HomeLife StyleMuskmelon Seeds: కర్బూజ గింజలు తిన్నారా? ఏ జబ్బులకు పని చేస్తాయంటే!

Muskmelon Seeds: కర్బూజ గింజలు తిన్నారా? ఏ జబ్బులకు పని చేస్తాయంటే!

Muskmelon Seeds: కర్భూజ పండు చాలా మంది ఇష్టంగా తింటుంటారు. దీంతోపాటు కర్బూజ గింజలు కూడా తినాలి. (Muskmelon Seeds) ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కర్బూజ గింజలు తినడం ద్వారా బరువు కంట్రోల్ లో ఉండటం, చెడు కొవ్వు కరిగిపోవడం లాంటి ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు.

విటమిన్ సీ
కర్భూజ కాయలోనే కాదు.. వీటి విత్తనాల్లోనూ విటమిన్ సీ అధికంగా ఉంటుంది. వీటిని తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీంతో త్వరగా ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఎనర్జిటిక్‌గా ఉండేందుకు దోహదం చేస్తుంది. చర్మ, ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. పిల్లలు తినడం వల్ల అనేక పోషకాలు చేకూరుతాయి.

జీర్ణ సమస్యలకు చెక్
కర్భూజ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అజీర్తి, మల బద్ధకం, యాసిడ్ రిఫ్లెక్స్ లేకుండా పని చేస్తుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఇవి తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

చెడు కొవ్వు కరుగుతుంది
కర్భూజ గింజలను తినడం వల్ల చెడు కొవ్వును కరిగిస్తుంది. గుడ్ ఫ్యాట్ స్థాయిలను పెంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగడం వల్ల రక్త ప్రసరణకు దోహదం చేస్తుంది. అలాగే రక్త పోటు సమస్య రాకుండా పరిస్థితి అదుపులో ఉంటుంది.

దగ్గు మటుమాయం
దగ్గను నియంత్రించే లక్షణాలు కర్బూజ గింజల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దగ్గు సమస్యతో బాధ పడేవారు వీటిని తినడం వల్ల త్వరగా కోలుకోవడం జరుగుతుంది.

బరువు నియంత్రణ..
కర్భూజ విత్తనాలు తీసుకోవడం వల్ల ఓవర్ వెయిట్ తో బాధపడుతున్న వారు నియంత్రణలో ఉంచుకునే వీలుంటుంది. అధిక బరువున్న వారు ఇవి తింటే ఆకలి అనేది నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ కారణంగా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇతర ఆహారాలు తీసుకోవడం తగ్గిస్తారు. కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది కాబట్టి బరువు తగ్గేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

ఇవీ చదవండి: Sabja Ginjalu: పరగడుపున సబ్జా గింజలతో ఇలా చేస్తే మీ ఆరోగ్యం పదిలం!
Sabja Ginjalu: ఈ వేసవిలో సబ్జా గింజలతో ఇలా చేయండి.. వేడి నుంచి తక్షణ ఉపశమనం గ్యారెంటీ!
Fennel Benefits: సోంపూ గింజలతో ఉపయోగాలేంటి? శరీరంలో ఈ మార్పులు ఖాయం..
Mediterranean food: మధ్యస్త ఆహారం.. ఏం తినాలి? ఎలా ప్రారంభించాలి?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు