Andhra Pradesh Rains : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వరుణదేవుడు కరుణించక తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని వైయస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై తొమ్మిది వారాలు పూర్తయ్యాయని, కానీ ఆశించిన స్థాయిలో వర్షం పడలేదన్నారు. రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని, ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. (Andhra Pradesh Rains)
‘‘వరుణ దేవుని కరుణ లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులు విలవిల్లాడుతున్నారు. ఈరోజుకు రాష్ట్రం సరాసరి వర్ష పాతం -26.89% లోటు(Deficit)లో ఉంది. Andhra Pradesh Rains
* 12 జిల్లాలు -20% పైన లోటు (Deficit) వర్ష పాతంలో
* 7 జిల్లాలు -10% పైన లోటు వర్ష పాతంతో తీవ్ర నీటి ఎద్దడిలో ఉన్నాయి.
* ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 9 వారాలు పూర్తి అయినది.
* నడి వర్షా కాలంలో వర్షాలు లేక ఈ ఖరీఫ్ లో రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
* ప్రస్తుత ఖరీఫ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్ష పాత స్థితి చూస్తే 1 జూన్ 2025 నుంచి 7 ఆగస్టు 2025 వరకు..
* రాష్ట్రంలో ఈ రోజు వరకు కురవ వలసిన సరాసరి సాధారణ వర్ష పాతం 287.03 మి.మీ.
* ఈ రోజుకి కురిసిన సరాసరి వర్షం 209.84 మి.మీ
* లోటు వర్షం -26.89%
జిల్లాల వారీగా చూస్తే..
శ్రీ కాకుళం 24.02%
అల్లూరి సీతారామ రాజు -30.67%
అనకాపల్లి -21.14%
కాకినాడ 22.19%
డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమ -32.75%
తూర్పు గోదావరి -22.65%
పశ్చిమ గోదావరి -36.11%
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు -50.99%
శ్రీ సత్యసాయి -29.49%
వైయస్ఆర్ కడప -42.19%
అన్నమయ్య -21.61%
తిరుపతి -23.73%
12 జిల్లాలు (-20%పైన) Andhra Pradesh Rains
మిగిలిన జిల్లాలు సాధారణ వర్ష పాతం (-19 to +19) లో ఉన్నప్పటికీ
పార్వతీపురం మన్యం -16.66%
విశాఖపట్నం -13.65%
కృష్ణా -18.64%
గుంటూరు -11.87%
పల్నాడు -12.18
నంద్యాల -17.83%
చిత్తూరు -12.07%
7 జిల్లాలు -10% కంటే పైన లోటు వర్ష పాతంలో ఉన్నాయి..
జిల్లాల వారీ, పంటల వారీ సాగు వివరాలు ఇప్పటి వరకూ..
రాష్ట్రం మొత్తం మీద మొత్తం సాగు అంచనా 31.15 లక్షల హెక్టార్లలో 16.18 లక్షల హెకార్లు 52%, 6/8/2025 వరకూ సాగు జరిగింది.
కానీ వర్షా భావం వలన వర్షధార సాగు ప్రాంతాలలో జరిగిన వేరుశనగ, పప్పు ధాన్యాలు, ప్రత్తి పంటలు ఆశాజానకంగా లేకపోవడం వలన కొన్ని జిల్లాలలో రైతుల పరిస్థితి ఆందోళకరంగా ఉంది. ప్రధానమైన సాగు నీటి ప్రాజెక్ట్ లలో నీరు పుష్కలంగానే ఉన్నప్పటికీ కాలువ చివరి భూములకు నీరందించలేని పరిస్థితి. వర్షా భావంతో చిన్న సాగు నీటి ప్రాజెక్ట్ ల కింద నీరు అందక గడ్డు పరిస్థితి.
జరగవలసిన సీజన్ అంచనాలో 6/8/2025 నాటికి విజయనగరం 38% అల్లూరి సీతారామరాజు 41%, అనకాపల్లి 7%, గుంటూరు 42%, బాపట్ల 21%, పల్నాడు 21%, ప్రకాశం 14%, చిత్తూరు 12%, వైయస్ఆర్ కడప 19%, అన్నమయ్య 10%, అనంతపురం 42%, శ్రీ సత్యసాయి 29% మాత్రమే సాగు జరిగింది. 12 జిల్లాలలో రాష్ట్ర సరాసరి సాగు కంటే చాలా తక్కువ జరిగింది.
పంటల వారీ సాగును పరిశీలిస్తే..
రాష్ట్రంలో ఈ ఖరీఫ్ లో మొత్తం సాగు అంచనా 31.16 లక్షల హెకటార్లు ఐతే ఇందులో ప్రధానంగా వరి 14.78 లక్షల హెక్టార్లు, వేరుశనగ 4.97 లక్షల హెక్టార్లు, ప్రత్తి 5.28 లక్షల హెక్టర్లు. ఈ మూడు పంటలే మొత్తం సాగు లో 80%. ఇందులో వరి, ప్రత్తి ఇప్పటికి సాధారణ సాగు జరిగినప్పటికీ వర్షభావం తో నీటి ఎద్దడిని ఎదుర్కొని కొన్ని ప్రాంతాల్లో దెబ్బ తింటున్నాయి.
రాయల సీమలో సాగు జరిగే వేరుశనగ జరగవలసిన సాధారణ సాగు కంటే చాలా తక్కువ జరిగింది. వేరుశనగ ఈ ఖరీఫ్ లోసాగు అంచనా 4.97 లక్షల హెక్టార్లు.. 6/8/2025 నాటికి జరిగిన సాగు కేవలం 1.32 (27%) లక్షల హెక్టార్లు మాత్రమే. ఈ పంటకు సాగు సమయం కూడా అయిపోయినది. వేరుశనగ ప్రత్యేకంగా అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో ఎక్కువగా సాగు జరుగుతుంది.
వేరుశనగ సాగు జరగకపోతే ఆ ప్రాంతాలలో పశుగ్రాసం కొరత వస్తుంది. పశుగ్రాసం లేక పోతే చిన్న, సన్న కారు రైతు పశువులను తెగ నమ్ముకోవలసిన పరిస్థితి వచ్చి ఆందోళనకరంగా మారుతుంది. అందువలన ఈ ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక పై ద్రుష్టి పెట్టాలి. ఆ పంటల విత్తనాలు 90% సబ్సిడీపై రైతులకు వెంటనే అందించాలి. పశు సంవర్ధక శాఖ కూడా వర్షాభావ ప్రాంతాల్లో సబ్సిడీ పై పశుగ్రాసం, దాణా అందించే ప్రణాళిక పై దృష్టి పెట్టాలి.
వ్యవసాయానికి అదునుపొదును ప్రధానం..
వరి పంట కు నాట్లు వేసిన 10 రోజులలోపు మొదటి దఫా రసాయనిక ఎరువు వెయ్యాలి. పొటాష్ కలిసిన కంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగి పోయినాయి. అదునుకి ఎరువు వెయ్యటానికి యూరియా సకాలంలో దొరకక రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా వరి సాగు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది.
వ్యవసాయ శాఖ యూరియా సప్లైకి ఇబ్బంది లేదని చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. యూరియా కొరత లేనప్పుడు రైతుకు 2 కట్టలే ఇస్తాం అనే ఎందుకు చెబుతున్నారు. యూరియా కావాలంటే కాంప్లెక్స్ ఎరువుకూడా కొనాలి లేకపోతే లిక్విడ్ నానో యూరియా కొనాలి అని పోటీ పెడుతున్నారని, 100 నుండి 150 రూ అదనంగా చెల్లిస్తే బ్లాక్ లో మాత్రం ఎటువంటి పోటీ లేకుండా దొరుకుతుంది అని రైతులు చెబుతున్నారు. యూరియా వాస్తవ నిల్వలపై మండల స్థాయి లో వ్యవసాయ అధికారి ప్రతి రోజు బోర్డులో డిస్ప్లే చెయ్యాలి. దీనిపై వ్యవసాయ శాఖ సరి అయిన గట్టి చర్యలు తీసుకోవాలి..
గత ప్రభుత్వం రైతులకు ఎంతో ఉపయోగంగా అమలు చేసిన ఉచిత పంటల బీమాను ఈ ప్రభుత్వం తీసివేయడంతో బీమా రైతు వాటా ప్రధాన పంటలైన వరికి ఎకరానికి రూ.867, ప్రత్తికి రూ.1939, వేరుశనగకు రూ.571, మిర్చికి రూ.1837 చెల్లించలేక చాలా మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించలేదు. అందువలన ఇన్సూరెన్స్ కవరేజ్ లో రైతుల సంఖ్య గణనీయంగా తగ్గి పోతుంది. తద్వారా రైతులకు బీమా పరిహారం కూడా తగ్గిపోతుంది.. రైతులు తీవ్రంగా నష్ట పోతారు.’’
– ఎంవీఎస్ నాగిరెడ్డి, వైయస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్.

ఇవీ చదవండి: CM Review on Agriculture: అన్ని విధాలా ఆదుకుంటున్నాం.. వ్యవసాయంపై సమీక్షలో సీఎం జగన్
YSR Raithu Bharosa PM Kisan: బాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టింది.. రైతు భరోసా నిధుల విడుదలలో జగన్
