సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Sports

Sanju Samson: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌ ఆడే చాన్స్ మిస్.. రోహిత్ ఏమన్నాడంటే..

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 23 అక్టోబర్ 2024

Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో సౌతాఫ్రికాపై పైచేయి సాధించి టీమిండియా చాంపియన్ గా అవతరించిన సంగతి విధితమే. టీమిండియా 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే, తొలిసారి ప్రపంచ కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న వికెట్‌కీపర్‌ సంజు శాంసన్‌ (Sanju Samson)కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే చాన్స్ దక్కలేదు.

రోడ్ యాక్సిడెంట్ తర్వాత వికెట్ కీపర్ రిషభ్‌ పంత్ తిరిగి టీమిండియాలోకి వచ్చాడు. దీంతో సంజూ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, సౌతాఫ్రికాతో ఫైనల్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉండాలని శాంసన్‌కు తెలిపాడట. కానీ, టాస్‌కు కొన్ని నిమిషాల ముందే టీమ్ లో ఛేంజెస్ చేయకుండా బరిలోకి దిగుతున్నట్లు హిట్ మ్యాన్ తనతో చెప్పాడని సంజూ లేటెస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

తనకు టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ ఆడే చాన్స్ వచ్చిందని, ఆడేందుకు సర్వ సన్నద్ధం అవ్వాలని చెప్పారన్నాడు. తాను మ్యాచ్‌కు సిద్ధమయ్యానన్నాడు. కానీ, అదే జట్టుతో వెళ్దామని టాస్‌ ఎగరేసే ముందు నిర్ణయం తీసుకున్నారన్నాడు. తనకు ఈ విషయంలో బాధగా లేదని, వార్మప్‌ చేస్తున్న సమయంలో హిట్ మ్యాన్ తనను పక్కకు తీసుకెళ్లి ఇందుకు గల కారణాలను వివరించాడని సంజూ గుర్తు చేసుకున్నాడు. అర్థం చేసుకున్నావా అని తనతో రోహిత్ అడిగాడని, దానికి తాను మొదట మ్యాచ్ గెలుద్దామని, తర్వాత మాట్లాడుకుందామని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. మ్యాచ్ పైనే ఫోకస్ పెట్టాలని హిట్ మ్యాన్ కు చెప్పినట్లు సంజూ తెలిపాడు.

అయితే, కొద్ది సేపు గడిచిన తర్వాత కెప్టెన్ తన వద్దకు వచ్చి.. మనసులో తిట్టుకుంటున్నావని తనకు తెలుసని, సంతోషంగా లేవంటూ తనతో అన్నాడని సంజూ తెలిపాడు. తమ కన్వర్జేషన్ పూర్తయ్యాక ఒక ఆటగాడిగా తాను ఆడాలనుకుంటున్నానని చెప్పినట్లు సంజూ అన్నాడు. హిట్ మ్యాన్ కెప్టెన్సీలో తనకు వరల్డ్ కప్ ఫైనల్లో ఆడేచాన్స్ దక్కనందుకు బాధపడ్డానని సంజూ గుర్తు చేసుకున్నాడు.

ఇవీ చదవండి: Rohit sharma: ఫిట్ నెస్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
Mohammed Shami: ఫిట్ నెస్ పై కీలక స్టేట్ మెంట్ ఇచ్చిన మహ్మద్ షమీ
IND vs NZ: టీమిండియాకు ఏమైంది? మరీ 46 పరుగులకే ఆలౌటా?
Gautam Gambhir: కోహ్లీ పరుగుల దాహం.. గంభీర్ ఏమన్నాడంటే..
Rohit Sharma: హిట్ మ్యాన్ వేలంలోకి వస్తే బాక్సులు బద్దలే!

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading