HomeAndhra PradeshUrea : ఆంధ్రప్రదేశ్: ఖరీఫ్‌లో ఇంకా యూరియా ఎంత కావాలి?

Urea : ఆంధ్రప్రదేశ్: ఖరీఫ్‌లో ఇంకా యూరియా ఎంత కావాలి?

Urea : తెలుగు రాష్ట్రాల్లో యూరియా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రైతులు రోజుతరబడి, గంటల తరబడి క్యూలలో నిలబడి నానా అవస్థలు పడుతున్నారు. ఒక్క బస్తా దొరికినా చాలంటూ పడిగాపులుకాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఇప్పటి నుంచి వ్యవసాయానికి ఈ ఖరీఫ్ సీజన్ లో ఇంకా ఎంత యూరియా కావాలి? ఈ అంశంపై వ్యవసాయ రంగ నిపుణులు ఎంవీఎస్ నాగిరెడ్డి విశ్లేషణ. (Urea)

ప్రధాన పంటలైన వేరుశనగ, పప్పు ధాన్యాలకు యూరియా అవసరం లేదు. ప్రత్తి కి ఎరువు వేసే సమయం అయిపోయినది..
యూరియా కావలసినది *వరి, మొక్క జొన్న, చెరకు* పంటలకు.. హార్టికల్ లో కూరగాయలకు, అరటి కి మరి కొన్ని పంటలకు తక్కువ మోతాదు లో కావాలి.

ప్రస్తుతం యూరియా కోసం రైతులు ఆందోళనలకు గురి అవుతున్నది వరి, మొక్క జొన్న సాగు చేసిన ప్రాంతాలలోనే. ఈ ప్రాంతాలలో రైతు లు యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నది వాస్తవం..ఈ సమస్య పరి ష్కారానికి అధికార యంత్రాంగం ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి.

ఖరీఫ్ లో వరికి ఎకరానికి 70 కిలోలు కామ్ ప్లెక్స్ (40 కిలోలు DAP+30 కిలోలు NPK కంబినేషన్ ఉన్న కంప్లెక్స్) 70 నుండి 75 కిలోలు యూరియా 4 ధఫాలు గా వాడతారు.

ఈ ఖరీఫ్ లో 3/9/2025 నాటికి వరి 32 లక్షల ఎకరాలలో సాగు జరిగినది.. దీనిలో 2.5 లక్షల ఎకరాలు 13 వ వారం 27ఆగష్టు నుండి 3 సెప్టెంబర్ వరకూ జరిగినది. జరుగుతున్న వారం, రాబోయే వారం మరొక 2.5 లక్షల ఎకరాలలో సాగు జరగవచ్చు.. ఈ 5 లక్షల ఎకరాలకి మొత్తం డోస్ 70 నుండి 75 కిలోలు యూరియా అవసరం అవుతుంది..
500000×75కేజీలు=37,500 టన్నులు..

13వ వారానికి ముందు సాగు జరిగిన 29.5 లక్షల ఎకరాల పొలం లో లేట్ గా సాగు జరిగిన కొంత పొలానికి ఇంకా రెండు సార్లు, చిరు పొట్ట దశలో ఉన్న పొలానికి ఆకరి డోస్ అవసరం ఉన్నది. అంటే సరాసరిన షుమారుగా ఎకరానికి 40 కేజీల యూరియా అవసరం ఉన్నది..
29,50,000×40=1,18,000 టన్నులు..

మొక్క జొన్నకు వరి కంటే రెట్టింపు పైగా రసాయనిక ఎరువులు వాడతారు.
రాష్ట్రం లో 3/9/2025 నాటికి 3.5 లక్షల ఎకరాలలో మొక్క జొన్న సాగు జరిగినది.. ఇప్పటికి వాడిన ఎరువు పోను ఇంకా షుమారుగా ఎకరానికి 60 కిలోల యూరియా అవసరం ఉండవచ్చు..
3,50,000×60=21000 టన్నులు..

మొత్తంగా
37,500+1,18,000+21000= 1,76,500 టన్నుల యూరియా షుమారుగా ఈ సెప్టెంబర్ ఆఖరి నాటికి (హార్టికల్చర్ కాకుండా) అవసరం అవుతుంది. చెరకు సాగు జరిగింది కేవలం 58 వేల ఎకరాలు మాత్రమే. ఒక సామాన్య రైతు ప్రతినిధిగా అలోచిస్తే అర్ధం అవుతున్నది..

దీనిని బట్టి మన దగ్గర స్టాక్ ఎంత ఉన్నది పోను మిగిలిన యూరియా సెప్టెంబర్ 25 లోపు ఎట్టి పరిస్థితి లోను రాష్ట్రానికి చేర్చుకోక పోతే దిగుబడులపై ప్రభావం చూపి కవులు రైతులు, చిన్న, చిన్న రైతులు నష్ట పోతారు.

– ఎంవీఎస్ నాగిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ (2019-24),
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) సభ్యుడు (2011-14)

ఇవీ చదవండి: Urea AP : ఏపీకి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
Viral Video : యూరియా కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
Urea Shortage : తెలుగు రాష్ట్రాల్లో రైతులకు యూరియా కష్టాలు.. ఎందుకిలా?
Andhra Pradesh Rains : ఏపీలో తీవ్ర వర్షాభావం.. రైతుల్ని పట్టించుకొనే నాథుడెవరు?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు