Medical Colleges : వైయస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ పనులను ప్రారంభిస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రయివేటీకరణ చేయాలన్న నిర్ణయంపై మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబుకు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తూ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నాడని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు, మంత్రులు చెబుతున్న అబద్దాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి, ప్రజలు, మేధావులు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే… (Medical colleges)
వైయస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయం
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు అనేది వైయస్ జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. మేధావులు, విజ్ఞులు కూడా దీనిపై ఆలోచన చేయాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే… 2019-24 తర్వాత వైయస్.జగన్ హయాంలో నీతిఆయోగ్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న ప్రతిపాదనను అందిపుచ్చుకుని ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
అయినా సొంత మీడియాలో తప్పడురాతలు..
ప్రతి ప్రభుత్వ బోధనాసుపత్రి పరిధిలో 500 పడకల ఆసుపత్రి, మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలన్నింటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి అత్యుత్తమ వైద్య విద్యను, వైద్యాన్ని అందించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇంత గొప్ప పనిని ప్రశంసించకపోగా.. తమ చేతిలో మీడియా ఉందని తప్పుడు రాతలు రాస్తూ, తప్పుడు ప్రచారంతో విద్యావంతులను సైతం తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లను కొంత రుసుముతో పేమెంట్ కోటా తరహాలో చేసి ఆ వచ్చిన మొత్తాన్ని ఆయా కాలేజీల నిర్వహణ, అభివృద్దికి ఉపయోగించాలని ప్రతిపాదన చేస్తే… ఆ రోజు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్, లోకేష్ లు దానిపైన కూడా తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే…ఆ విధానాన్ని రద్దు చేస్తాం.. పేదల సీట్లు అమ్ముకుంటారా అంటూ పెద్ద, పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కాలేజీలనే ప్రైవేటుకు ధారాదత్తం చేస్తామనడం ఎంతవరకు సమంజసం.
ఇవిగో మెడికల్ కాలేజీలు.. కళ్లు తెరిచి చూడండి..
వైయస్ జగన్ ప్రభుత్వ నేతృత్వంలో ఏకంగా 17 మెడికల్ కాలేజీల కోసం అనుమతిలు తెచ్చి, స్దల సేకరణ పూర్తి చేయడంతో పాటు పనులు కూడా మొదలుపెట్టారు. వీటిలో 7 కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయగా… 5 మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే.. వద్దని ఎంసీఐకు లేఖ రాశారు. మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎక్విప్ మెంట్, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కూడా అందని విధంగా వైయస్.జగన్ హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించారు. కనీస హోంవర్క్ చేయకుండా మాట్లాడుతున్న హోం మంత్రి అనిత అయితే కనీస అవగాహన లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకవైపు మచిలీపట్నం లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణం పూర్తయింది. విజయనగరంలో అన్ని రకాల వసతులతో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తైతే…. ఇవేవీ మీ కళ్లకు కనిపించడం లేదా ? పైగా ఎల్లో మీడియాలో 10 కొత్త కాలేజీలకు శ్రీకారం అంటూ అబద్దపు వార్తలు వండి వార్చుతున్నారు.
బాపట్ల ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి…
బాపట్లలో నాడు నేడు కింద అన్ని పీహెచ్ సీలను ఆధునీకరించాం. రూ.3.50 కోట్లతో ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాం. కొత్తగా వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. బాపట్ల ఏరియా ఆసుపత్రిలో గతంలో ఒక ఎమర్జెన్సీ వార్డులో రెండు ఆక్సిజన్ బెడ్స్ ఉండే పరిస్థితి నుంచి కోవిడ్ మహమ్మూరిని సమర్ధవంతంగా ఎదుర్కున్నాం. ఇప్పుడు 120 ఆక్సిజన్ బెడ్స్, ఆక్సిజన్ ప్లాంట్, ఐసీయూ వైయస్.జగన్ ప్రభుత్వంలో నిర్మాణం చేశాం.
ఇవీ చదవండి: Medical Colleges : ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై విమర్శలు
Way2news Conclave : జగన్ విజన్‌తో అభివృద్ధి.. చంద్రబాబు కలలు అసాధ్యం.. వే2న్యూస్ కాంక్లేవ్‌లో సజ్జల కామెంట్స్
Pawan Kalyan : సూపర్ సిక్స్-సూపర్ హిట్.. పార్టీలు వేరైనా ప్రజాశ్రేయస్సే లక్ష్యం : పవన్ కల్యాణ్
YS Jagan PC : మహిళలకు రూ.1,500, నిరుద్యోగభృతి ఏదీ? సూపర్ సిక్స్ ఎలా హిట్? : జగన్
