Scorpion: సాధారణంగా తేలు కుట్టినా చాలా మంది చనిపోతుంటారు. దాన్ని చూస్తేనే చాలా మంది భయపడిపోతారు. మనిషి భయపడిపోతారు. కొన్ని రకాల తేళ్లు (Scorpion) కుడితే కుట్టిన చోట నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ కూడా లేవని చెబుతారు. తేలుకి కొండిలో విషం ఉంటుంది. అయితే తేలు విషం చాలా ఖరీదు.. తేలు విషాన్ని అనేక వ్యాధులలో మెడిసిన్ కోసం ఉపయోగిస్తారు టీబీ తగ్గించడానికి క్యాన్సర్ వ్యాధుల నివారణకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గించడానికి తేలు విషం ఉపయోగపడుతుంది.
చుక్క విషం రూ.లక్షల్లో..
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తేలు ఏదో తెలుసా? ఇది అత్యంత ఖరీదైనదని నిపుణులు చెబుతున్నారు. డెత్ స్టాకర్ స్కార్పియన్.. అత్యంత ప్రమాదకరమైన, అత్యంత విషపూరితమైన తేలుజాతిగా తేల్చారు. ఈ తేళ్ల విషం ఒక మిల్లీలీటరు రూ.8 లక్షలకు పైగా ఉంటుంది. ఈ తేలు విషం చాలా విలువైనది. ప్రమాదకరమైనది.
ఖరీదైన విషం
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేలు విషం ఉంది. భూమిపై అనేక విష జీవులు ఉంటాయి. వాటిల్లో తేళ్లు కూడా ఒకటి. తేళ్లు అంటే ప్రజలు భయపడతారు కానీ ఆ తేళ్ల విషం మనకు పనికి వస్తుంది. మనల్ని అనేక రోగాల నుంచి కాపాడుతుందని సైంటిస్టులు తేల్చారు.
విషం ఎలా తీస్తారు?
డెత్ స్టాకర్ స్కార్పియన్ విషాన్ని తీయడానికి దాని స్టింగ్ కు తేలికపాటి విద్యుత్ షాక్ ఇస్తారట. దీని విషాన్ని తొలగించే సమయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. పొరపాటున ఈ విషం తొలగించే సమయంలో వ్యక్తిని కుడితే అతని ప్రాణానికే ప్రమాదం. అందుకే దాని విషాన్ని అత్యంత జాగ్రత్తగా తీస్తారు. డెత్ స్టాక్ స్కార్పియన్ ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో ఉంటుందట.
భారీ డిమాండ్
ఈ తేళ్లు ఉత్తర ఆఫ్రికా నుంచి మధ్య ప్రాచ్యం వరకు ఎడారుల్లో దర్శనమిస్తాయి. ఈ తేళ్లు మన భారతదేశంలో ఉన్న థార్ ఎడారిలో కూడా ఉంటాయట. రాజస్తాన్ లో కొందరు ఈ తేలు విషాన్ని తీసి అమ్ముతుంటారు. సహజంగా దీని విషాన్ని క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలో, బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో వాడతారని చెబుతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలలో డెత్ స్టాకర్ స్కార్పియన్ విషం నుంచి వివిధ రకాల మెడిసిన్స్ ను తయారు చేస్తున్నారు.
ఇవీ చదవండి: Centipede: జెర్రి గురించి ఆసక్తికర విషయాలు తెలుసా? జెర్రి కుడితే ఏం చేయాలంటే..
Mogali Puvvu: ఒక్కసారి ఈ వాసన చూశారంటే ఇక రెచ్చిపోతారు.. మొగలి పువ్వుతో ఏం చేయాలంటే..
Type 1 Diabetes: చైనా సరికొత్త ఆవిష్కరణ.. టైప్-1 డయాబెటిస్ కు విముక్తి
Curd: ఈ 5 సమస్యలున్న వారు పెరుగును అస్సలు తీసుకోరాదట!
