Rohit sharma: తన ఫిట్‌నెస్ పై జరుగుతున్న ప్రచారం, విమర్శలపై టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ స్పందించాడు. తాను 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల మైలురాయికి చేరువలో ఉన్నానని చెప్పాడు. ఫిట్‌నెస్ లేకుండానే ఇన్ని మ్యాచ్‌లు ఎలా ఆడగలిగానని క్వశ్చన్ చేశాడు. ఓ యూట్యూబ్ షోలో రోహిత్ శర్మ మాట్లాడారు. 17 ఏళ్ల పాటు ఆడటం, 500 అంతర్జాతీయ మ్యాచ్‌లకు చేరువ కావడం చిన్న విషయం కాదన్నాడు హిట్ మ్యాన్.
ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది క్రికెటర్లు మాత్రమే 500 మ్యాచ్ ల మైలురాయిని చేరుకోగలరన్నాడు. ఇంత సుదీర్ఘ కాలం కొనసాగాలంటే లైఫ్ స్టైల్ పై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నాడు. ఫిట్‌నెస్ చూసుకోవడం, మెదడును నియంత్రణలో ఉంచుకోవడం, స్వీయ సాధన లాంటి అంశాలుంటాయన్నాడు. అలాగే మ్యాచ్‌కు ఎలా ప్రిపేర్ అయ్యామన్నది కూడా ముఖ్యమన్నాడు. మ్యాచ్ కోసం 100 శాతం సిద్ధంగా ఉండి, విన్ అయ్యేలా ప్రదర్శన ఉండాలన్నాడు. ఇందుకోసం ఫిట్ నెస్ కాపాడుకోవడం కీలకం అని వ్యాఖ్యానించాడు.
వరల్డ్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లతో కలిపి ఇప్పటివరకు పది మంది మాత్రమే 500 మ్యాచ్ ల మైలురాయిని చేరుకున్నారని హిట్ మ్యాన్ తెలిపాడు. ఇందులో నలుగురే భారత క్రికెటర్లున్నారని చెప్పాడు. ప్రస్తుతం 485 మ్యాచ్‌లతో తాను ఆ మైలురాయికి చేరువగా ఉన్నానని తెలిపాడు.
Pooran: నికోలస్ పూరన్ విధ్వంసం.. అరుదైన రికార్డు సొంతం
IPL: టీమిండియా క్రికెటర్లకు మరో గుడ్ న్యూస్..
MS Dhoni: ధోనిపై గౌతీ, హర్భజన్ హాట్ కామెంట్స్.. వ్యక్తిని కాదు, టీమ్‌ను చూడాలన్న మాజీలు!
PBKS vs LSG : రికార్డులు బద్దలయ్యాయి.. లక్నో, పంజాబ్ మ్యాచ్‌లో విశేషాలివీ..
