపై 45 రోజులు ఈ దుండగులు శిక్షణ ఇస్తారట. శిక్షణలో దొంగతనం బాగా చేస్తున్నాడు అని నిర్థారించుకున్న తర్వాత ప్రతినెలా రూ.25 వేల జీతంతో ఉద్యోగం కూడా ఇస్తారట. ఇందులో కూడా ప్రతినెలా టార్గెట్స్ ఉంటాయండోయ్. టార్గెట్ రీచ్ అయితేనే జీతం అందుతుందట.
ఎక్కువ మొబైల్ ఫోన్లు కొట్టేస్తే మాత్రం బోనస్‌లు కూడా అందుకోవచ్చట. ఇదంతా గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన ఘటన. ఇద్దరు మొబైన్ ఫోన్ దొంగలు అవినాష్, శ్యామ్‌లను పోలీసులు పట్టుకొని తమదైన శైలిలో విచారణ చేస్తే ఈ నిజాలన్నీ ఒక్కొక్కటీ బయటకు వచ్చాయి.
మొబైల్ ఫోన్లు దొంగించి బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఇద్దరు దొంగలను సూరత్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణలో పోలీసులకే దిమ్మ తిరిగేలా షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. పట్టుబడిన ఇద్దరు నెలకు రూ.25 వేల జీతంలో, 45 రోజుల ట్రైనింగ్ తర్వాత వృత్తిలోకి దిగుతారని తేలింది.
దొంగిలించిన మొబైల్ ఫోన్లను అన్ లాక్ చేసి బంగ్లాదేశ్, నేపాల్‌కు తరలిస్తారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు అవినాష్ మహతో(19), శ్యామ్ కుర్మీ (26) లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 58 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో 29 ఐఫోన్లు, 9 వన్ ఫ్లస్ ఫోన్లు ఉన్నాయట. రీకవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ రూ.20.60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
అవినాష్, శ్యామ్లు జార్ఖండ్లో కూలి పనులు చేసుకొనేవారు. అవినాష్ అన్న పింటూ మహతో, రాహుల్ మహతో గుజరాత్ రాష్ట్రంలో మొబైల్ ఫోన్ దొంగతనాలకు అలవాటు పడ్డారు. దొంగిలించిన ఫోన్లను అన్ లాక్ చేసి నేపాల్, బంగ్లాదేశ్ కు పంపించేవారు. వీరికి ఇదే అలవాటుగా మారిపోయింది.
రాహుల్ , పింటూలు అవినాష్, శ్యామ్ లను తమ వద్ద పనిచేయాలని ఫోన్లు దొంగించేందుకు సాయం చేయాలని, ఇందుకు నెలకు పాతికవేల జీతం కూడా ఇస్తామని తెలిపారు. రద్దీ గా ఉంటే ప్రదేశాల్లో ఫోన్లను కొట్టేయాలన్న దానిపై నెలన్నరపాటు శిక్షణ కూడా ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఇవీ చదవండి: DGP Disk Awards: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఏపీ డీజీపీ డిస్క్ అవార్డులు
300 Cell towers: మారుమూల గిరిజన ప్రాంతాలకు టెలికాం సేవలు.. ఏపీలో 300 సెల్‌టవర్ల ప్రారంభం
Mobile Phone: స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సగటున రోజుకు 80 సార్లు చెక్ చేస్తున్నారట!!
Phone beside Bed: బెడ్ పక్కన ఫోన్ పెట్టుకుని పడుకుంటే ఎన్ని అనర్థాలో తెలుసా?
Phone Charging: మీ ఫోన్‌లో చార్జింగ్ త్వరగా అయిపోతోందా? హ్యాకింగ్ బారిన పడుతున్నారా?
