HomeTelanganaViral Video : యూరియా కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!

Viral Video : యూరియా కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!

Viral Video : మహిళలు బస్సుల్లో సీట్ల కోసం వాగ్వాదాలు పెట్టుకోవడం, జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు మరో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. యూరియా కొరతతో రోజుల తరబడి కష్టాలు పడుతున్న రైతు మహిళలు, ఒక్క బస్తా కోసం నడిరోడ్డుపై పోట్లాడుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇద్దరు మహిళా రైతులు శిఖలు పట్టుకొని తన్నుకోవడం, కొట్టుకోవడం చూసిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. (viral video)

తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా పెరగడంతో రైతులలో ఉద్రిక్తతలు ఎక్కువవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఈ పరిస్థితులు హింసాత్మక స్థాయికి చేరుకున్నాయి. ఇంతకుముందు రైతులు గ్రోమోర్ సెంటర్‌పై రాళ్ల దాడి చేసి, అక్కడ నిప్పు పెట్టిన ఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన మరవకముందే శుక్రవారం మరో ఘటన సంచలనంగా మారింది.

జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్‌లోని ఆగ్రోస్ విక్రయ కేంద్రం వద్ద తెల్లవారుజామునుంచే రైతులు, మహిళలు యూరియా కోసం క్యూల్లో నిలబడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం మొదలై, అది కాసేపట్లో ఘర్షణగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు జుట్టు పట్టుకొని నడిరోడ్డుపైనే పొర్లాడుతూ కొట్టుకున్నారు. చుట్టుపక్కల వారు మధ్యలోకి వచ్చినా ఆగకుండా పోట్లాడుతూనే ఉన్నారు. చివరికి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు బలవంతంగా వారిని ఆపేశారు.

ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, యూరియా కొరత ఎంత తీవ్రమైందో మరోసారి వెలుగులోకి తెచ్చింది.

ఇవీ చదవండి: BJP on Kavitha : క‌విత విష‌యంలో బీజేపీ అదే వ్యూహాన్ని అమ‌లు చేస్తుందా..?
Urea : పారదర్శకంగా యూరియా సరఫరా : అచ్చెన్నాయుడు
Urea Shortage : తెలుగు రాష్ట్రాల్లో రైతులకు యూరియా కష్టాలు.. ఎందుకిలా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు