HomeAndhra PradeshYSRCP Annadata Poru : అన్నదాత పోరును అడ్డుకోవడం దారుణం

YSRCP Annadata Poru : అన్నదాత పోరును అడ్డుకోవడం దారుణం

YSRCP Annadata Poru : ప్రజా స్వామ్యంలో శాంతియుతంగా జరుగుతున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని ప్రభుత్వం అప్రజాస్వామికంగా అడ్డుకోవడం దారుణమని వైయస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థతో అన్నదాత పోరును అడ్డు కునే ప్రయతనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం గంటల తరబడి లైన్ లో ఉంటే మనిషికి ఒక కట్ట అమ్మడం, లేకపోతే ఈ రోజు అయిపోయింది మళ్ళీ యూరియా వచ్చినప్పుడు రమ్మని రైతులను తీవ్ర ఆందోళన కు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాస్తవాలు చివరకు ప్రభుత్వ అనుకూల పత్రికలలోకూడా గత ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసినదేనన్నారు.

అదే కట్టకు రూ.500, రూ.600కైతే దొరుకుతుంది.. దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఏమంటారో కానీ ప్రజల ద్రుష్టి లో బ్లాక్ మార్కెటింగ్ అంటారని తెలిపారు. దీన్ని అరికట్టి రైతులకు సరిపడా యూరియా వాళ్లకి అవసరమైన సమయంలో ప్రభుత్వ ధరకు అందే లా చెయ్యమని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. రైతులతో కలిసి శాంతి యుతంగా ర్యాలీగా వెళ్లి ఆర్డీవోలకు వినతి పత్రం ఇవ్వటానికి అన్నదాత పోరు కార్యక్రమం ఈ రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందన్నారు.

కానీ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా రైతులు యూరియా కొనుగోలుకు ఇబ్బంది పడుతుంటే.. రాష్ట్ర చరిత్రలో లేని మరో కార్యక్రమం పోలీస్ లను అడ్డుబెట్టి నోటీస్ లు ఇవ్వడం, ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండేలా చెయ్యడం ప్రజా స్వామ్యాన్ని ఖునీ చెయ్యడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు యూరియా ఉచితంగా ఇవ్వమని అడగడం లేదని, ప్రభుత్వ ధరకు కొనుక్కుంటాము, అందించమని అడుగుతున్నారన్నారు.

ప్రభుత్వ ప్రకటనలకి క్షేత్ర స్థాయి పరిస్థితి కి పొంతన లేక సమాధానం చెప్పలేక అసహనంతో అప్రజాస్వామిక పాలన నడుపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరి నశించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ విధానాన్ని ప్రజాస్వామ్యవాదులంతా గమనిస్తున్నారని, ఒక రోజు దీనికి మూల్యం తప్పక చెల్లించుకోవలసిన వస్తుందన్నారు.

ఇవీ చదవండి: Urea : ఆంధ్రప్రదేశ్: ఖరీఫ్‌లో ఇంకా యూరియా ఎంత కావాలి?
Urea AP : ఏపీకి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
Viral Video : యూరియా కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు