Coriander Water Benefits: ధనియాల నీళ్లు తాగితే దండిగా ఉపయోగాలు!

Coriander Water Benefits: మనలో చాలా మంది ఉదయం లేవగానే వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగుతుంటాం. మరికొందరు వేడి నీళ్లు తాగుతుంటారు. ఇంకొందరు వేడినీళ్లలో నిమ్మకాయ పిండి, తేనె కలిపి తీసుకుంటూ ఉంటారు. కాఫీ, టీల కంటే వేడి నీళ్లు మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు వంటింట్లో దొరికే కొన్ని వస్తువులతో ఉదయాన్నే ధనియాల నీరు (Coriander Water Benefits) తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు.

ధనియాలు (Coriander Water Benefits) కొత్తమీర చాలా అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్, శ్వాస సమస్యలను దూరం చేసుకోవచ్చు. నిద్రలేమి సమస్య ఉన్నా తీరిపోతుంది. శరీరంలో వేడి సమస్య ఉన్న వారు రోజూ ధనియాల నీరు తీసుకోవాలి. దీని వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరంలో వేడి ఉన్న వారు నిద్ర పట్టక, ఒంట్లో నలతగా ఉండటం లాంటి సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఇలాంటి వారు ధనియాల నీరు తీసుకోవాలి.

ముందుగా ధనియాలు నీటిలో వేసి మరిగించాలి. రెండు గ్లాసుల నీరు తీసుకొని ఒకే గ్లాసుకు రాగానే వాటిని చల్లార్చి తాగాలి. ఇలా రోజూ ఖాళీ కడుపుతో ఓ గ్లాసు ధనియాల నీళ్లు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ధనియాలను నూనెతో కలిపి తీసుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి కూడా బయట పడొచ్చని చెబుతున్నారు. ధనియాలతో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రోజూ మన ఆహారంలో ధనియాలు ఉండేలా చూసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

కూరలు రుచిగా రావాలన్నా, మసాలా దట్టించి వేయాలన్నా ధనియాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మధుమేహాన్ని నియంత్రించడంలోనూ ధనియాలది కీలక పాత్ర. ధనియాల్లో కొవ్వును కరిగించే శక్తి ఉంటుంది. జుట్టు సమస్యలకూ ధనియాలతో చెక్ పెట్టవచ్చు. ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన, అలసట లాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు ధనియాలను వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ధనియాలలో K, C, A వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టు బలంగా, వేగంగా పెరగడానికి ఇవి చాలా అవసరం అవుతాయి. ఉదయాన్నే ధనియాల నీళ్లు తాగడం వల్ల మీ జుట్టు రాలడం, చిట్లడం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ధనియాల నూనెను హెయిర్ మాస్క్‌గా కూడా అప్లై చేయవచ్చు. దీంతో మంచి ఫలితం వస్తుంది. ధనియాల్లో జీర్ణ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ఉదయాన్నే ధనియాల నీరు తాగితే జీర్ణక్రియ పనితీరు బాగుపడుతుంది. జీవక్రియ కూడా వేగవంతం అవుతుంది. ఈ రెండు లక్షణాలు బరువు తగ్గించేందుకు దోహదం చేస్తాయి.

ధనియాలలో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలం. ఉదయాన్నే ఈ నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మృదువుగా కూడా అవుతుంది. నల్లమచ్చలు, మొటిమల సమస్యలు ఉంటే వాటిని పారదోలుతుంది. ధనియాలలో కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌ చేసే పోషక గుణాలు ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ తో సఫర్‌ అవుతుంటే రోజూ ధనియాల నీరు తాగాలి. వెంటనే ఫలితం కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మధుమేహులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు.

Read Also : Cooking Oils: కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలంటే ఈ వంట నూనెలు వాడాలి!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles