CM Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటకు బయల్దేరారు. జగన్ హస్తినకు వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక తీపికబురు అందిస్తున్న కేంద్రం.. తాజాగా మరో కీలక వార్త ఏపీ ప్రజలకు అందించబోతోందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పోలవరానికి నిధులు విడుదల చేసేలా కేంద్రాన్ని కోరడం, అందుకు కేంద్ర జలవనరుల శాఖ సమ్మతించడం తెలిసిందే. అంతకు ముందు కూడా సుమారు 40 వేల కోట్లకుపైగా నిధులను కేంద్రం నుంచి జగన్ సర్కార్ సాధించుకోగలిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు కింద 10 వేల కోట్లకుపైగా నిధులు మంజూరయ్యాయి. తాజాగా జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మరోసారి రాష్ట్రానికి ప్రత్యేక నిధులు, ప్యాకేజీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. (CM Jagan Delhi Tour)
బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తుంటుంది. ఇందులో భాగంగానే సుమారు 22 వేల కోట్ల రూపాయల ప్రత్యేక సాయం అందించేందుకు కేంద్రం సిద్ధమైందని తెలుస్తోంది. ఈ నిధులతో వెనుకబడిన జిల్లాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బుందేల్‌ఖండ్ తరహాలో రూ.22 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించనుందని, ఈ వివరాలు జగన్‌కు చెబుతారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఈ అంశం కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో నడుస్తోంది. ఏటా అప్పులు పెరిగిపోతున్నాయి. రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని చెప్పిన కేంద్రం ఎనిమిదేళ్లపాటు పట్టించుకోలేదన్న వాదన ఉంది. అయితే, గత ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామి అయి ఉండి కూడా నిధులు రాబట్టలేకపోయింది. మంత్రి పదవులు షేర్ చేసుకున్నా సరే.. కేంద్రం రాష్ట్రంపై కరుణ చూపలేదు. అయితే, ప్రత్యక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. అయితే, అటు తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక హోదాకు పట్టుపట్టడంతో ఆ ట్రాప్‌లో చంద్రబాబు చిక్కుకున్నారు. దీంతో అటు ప్రత్యేక ప్యాకేజీ, ఇటు ప్రత్యేక హోదా రెండూ సాధించలేకపోయారు చంద్రబాబు.
కేంద్రంతో సఖ్యత.. నిధులు రాబడుతున్న జగన్!
2019లో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత కేంద్రంతో నేరుగా మద్దతు పలకకున్నా.. సఖ్యతగానే మెలుగుతున్నారు. అనేక అంశాల్లో కేంద్రానికి తన నైతిక మద్దతు ఇస్తున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం, ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటుభర్తీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, గృహ నిర్మాణం, గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, ఇతర అభివృద్ధి పథకాల కోసం నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు రెప్రజెంటేషన్ ఇస్తూ వస్తున్నారు.
ఇటీవల ఏపీపై కేంద్రం కరుణ చూపిస్తోంది. నిధులు విడతల వారీగా విడుదల చేస్తోంది. మొన్నామధ్యనే పోలవరానికి సుమారు 12 వేల కోట్లు మంజూరు చేసింది. అటు తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అందించేందుకు సుదీర్ఘ కసరత్తు చేసిన కేంద్రం.. ఆ మేరకు సీఎం జగన్‌కు, రాష్ట్రానికి తీపి కబురు చెప్పనుందని తెలుస్తోంది. ఆ కసరత్తు ఇవాళే కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యేక ప్యాకేజీ కబురుతో సీఎంకు వెల్‌కమ్ చెప్పనుందట కేంద్రం. ఢిల్లీ పర్యటన సందర్భంగా నిధులు, ప్యాకేజీ… ఇలా వరాల జల్లు కురిపించడంతో ఇక్కడ ప్రతిపక్షానికి నిద్రకరువవుతుందనే విశ్లేషణలు వస్తున్నాయి.
Read Also: Central Funds to Andhra Pradesh: ఢిల్లీ వెళ్తాడు.. నిధులు తెస్తాడు.. రిపీటు!! సీఎం సీట్లో సరైనోడు..!
