NNN: పురుషుల్లో కొంతమంది ఇప్పుడు ఎన్‌ఎన్‌ఎన్ (NNN) పేరు కలవరిస్తున్నారు. కొందరు పెళ్లి కాని యువకులు శృంగారానికి దూరంగా ఉండటం తప్పని పరిస్థితే. అయితే, అందుబాటులో ఉన్నవారు కూడా శృంగారానికి దూరంగా ఉండాలని చెప్పేదే ఎన్‌ఎన్‌ఎన్. అంటే నో నట్ నవంబర్ (No Nut November). సోషల్ మీడియాలో ఎన్‌ఎన్‌ఎన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలేమిటీ ఎన్‌ఎన్‌ఎన్? ఎందుకు పాటిస్తున్నారు? దాని పూర్వాపరాలు తెలుసుకుందాం. (NNN)
శృంగారానికి చాలా మంది దూరంగా ఉండలేరు. ఇదేం పాడు పని? అసలు శృంగారానికి దూరంగా ఉండాలని ఎవరు చెప్పారంటూ కొందరు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ ఎన్‌ఎన్ఎన్ సంప్రదాయం 2010 నుంచే ఉందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొందరు పురుషులు NNN పేరుతో నవంబర్ నెల మొత్తం నిగ్రహంగా ఉంటున్నారట. ఈ నెల వచ్చిందంటే చాలు.. కొందరు బుద్ధిమంతులైపోతున్నారట. అశ్లీలత పేరు వింటే చాలు ఆమడదూరం వెళ్తున్నారట.
ఇప్పటి వరకు సోషల్ మీడియా ద్వారా వేలాది మంది No Nut November అంటూ పలువురికి అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 30 రోజులపాటు సంఘీభావం తెలుపుతూ.. వివిధ సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. నెల మొత్తం శృంగారం, స్వయంతృప్తికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.
మగవారిలో చాలా మంది శృంగార కోరికలు అదుపు చేసుకోలేరు. దానివల్ల పోర్న్ వీడియోలు చూడటం, స్వయంగా తృప్తి పొందడం, భాగస్వామితో కోరికలు తీర్చుకోవడం చేస్తుంటారు. ఇలాంటి చర్యలకు కనీసం ఒక నెల విరామం తెలిపితే.. ఆరోగ్యానికి, మనోల్లాసానికి మంచిదని ఎన్‌ఎన్ఎన్ పండితులు హితబోధ చేస్తున్నారు. నవంబర్ నెలను ఇందుకు వేదిక చేసుకున్నారు. తాము ఎంత వరకు నిగ్రహంగా ఉండగలమనేది పరీక్షించుకుంటారు. సెక్స్ మీద మనసు మరలకుండా ఉండేందుకు ఇతర విషయాల మీద దృష్టిపెడతారు. దీనివల్ల మానసిక స్పష్టత ఏర్పడుతుంది. ఒక వేళ ఈ దీక్షను పాటించడంలో విఫలమైతే.. వారు తమ లైంగిక జీవితాన్ని కంటిన్యూ చేస్తుంటారు.
2020లో కరోనా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా చాలా జంటలు దూరంగా గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో విజయవంతంగా ఎన్ఎన్ఎన్ పాటించారట చాలా మంది మగవారు. అయితే, ప్రస్తుతం భాగస్వామితో సంసార జీవితంలో ఉన్న వారికి ఈ నో నట్ నవంబర్ అనేది వర్కవుట్ అయ్యే పని కాదంటున్నారు చాలా మంది. లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉన్నవారిలో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని రుజువులు కూడా చెబుతున్నారు.
అలాంటి వారే ఈ ఉద్యమం చేశారా?
* సెక్స్ అంటే ఇష్టం లేని వారు, జీవత భాగస్వామితో ఇబ్బందులున్న వారే ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టారనే ఆరోపణలున్నాయి.
* ఎక్కువ రోజులు సెక్స్‌కు దూరంగా ఉండే పురుషులు ఇలాంటి చర్యలు చేస్తుంటారంటున్నారు.
* స్త్రీలంటే ద్వేషం ఉన్న వారు నో నట్స్ నవంబర్ పేరుతో హంగామా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
* ఇతరులను పరీక్షించాలని చూసే వారు ఇలాంటి చర్యలకు ప్రేరేపిస్తున్నారని చెబుతున్నారు.
* ఇతరులు నెల రోజులపాటు లైంగిక చర్యల్లో పాల్గోకుండా ఎంత నిగ్రహంగా ఉంటారో చూడాలనే కాన్సెప్ట్‌తోనే ఎన్ఎన్ఎన్‌ను తెరపైకి తెచ్చారని చెబుతున్నారు.
శృంగారంలో పాల్గొంటే శారీరక, మానసిక ఆరోగ్యం మీ సొంతమవుతుందని వైద్యులు కుండబద్ధలు కొడుతున్నారు. అలాంటప్పుడు ఈ ఉద్యమాన్ని ఎంతమంది కొనసాగిస్తారనేది వేచి చూడాల్సిందే.
Read Also : Atha Kodalu: అత్త పోరు పడలేకపోతున్నారా? పరిష్కారం ఇదిగో.. ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు!