HomeAndhra PradeshWay2news Conclave : జగన్ విజన్‌తో అభివృద్ధి.. చంద్రబాబు కలలు అసాధ్యం.. వే2న్యూస్ కాంక్లేవ్‌లో సజ్జల...

Way2news Conclave : జగన్ విజన్‌తో అభివృద్ధి.. చంద్రబాబు కలలు అసాధ్యం.. వే2న్యూస్ కాంక్లేవ్‌లో సజ్జల కామెంట్స్

Way2news Conclave : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాలనలో (2019-2024) సాధించినది అభివృద్ధి విజన్‌ అని వైఎస్సార్ సీపీ (YSRCP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వే2న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంక్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. (Way2news Conclave)

విజన్ తో ఆలోచిస్తాం..
టీడీపీ అధికారులు చేస్తున్న దుష్ప్రచారాలను ఖండించి, జగన్ ప్రభుత్వం ప్రజలకు చేసిన సంక్షేమం, విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు. “వైసిపి విజన్‌తో ఆలోచిస్తాం.. మా పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వాన్ని నడిపారు” అని సజ్జల చెప్పారు.

మధ్యవర్తులు లేకుండా సంక్షేమం
జగన్ ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధిని చేయించింది. “లబ్ధిదారులకు మధ్య ఎవరూ లేకుండా ప్రభుత్వం లబ్ధిదారుడు నేపథ్యంలో పథకాలు అందించాం” అని చెప్పారు. విద్యా విభాగంలో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ సిలబస్, ఐబీసీ వంటి సంస్కరణలు మొదలుపెట్టారు. “ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కోసం ప్రభుత్వం ద్వారా డబ్బులు కట్టి విద్యను అందించాం.. మా ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ అడ్మిషన్స్ పెరిగాయి” అని సజ్జల పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకం పేరుతో రూ.15,000 ఇవ్వడంతో పాటు 16 వేల కోట్ల రూపాయలతో పాఠశాల అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.

మౌలిక సదుపాయాలు
పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఆరోగ్యంజగన్ ప్రభుత్వంలో మూడు సంవత్సరాల్లో రామయ్యపట్నం, రావులపాడు, మచిలీపట్నం, కాకినాడ పోర్టులను మొదలుపెట్టి, కొన్నిని పూర్తి చేశారని సజ్జల చెప్పారు. “10 ఫిషింగ్ హార్బర్లను కొత్తగా మొదలు పెట్టాం” అని తెలిపారు. 2024లో వచ్చి సంవత్సరంలోనే మిగిలిన పోర్టులను పూర్తి చేసేవాళ్లం అని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పూర్తిగా ప్రజలకు అందుబాటులకు వచ్చేవి. “2029 సంవత్సరానికి జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధి చెందేది” అని సజ్జల అంచనా వేశారు.

రాజధాని వివాదం గురించి..
రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సజ్జల సూచించారు. “లక్ష కోట్లతో బూచి ఖలీఫా లాంటి టవర్లు నిర్మిస్తామంటూ తీసుకున్న నిర్ణయాలు సరికాదు.. లులు మాల్ వంటి వాటి వల్ల ఎంప్లాయిమెంట్ ఎలా వస్తుంది” అని విమర్శించారు. రాజధాని అనేది అడ్మినిస్ట్రేషన్ మాత్రమేనని, జగన్ రాజధానికి వ్యతిరేకం కాదని (తాడేపల్లిలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు) చెప్పారు. “చంద్రబాబు లక్ష కోట్లు తో రాజధాని ఇన్ఫాస్ట్రక్షన్ అవుతుందని చెప్పారు.. కేంద్రం నుండి నిధులతో చేస్తే ఎవరికీ ఇబ్బంది లేదు” అన్నారు. అయితే, ఇప్పటికే చంద్రబాబు రాజధాని కోసం లక్ష కోట్లు అప్పు చేశారని, సంవత్సరానికి 6-7 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. “అప్పులు తీర్చడానికి రాజధాని భూములు అమ్ముతామని చెబుతున్నారు.. 20 కోట్లు ఎకరం అంటే కొనేవారు వస్తారా?” అని ప్రశ్నించారు.

జగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయంలో రాజధాని ప్రాంతం కూడా ఉందని, మూడు రాజధానులు నిర్మించడం వల్ల ఖర్చు తగ్గుతుందని సజ్జల చెప్పారు. “మా ప్రభుత్వంలో రాజధాని అయిన అమరావతి నుండే పరిపాలన కొనసాగించాం.. చంద్రబాబు నివాసముండే కరకట్ట రోడ్డు నిర్మాణాలు కూడా మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశాం” అని తెలిపారు. గుంటూరు-విజయవాడ మధ్య అభివృద్ధి జరిగిందని, విజయవాడ ఫ్లైఓవర్, కృష్ణానది రిటైనర్ వాల్ జగన్ హయాంలో పూర్తి చేశారని గుర్తు చేశారు. “నాలుగు బిల్డింగుల ఐకానిక్ టవర్ నిర్మిస్తాననడం కరెక్ట్ కాదు” అని విమర్శించారు.

శ్రీలంకలా అయిపోయిందంటూ అబద్ధాలు
టీడీపీ ఇతర పార్టీలు మా ప్రభుత్వ దుష్ప్రచారాలు చేశారని సజ్జల ఆరోపించారు. “శ్రీలంక లాగా ఆంధ్రప్రదేశ్ అయిపోయిందంటూ 14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ అబద్ధపు ప్రచారాలు చేశారు” అని చెప్పారు. చంద్రబాబు సింగపూరు కంపెనీ లేదా మరొక కంపెనీ వెళ్లిపోయిందని ఒక్క పేరు క్లారిటీగా చెప్పరు. “జగన్ సంబంధించినంత వరకు వైసిపి ఏది చెబుతుందో దాని పూర్తి స్థాయిలో మేము చేసి చూపిస్తాం.. ఆ వెసులుబాటు చంద్రబాబుకు లేదు” అని సవాలు విసిరారు.

వైసిపి జగన్ పెట్టిన పార్టీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు జవాబుదారీతనంతో చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నారని సజ్జల చెప్పారు. చంద్రబాబుకు ఉన్న మీడియా వల్ల జగన్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ అనేకసార్లు వాటిని నమ్మించారు. “మీ ప్రభుత్వ హయాంలో గడిచిన ఐదు సంవత్సరాలలో ఎన్ని ఇండస్ట్రీలకు పునాదులు వేశారు.. లులు కంపెనీ ఓ ఇండస్ట్రీ కాదు వాళ్లు సొంత లాభాల కోసం పనిచేసేవాళ్లు” అని విమర్శించారు. అలాంటి వాటికి వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రభుత్వం పెట్టడం కరెక్ట్ కాదన్నారు.

చంద్రబాబు మోసాలు బయటపడ్డాయి
అధికారం కోసం అబద్ధపు హామీలు, ఇతర పార్టీలతో పొత్తు కరెక్ట్ కాదని సజ్జల అన్నారు. ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వంలో మా కార్యకర్తలే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. “ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో జగన్ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం” అని చెప్పారు. ప్రజలందరికీ చంద్రబాబు మోసం చేశాడని అర్థమైంది. “వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు సద్వినిగం చేసుకోవటం లేదు” అని విమర్శించారు.

ప్రభుత్వం ప్రవేటీకరణ చేస్తామంటే దాన్ని హెచ్చరించడంలో తప్పులేదని, ఆంధ్రప్రదేశ్‌లో ఐదు మెడికల్ కాలేజీలు, ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని సజ్జల తెలిపారు. చంద్రబాబు చేస్తున్న అరాచకాల వల్లే అధికారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. “అందుకనే వాళ్ళకి ముందుగా హెచ్చరిస్తున్నాం.. మీరు చివరి వరకు ఉండాల్సిన వారు ఉద్యోగాలలో దయచేసి తప్పులు చేయొద్దు” అని సలహా ఇచ్చారు.

ఇవీ చదవండి: YS Jagan PC : మహిళలకు రూ.1,500, నిరుద్యోగభృతి ఏదీ? సూపర్ సిక్స్ ఎలా హిట్? : జగన్
Medical Colleges : సంపద సృష్టి అంటే పప్పూబెల్లాల్లా దోచుకోవడమా? : జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు