AP Liquor: ఏపీలో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో సర్కారు వైన్ షాపులు నడవగా.. ఇప్పుడు వాటిని తీసేసి మద్యం ప్రైవేటు ద్వారా అమ్మకాలు సాగించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి లిక్కర్ షాపులకు టెండర్ల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే, అధికార పార్టీ, కూటమి పార్టీల నేతల సిండికేట్ కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదన్న వాదన ఉంది. (AP Liquor) తాజాగా మందుబాబులకు ఏపీ సర్కార్ మరో అప్ డేట్ ఇచ్చింది.
ఇండియాలో తయారయ్యే ఫారిన్ లిక్కర్ బాటిళ్ల ఎమ్మార్పీ ధరకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి రూ.10కి పెంచుతూ సవరణ చేశారు. దీంతో ఎమ్మార్పీ ధర రూ.150.50గా ఉంటే రూ.160కి పెంచేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు ఉండనుంది. రాష్ట్ర గవర్నర్ ఆమోదం మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మద్యం షాపులకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మద్యం దరఖాస్తుల్లో టీడీపీ నేతలదే హవా కొనసాగింది. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులే ఎక్కువ శాతం మద్యం దుకాణాలు దక్కించుకునేలా అడుగులు వేశారన్న ఆరోపణలు టీడీపీ నుంచే వినిపించాయి.
దరఖాస్తుల ప్రక్రియ ముగిసే సరికి 3,396 దుకాణాలకు సంబంధించి 87,986 అప్లికేషన్లు వచ్చాయి. ఇవన్నీ మేజర్ పర్సెంట్ టీడీపీ నేతలవేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి రూ.1,759.72 కోట్ల మేర ఆదాయం చేకూరింది. అయితే, ఇది తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే తక్కువేనని విశ్లేషణలు వస్తున్నాయి. అక్కడ మద్యం షాపులు తక్కువ, దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని, ఏపీలో మాత్రం మద్యం షాపులెక్కువ, ప్రభుత్వానికి ఆదాయం తక్కువగా చేకూరిందని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: AP Liquor: వైన్ షాపుల దరఖాస్తుల్లో ఎక్సైజ్ అధికారులకూ..
CBN on Liquor Syndicate: లిక్కర్ సిండికేట్‌పై చంద్రబాబు ఏమన్నారంటే..
Liquor: అత్యంత కిక్కు ఇచ్చే లిక్కర్ ఏదో తెలుసా?
AP Liquor Policy: ఏపీలో నూతన మద్యం పాలసీకి కేబినెట్ సబ్ కమిటీ
CBN on BJP Alliance: బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తృప్తి, ఆనందం: చంద్రబాబు
