Curd: భోజనంలో నిత్యం తినే పదార్థాల్లో పెరుగు ఒకటి. భోజనం తింటున్నప్పుడు చివర్లో పెరుగు (Curd) లేకపోతే చాలా మందికి అదో వెలితిగా ఉంటుంది. అలా మన భోజనంలో పెరుగు భాగమైపోయింది.
ఇండియాలో పాలు, పాలతో తయారు చేసే ఇతర ప్రొడక్ట్స్ వినియోగం కాస్త ఎక్కువే. అన్ని ప్రాంతాల ప్రజలు పెరుగు ఇష్టంగా తీసుకుంటారు. దీంట్లో ఉండే ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు శరీరానికి కావాల్సిన శక్తిని సమకూరుస్తాయి. అయితే కొందరికి పెరుగు ఇష్టం ఉండదు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు పెరుగు తీసుకోరాదని కూడా చెబుతున్నారు. అలాంటి వారు కర్డ్ తింటే విషంతో సమానం అవుతుందట.
మామూలుగా పెరుగు తింటే జీర్ణక్రియ మరింత బాగా పని చేస్తుంది. ఎముకలు, దంతాలు స్ట్రాంగ్ అవుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి. అధిక రక్తపోటును పెరుగు నియంత్రిస్తుంది. పేగుల కదలికలను బాగు చేసి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. దీంతోపాటు బరువు కూడా కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది. జుట్టు, చర్మం నాజూకుగా తయారు చేస్తుంది. ఈ 5 రకాల సమస్యలున్న వారు పెరుగుకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
1. ఆస్తమా రోగులు
పెరుగు శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది. అయితే, ఆస్తమా వంటి శ్వాస సమస్యలతో బాధపడేవారు ఈ పాల ఉత్పత్తులు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇది చల్లదనాన్ని కలిగించడంతో శ్వాసవ్యవస్థలో కఫం బాగా పెరిగేలా చేస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. చలికాలంలో జలుబు, కఫం సమస్య పెరుగుతాయి కాబట్టి ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
2. ఊబకాయం ఉన్న వారు
పెరుగు తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. కానీ అతిగా తింటే మాత్రం బరువు పెరిగే చాన్స్ కూడా ఉంది. ఊబకాయుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. కర్డ్ లో కొలెస్ట్రాల్ స్థాయిలు కాస్త అధికంగానే ఉంటాయి. అమితంగా తింటే ఇది శరీరంలో పేరుకుపోయి బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవారు పెరుగుకు దూరంగా ఉంటే మంచిది.
3. ఆర్థరైటిస్ రోగులు
పెరుగులోని కాల్షియం ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. అయితే, కీళ్లనొప్పులతో బాధపడేవారు రోజూ పెరుగు తినకూడదు. దీని పుల్లదనం కీళ్ల నొప్పులను మరింత పెరిగేలా చేస్తుంది. పెరుగులో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను దెబ్బతీసి సమస్యను బాగా పెంచుతాయి. దీంతో మోకాలినొప్పులు, కీళ్లవాతం వంటి ప్రాబ్లమ్స్ మరింత పెరుగుతాయి.
4. ల్యుకోరియా బాధితులు
మహిళల్లో ల్యుకోరియా సమస్య ఉన్నవాళ్లు పెరుగు తినరాదని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. వైట్ డిశ్ఛార్జ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు పెరుగు తింటే, ప్రాబ్లమ్ అధికం అవుతుంది. ఇది పొట్ట సమస్యలకు దారితీసి అసౌకర్యాన్ని కలిగేలా చేస్తుంది. వైద్యుల సలహాతోనే వీరు పెరుగు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
5. జీర్ణ సమస్యలున్న వారు
బలహీన జీర్ణ వ్యవస్థ, జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగు తినరాదు. పెరుగులోని ప్రోబయాటిక్స్ పేగు కదలికలను మెరుగు పడేలా చేసినప్పటికీ కర్డ్ జీర్ణం కావడానికి కొంచం సమయం తీసుకుంటుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలు అధికం అవుతాయి. ఇది పొట్టలో గ్యాస్‌ను కలిగిస్తుంది. జీర్ణక్రియ మందగించేలా చేస్తుంది. అందుకే అజీర్తి, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవాళ్లు పెరుగు జోలికి పోరాదు.
Read also: Alia Bhatt: శారీరకంగా ఎంతో శ్రమపడ్డ ఆలియా భట్!
Ram charan Neel: ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రామ్ చరణ్..?
Cricket: టీమిండియా కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్.. నవంబర్ 17 నుంచి దిగ్గజాల టోర్నీ!
Varudu Kalyani: పోలీస్ ఫ్యామిలీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?
