Infosys: ఇండియన్ ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ తన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో భారీ సంస్కరణను తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈమెయిల్‌ల ద్వారా జాబ్ ఆఫర్ లెటర్‌ల జారీని ఆపేసినట్లు తెలిపింది. ఇకపై సంస్థలోకి కొత్తగా వచ్చేవారంతా దరఖాస్తు డీటెయిల్స్ ను యాక్సెస్ చేయడానికి సంస్థ అంతర్గత పోర్టల్‌లోకి మస్ట్ గా లాగిన్ అవ్వాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.
నియామక ప్రక్రియలో మోసాలను నివారించడం, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో ఎంప్లాయీస్ కు మరింత మెరుగైన ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వడమే తమ లక్ష్యమని ఇన్ఫోసిస్ (Infosys) తెలిపింది. అందుకే ఈ తరహా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఉద్యోగార్థులు ఆఫర్ లెటర్‌ను చూపి ఇతర కంపెనీలతో చర్చలు జరపడం, మరింత ఎక్కువ శాలరీ కోసం డిమాండ్లు చేయడం కష్టం అవుతుంది.
ఇంపార్టెంట్ నోటీస్ అంటూ ఇన్ఫోసిస్ ఓ ప్రకటన ఇచ్చింది. ఆఫర్ లెటర్, అనుబంధ పత్రాలు తమ కెరీర్ సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి దీన్ని యాక్సెస్ పొందవచ్చని తెలిపింది. ఇకపై అభ్యర్థులకు ఆఫర్ లెటర్‌లను ఈమెయిల్‌లకు పంపేది ఉండదని సంస్థ పోర్టల్ లో స్పష్టం చేసింది.
ఇండియన్ సాఫ్ట్‌వేర్ సేవల ఇండస్ట్రీలో ఫ్రెషర్‌ల ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన ఇప్పటికే పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఇలాంటి కీలక నిర్ణయం వెలువరించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కంపెనీ ఫైలింగ్‌ల ప్రకారం.. ఈ 2024 ఆర్థిక ఏడాదిలో ఇన్ఫోసిస్ కు 24 లక్షల ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,94,367 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేసి 26,975 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు ప్రకటింది.
Read also: Dasara: దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
Gold rates today 02-10-2024: దసరా ముంగిట పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
USA: అమెరికా వెళ్లే వారికి గుడ్ న్యూస్..
Vantalakka: ఇది చూశారా.. వంటలక్క ఆస్తులు ఎన్ని కోట్లంటే..
Ananya Panday: దక్షిణాదిపై అనన్య ఫోకస్.. ఉపాసన కీ కామెంట్స్
