HomeLife StyleVastu Tips: నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూస్తే ఏమవుతుంది?

Vastu Tips: నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూస్తే ఏమవుతుంది?

Vastu Tips: భారతదేశంలో వాస్తును చాలా మంది ఫాలో అవుతారు. వాస్తు శాస్త్రంలో చాలా రకాల అంశాలు నిబిడీకృతమై ఉంటాయి. ముఖ్యంగా మనం చేసే రోజువారీ పనుల విషయంలో తప్పులు (Vastu Tips) చేయకూడదని పెద్దలు చెబుతారు.

అలాంటి వాటిలో ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం కూడా ఒకటని చెబుతారు. అయితే, చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం అలవాటు. పెద్దలు ఉన్న ఇళ్లలో అయితే జాగ్రత్తలు చెబుతుంటారు. ఇంతకీ ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఏమవుతుంది?

హిందూ శాస్త్రంలో చాలా నమ్మకాలు ఉన్నాయి. మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేయడం సహజమే. వీటివల్ల పలు రకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ మేరకు వాస్తు నిపుణులు జాగ్రత్తలు కూడా చెబుతుంటారు. అలాంటి వాటిలో ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం ప్రధానమైనది. అయితే వాస్తు పండితులు మాత్రం ఖరాఖండీగా ఒక్క మాటే చెబుతున్నారు. ఉదయం నిద్రలేచాక ఎట్టి పరిస్థితుల్లతోనూ అద్దంలో ముఖం చూసుకోవద్దంటున్నారు. దీనివల్ల నష్టాలు కలుగుతాయట.

వాస్తు శాస్త్రం మేరకు.. రాత్రంతా అద్దంలో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందట. ఈ నేపథ్యంలో ఉదయాన్నే నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూడటం వల్ల ఆ నెగిటివ్‌ ఎనర్జీ అంతా మన మీదికి వస్తుందని చెబుతున్నారు. ఫలితంగా ఇది మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపుతుందని చెబుతున్నారు. ఇది రోజంతా మనపై ఏదో తెలియని ప్రభావం చూపుతుంది. నిత్యం చికాకుగా, అలసిపోయినట్లు ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

మార్నింగ్ నిద్రలేవగానే అద్దంలో మన ఫేస్ చూసుకుంటే.. మనిషికి తగినంత విశ్రాంతి తీసుకోలేదన్న ఫీలింగ్ కలుగుతుందట. ఇది మెంటల్ గా మంచిది కాదంటున్నారు. ఇక మానసిక నిపుణులు సైతం అద్దంలో ముఖం చూసుకోవద్దనే సూచిస్తున్నారు. మొహంపై ఉండే మొటిమలు, ముడతలు, తెల్ల జుట్టు, మచ్చలు లాంటివి చూడడం వల్ల మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపుతాయట. దీంతో నిరాశ, అసంతృప్తి ఫీల్ అయ్యే చాన్స్ ఉంది. ఇది రోజంతా మన మానసిన తీరును ప్రభావితం చేస్తుందట.

మరోవైపు వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల మేరకు.. ఉదయాన్నే వాస్తులో ముఖం చూసుకోవడం కారణంగా నిందలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు. అందుకే ఉదయం లేవగానే వీలైనంత వరకు అరచేతిని చూసుకోవడం లేదా ఏదైనా దేవుడి ఫొటోను చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: Kitchen Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఎలా నిర్మించాలి? కిటికీలు ఎలా ఉండాలో తెలుసా?
East Door Vastu: తూర్పు దిశ తలుపు ఉంటే పరమ పవిత్రం.. వాస్తు బాగా కలిసొచ్చేది ఇదే..
Office Chair: ఆఫీసులో ఏ దిశలో కూర్చోవాలి? వాస్తు ప్రకారం కలిసొచ్చే అంశాలివే..
Sree Vastu Yantram: శ్రీవాస్తు యంత్రం.. వాస్తు దోషాలకు, వీధి పోటుకు పరిష్కారం.. నెగిటివ్‌ ఎనర్జీని తరిమేస్తుంది!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు