Office Chair: ఉద్యోగం చేసే వారు ఇంట్లో కంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుతారనేది నిత్య సత్యం. అలాంటి కార్యాలయాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అనునిత్యం గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పనిచేసే ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఉంటే అటు జీవితంలో కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. (Office Chair)
కార్యాలయాలు, ఇళ్లలో వర్క్ ఫ్రం హోం చేసే వారికి కొన్ని సందేహాలు వెంటాడుతుంటాయి. పనిచేసే ప్రదేశాల్లో ఏ దిశలో కూర్చుంటే కలిసొస్తుంది? లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది? అనేది చాలా మందికి ఉన్న సందేహం. ఇందుకు నిపుణులు కొన్ని కీలక సూత్రాలు చెబుతున్నారు. ఆఫీసులో కూర్చొనే ప్రాంతం, ఆఫీసు పరిసరాలు కూడా జీవితంలో కలిసిరావడానికి లింకు ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఏ దిశలో కూర్చుంటే కలిసొస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదో ఈ కథనంలో తెలుసుకుందాం.
పనిచేస్తున్న కార్యాలయాల్లో వాస్తు దోషాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఉండాల్సిన స్థానంలో కాకుండా తారుమారైతే వాటి ఫలితాలు కూడా తారుమారు అవుతాయి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండానే జీవితంలో కొన్ని రకాల సమస్యలు చుట్టుముడతాయి. వీటిని ఎదుర్కోవడం చాలా కష్టతరంగా మారుతుంటుంది. ఇలాంటి సమయంలో దిక్కుతోచదు. అలాంటి పరిస్థితుల్లో వాస్తు దోషాలు ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోవాలి.
ఆఫీసుల్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఉద్యోగులకు, యాజమాన్యానికి అనవసర ఇబ్బందులు వచ్చి పడతాయి. ఆఫీసుల్లో ఎలాంటి పరిస్థితులున్నాయనేది మొదట గమనించాలి.
మీరు ఏ దిశలో కూర్చుంటున్నారు?
* మీరు కూర్చున్న చోట భుజంపై కిటికీ ఉండరాదు. వాస్తు ప్రకారం ఇలా ఉండటం వల్ల మీకు మంచిది కాదు.
* తలపై కిటికీ ఉంటే ఆర్థిక సమస్యలు చుట్టుముడాయి. ప్రత్యర్థులు ఎక్కువ అవుతారు.
* మీరు కూర్చొనే సీటింగ్ వీధికి ఎదురుగా ఉండరాదు. ఇలా ఉంటే మీ పురోగతిలో అవరోధాలు ఏర్పడతాయి. జీవితంలో కష్టాలు ఎక్కువ వస్తాయి.
* వీధిగుమ్మం ఎదురుగా కుర్చీ ఉండటం వల్ల ప్రారంభించిన పనులు పూర్తికావు. ఇంట్లో అశాంతి నెలకొంటుంది.
* వాస్తు ప్రకారం ఆఫీసులో సరైన దిశలో కూర్చుంటే కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు.
* ఉత్తరం లేదా తూర్పు దిశకు అభిముఖంగా కుర్చీ వేసుకొని కూర్చోవాలి.
* ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.