Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వైపు అనావృష్టి.. మరోవైపు అతివృష్టితో కొన్ని జిల్లాలలో ఖరీఫ్ సాగు సంక్షోభంలో కూరుకుపోతోంది. మరోవైపు ఉల్లికి తోడు అరటి, చినీ అమ్మకం ధరలు కుప్ప కూలిపోయాయి. రైతన్న దిక్కుతోచని స్థితిలోకి వెళ్తున్నాడు. రైతుల ఆక్రందనలు తీర్చే ప్రయత్నాలు ఈ సర్కారు చేయడం లేదని వ్యవసాయ రంగ నిపుణులు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సాగుపై ఆయన విశ్లేషణ. (Andhra Pradesh)
ఏమిటీ అన్న దాతల ఆక్రందన! తీర్చే ప్రయత్నం ఎంత
మార్కెట్ కు తొలిగా వచ్చే ఉల్లి రైతుల సంక్షోభం కొనసాగుతూ ఉండగానే మరలా డిస్ట్రెస్ సేల్ కు అమ్ముకుంటున్న అరటి, చీనీ (బత్తయి) పంట..
ఈ ఖరీఫ్ లో రాయల సీమ లో ఆగష్టు 7 వరకూ అనావృష్టి తో ఒక్క కర్నూల్ జిల్లాలో తప్ప మిగిలిన జిల్లా లలో సాగు చాలా తక్కువ జరిగినది. ఆ సాగు జరిగిన పంటలు కూడా దెబ్బ తిన్నాయి..
రాయల సీమ హార్టికల్చర్ హబ్
పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిలో అగ్రస్తానం..
రాష్ట్రం మొత్తం అన్ని పంటల ఉత్పత్తి 213 లక్షల టన్నులు అయితే ఇందులో అరటి 74 లక్షల టన్నులు, మామిడి 50 లక్షల టన్నులు, చినీ 24 లక్షల టన్నులు.. ఇందులో ప్రధాన ఉత్పత్తి రాయలసీమ జిల్లాలలోనే..
రాష్ట్ర చరిత్ర లోనే జూన్, జులై లో రైతులు మామిడి కాయలను మొట్ట మొదటిగా రోడ్ల ప్రక్కన పార బోసిన పరిస్థితి చూశాం..
ఉల్లి కర్నూలు ఒక్క జిల్లాలో అదికూడా కొన్ని మండలాలలోనే 31 వేల ఎకరాలలో సాగు జరిగి సుమారు 1.5 లక్షల టన్నుల ఉత్పత్తి.. ఆగష్టు 4వ వారం నుండి కర్నూల్ మార్కెట్ యార్డ్ లో ఉల్లి రైతుల తీవ్ర ఆవేదన ఈ రోజు కీ చాలా బాధాకరంగా కొన సాగుతూ ఉన్నది..
ఇది చాలదు అన్నట్లు పండ్ల సాగు లో అత్యధికంగా 2.74 ల ఎకరాల సాగుతో 74 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి తో అరటి ధరలు క్వింటాలు 500 నుండి 700 రూపాయలకు పడిపోయాయి.
అత్యధికంగా రాయల సీమ జిల్లాలలో కొద్దిగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 2.79 లక్షల ఎకరాల సాగుతో 24 లక్షల టన్నుల ఉత్పత్తితో ఉన్న చీనీ టన్ను 6 వేల నుండి 12 వేల రూపాయలకు పడి పోయి.. దిక్కు తోచని స్థితి లో రైతులు..
అత్యధిక ఉత్పత్తి ఉన్న అరటి, మామిడి, చిని ధరలు పడిపోతే రైతులు ప్రత్యేకంగా రాయల సీమ రైతులు తీవ్రంగా నష్ట పోతారు..
గత సంవత్సరం మిర్చి, పొగాకు, మామిడి డిస్ట్రెస్ సేల్..
వేరుశనగ, మినుము, ప్రత్తి చివరికి ఎంతో ప్రముఖ్యత ఉన్న సోనా మసూరి, నంద్యాల సన్నాలు ధాన్యం కనీస గిట్టుబాటు ధర కూడా రాకుండా అమ్ముకున్న పరిస్థితి..
గత సంవత్సర సంక్షోభం నుండి తేరుకోక ముందే ఈ సంవత్సరం ప్రారంభమే రైతు సంక్షోభం తో మొదలయ్యింది..
అరటి సాగు ఉత్పత్తి
అనంతపురం 46.9 వే ఎ 13 ల ట
కడప 42 వే ఎ 11.5 ల ట
అన్నమయ్య 27.2 వే ఎ 7.63 ల ట
తూ.గోదావరి 26.4వే ఎ 7.18 ల ట
డా.బీఆర్.అంబేద్కర్ కోనసీమ 24.5 వే ఎ 6.63 ల ట
పార్వతీపురం మన్యం 17.8 వే ఎ 4.8 ల ట
నంద్యాల 17 వే ఎ 4.6 ల ట
శ్రీసత్యసాయి 7.7 వే ఎ 2.1 ల ట
విజయనగరం 7.2 వే ఎ 1.9 ల ట
రాష్ట్రం మొత్తం 2.77 ల ఎ 74.25 ల ట
ఇన్ని జిల్లా లలో ప్రధానం గా సాగు జరుగుతూ అనేక రాష్ట్రాలకు ప్రత్యేకంగా దేశ రాజ దానికి ఎంతో ఆరోగ్య కరమైన పండు అందిస్తూ పెట్టు బడి కూడా రాని ధర కు అమ్ముకుంటున్న దుస్థితి..
చినీ సాగు ఉత్పత్తి
అనంతపురం 121 వే ఎ 10.3 ల ట
కడప 93.65వే ఎ 7.53 ల ట
ప్రకాశం 9.14 వే ఎ 78 వే ట
కర్నూల్ 5.1 వే ఎ 45 వే ట
నంద్యాల 4 వే ఎ 28 వే ట
నెల్లూరు 3.34 వే ఎ 28 వే ట
రాష్ట్రం మొత్తం 2.79 ల ఎ 23.7ల ట
ఈ మూడు పంటలు కూడా రాయల సీమకు ప్రధానంగా కేంద్రీకృతమైన పంటలు..
రాయలసీమకే ప్రధానమైన వేరుశనగ+నూనె గింజల సాగు 5 లక్షల ఎకరాలు తగ్గిపోయినది.. వేరుశనగ, మినుముల సాగు జరిగిన పంట కూడా అనా వృష్టికి..అతి వృష్టి కి దెబ్బ తిన్నది..
ఇటువంటి పరిస్థితి లో అత్యధిక ఉత్పత్తి ఉన్న అరటి, చినీ పంటల అమ్మకం ధరలపై ప్రభుత్వం చిత్త శుద్ధితో మార్కెట్ ఇంటర్ వెన్షన్ పథకం ద్వారా ఆదు కోక పోతే రైతాగం తీవ్ర ఆర్ధిక సంక్షోభం లోనికి వెళ్లి పోతారు. ప్రకటనలకే పరిమితం గాకుండా..చిత్త శుద్ధి తో రైతులను ఆదుకోండి.

– ఎంవీఎస్ నాగిరెడ్డి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ (2019-24),
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) సభ్యుడు (2011-14)
ఇవీ చదవండి: Urea : ఆంధ్రప్రదేశ్: ఖరీఫ్‌లో ఇంకా యూరియా ఎంత కావాలి?
