HomeCinemaNiharika Divorce: వాళ్లిద్దరూ విడిపోయారు.. నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య విడాకులు

Niharika Divorce: వాళ్లిద్దరూ విడిపోయారు.. నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య విడాకులు

Niharika Divorce: మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య దంపతులు విడిపోయారు. కొన్నాళ్లుగా అందరూ ఊహించిందే నిజమైంది. ఆ వార్తలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఈ మధ్యనే ఈ జంటకు విడాకులు మంజూరయ్యాయి. కాకపోతే ఈ విషయం అత్యంత గోప్యంగా ఉంచడం గమనార్హం. విడాకులు మంజూరైన నెల రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. నిన్ననే మీడియాలో ఈ విషయం వెలుగు చూసింది. నిహారిక తన భర్తతో విడిపోయిందంటూ కొన్నాళ్లుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అధికారికంగా నిన్ననే తెలిసింది. (Niharika Divorce)

చైతన్యతో (Chaitanya Jonnalagadda) విడాకుల ప్రక్రియ పూర్తయింది. కోర్టు జూన్‌ నెల 5వ తేదీన వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ఈ-కోర్ట్స్‌ వెబ్‌ సైట్‌లో పూర్తి వివరాలు ఉంచారు. అయితే, వీరిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడిపోయారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది మాత్రం తెలియరాలేదు. కొన్నాళ్లుగా నిహారిక, చైతన్య మధ్య మనస్పర్దలు ఉన్నాయని తెలుస్తోంది. ఏడాది కిందటే వీళ్లు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవల చైతన్య తన ఇన్‌స్టా గ్రామ్‌ నుంచి నిహారికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను డిలీట్‌ చేయడంతో వీరి మధ్య అనుబంధం దెబ్బతినిందనే వార్తలు గుప్పుమన్నాయి.

Is Niharika divorced? - Telugu Rajyam

వీరు విడిపోతున్నారనే వార్తలు వైరల్‌ అయ్యాయి. దీని తర్వాత కొన్ని రోజులకు తన భర్తకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నిహారిక (Niharika Konidela) డిలీట్‌ చేసేసింది. దీంతో విడిపోతున్నారనే విషయం మరింత బలపడింది. అనంతరం మెగా ఫ్యామిలీలో (Mega family) జరిగిన శుభకార్యాలకు నిహారిక ఒక్కతే హాజరు కావడంతో మరింత క్లారిటీ వచ్చినట్లయింది. నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్‌ ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్‌కు నిహారిక ఒకతే వచ్చింది. ఈ సమయంలో చైతన్య రాకపోవడంతో వీరు విడిపోయారనే వార్తలకు బలం చేకూరింది.

ఇక అధికారికంగా విడాకులు మంజూరయ్యాయన్న వార్త నిన్న అందరికీ తెలిసింది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. మొన్నా మధ్య నిహారిక హైద‌రాబాద్‌లో త‌న ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి కొత్త కార్యాలయాన్ని ప్రారంభం చేసింది. ఇటీవల ఈ ఆఫీస్ పూజా కార్య‌క్ర‌మాలు కూడా జ‌రిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను నిహారిక సోష‌ల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో నిహారిక‌ భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ గానీ, మెగా కుటుంబానికి సంబంధించిన ఎవరూ కనిపించలేదు. సోలోగా నిహారిక అన్ని ప‌నులు చ‌క్క‌బెడుతూ కనిపించింది.

2020 డిసెంబరులో టెక్ అఫిషియల్ చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. ఉదయ్‌పుర్ వేదికగా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ వైభవంగా జరిగింది.

విడాకుల అంశం బయటకు రావడంతో ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి కుమార్తె శ్రీజ రెండో వివాహానికి సంబంధించిన విడాకుల వ్యవహారం, అలాగే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మూడో భార్యతో విడాకుల టాపిక్‌ కూడా చర్చనీయాంశమయ్యాయి. శ్రీజ కూడా భర్త కల్యాణ్‌దేవ్‌తో విడిపోయిందనే వార్తలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. అలాగే పవన్‌ కల్యాణ్‌ తన మూడో భార్య అన్నాలెజినోవాతో విడిపోయారని, తన పిల్లలను తీసుకొని ఆమె స్వదేశానికి వెళ్లిపోయిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Read Also : Gold rates today (05-07-2023): కాస్త పెరిగిన బంగారం ధర.. నేడు పసిడి, వెండి రేట్లు ఇవీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు