Heart Attack: గుండె పోటు ఎక్కువగా తెల్లవారుజామునే సంభవిస్తుంటుంది. దీనికి కారణాలను కూడా వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి రోజూ మనం శరీరానికి కొన్ని అలవాటు చేస్తుంటాం. ఉదాహరణకు ఉదయం అల్పాహారం సేవించడం, లేదా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి భోజనం తినడం అలవాటుగా మారి ఉంటుందనుకుందాం. ఆ సమయానికి మన కడుపులో ఆటోమేటిగ్గా ఆకలి స్టార్ట్ అవుతుంది. ఇలాగే నిద్ర పోవడం లేదా నిద్ర లేవడం కూడా ఒకే సమయానికి చేస్తున్న వారికి శరీరంలో కొన్ని హార్మోన్లు ఆటోమేటిగ్గా పని చేస్తుంటాయి. (Heart Attack)
చాలా మందికి గుండెపోటు వచ్చే సూచనలు ముందే తెలిసిపోతుంటాయని చెబుతుంటారు. ముఖ్యంగా అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిపోయిన వారి విషయంలో గుండెపోటు ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా వింటర్ సీజన్‌లో ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటు లాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఉదయాన్నే లేవడం అలవాటు ఉన్న వారికి తెల్లవారుజామున 3 లేదా 4 గంటల సమయానికి బాడీలో కొన్ని హార్మోన్లు పని చేయడం మొదలు పెడతాయి. బీపీ పెరిగే హార్మోన్లు పని చేయడం ప్రారంభిస్తాయి. ఇలాంటి సమయంలో బీపీ పెరుగుతుంది. నార్మల్‌గా ఉన్న వారిలో ఇవి పని చేయడం ద్వారా నిద్ర మేల్కొంటారు. అదే హైబీపీ ఉన్న వారిలో ఇది ఇంకా ఎక్కువ అవుతుంది.
రాత్రి నిద్రపోతున్నప్పుడు తక్కువగా ఉన్న బీపీ.. ఉదయాన్నే పెరిగిపోతుంది. ఇలా సడెన్‌గా బీపీ పెరగడం వల్ల పక్షవాతం, గుండెపోటు లాంటివి వస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి పరిష్కారంగా బీపీ ఉన్న వారు వేసుకొనే మందులు ఓ సారి చూసుకోవాలని చెబుతున్నారు. వైద్యులను సంప్రదించి.. కాంబినేషన్ మాత్రలు ఉన్నప్పుడు.. బీపీ మాత్రలు ఒకటి పొద్దున, ఇంకోటి రాత్రికి వేసుకోవడం ద్వారా రాత్రిపూట, ప్రత్యేకించి తెల్లవారుజామున హార్ట్ అటాక్, పక్షవాతం లాంటివి రాకుండా ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో బీపీ చెక్ చేసుకొనే మిషన్లు ఇంట్లో ఉంటే బెటర్ అని వైద్యులు చెబుతున్నారు.
గుండెపోటు రాకుండా నివారణ చర్యలు..
గుండెపోటు వచ్చిన సందర్భాల్లో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చేపలు తినేవారిలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చేపల నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికమొత్తంలో దొరుకుతాయి. గుండె జబ్బులు, ఆర్థరైటిస్, డిప్రెషన్, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించడంలో ఈ ఒమేగా-3 ముఖ్య పాత్ర పోషిస్తుంది. వారానికొక్కసారైనా చేపలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు వారంలో అయిదు రోజులు 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి, నడవాలని సూచిస్తున్నారు.
మానసిక ఒత్తిడితో కూడా కరొనరి హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. టైప్-ఎ పర్సనాలిటీ లో మానసిక ఒత్తిడి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. కొందరు అనుకున్న పని పూర్తికాకపోతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు. యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడికి గురయ్యే వారు ప్రశాంతంగా ఉండగలుగుతారని నిపుణులు సూచిస్తున్నారు. యోగా చేయడం వల్ల గుండె జబ్బులు కాస్త అరికట్టవచ్చని చెబుతున్నారు.
గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు మొదలైన చిరుదాన్యాలలో కరిగే రకం పీచు ఎక్కువగా ఉంటుంది. వీటి నన్నిటినీ పొట్టుతో పాటు కలిపి పిండి పట్టించుకు వాడటం చాలా మంచిదని నిపుణులంటున్నారు. మిగతా ధాన్యాలతో పోలిస్తే ఓట్స్‌లో పీచు ఎక్కువగా ఉంటుంది. దీనితో జావ, ఉప్మా ఇలా రకరకాలుగా చేసుకుని తినటం మంచిదట. పండ్లలో ప్రధానంగా తోలు, గింజలు ద్వారా పీచు అధికంగా లభిస్తుంది. బొప్పాయి, జామ వంటి పండ్లలో పెక్టిన్ రూపంలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల గుండెకు మేలు చేస్తుంది.
Read Also : Coriander Water Benefits: ధనియాల నీళ్లు తాగితే దండిగా ఉపయోగాలు!