Sree Vastu Yantram: ఇంట్లో, వ్యాపార దుకాణాల్లో నెగిటివ్ ఎనర్జీతో చాలా మంది సతమతం అవుతుంటారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎప్పుడూ కలహాల కాపురాలే మిగులుతాయి. నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇళ్లలో మనుషులకు నిద్ర పట్టదు. అర్ధరాత్రి, తెల్లవార్లూ మేల్కొనే ఉంటారు. తీరా తెల్లవారే సరికి నిద్రపోతుంటారు. రాత్రంతా స్మార్ట్, టీవీ చూస్తూ ఉండిపోతారు. పగలు అయితే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. పగలు తినడం పడుకోవడం తప్ప ఇంకేమీ చేయరు. వ్యాపార ప్రాంతంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇంతే సంగతులు. బిజినెస్ జరగకపోవడం, నష్టాలు చవిచూస్తుండడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి వాటికి పరిహారం శ్రీవాస్తు యంత్రమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. (Sree Vastu Yantram)
శ్రీవాస్తు యంత్రాన్ని ఇళ్లలో వ్యాపారం ఉన్న ప్రాంతాల్లో పెట్టుకోవడం వల్ల అనేక ఉపయోగాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఇది నెగిటివ్ ఎనర్జీని తరిమేసి పాజిటివ్ ఎనర్జీ ప్రసరించేలా చేస్తుందట. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేస్తుందట. రేఖా గణితంలోనూ ట్రయాంగిల్ షేప్ కలిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతారు. అలాగే శ్రీవాస్తు యంత్రం కూడా ట్రయాంగిల్ షేప్‌తో ఉంటుంది.
వీధిపోటుకు ఇదే పరిష్కారం
వీధిపోటు ఉన్న ఇళ్లు, షాపులకు పరిష్కారం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి చోట్ల సొంతిల్లు ఉన్న వారు అటు అమ్ముకోలేక, ఇటు ఇంట్లో నివాసం ఉంటే నెగిటివ్ ఫలితాలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో దీనికి చక్కటి పరిష్కారంగా శ్రీవాస్తు యంత్రాన్ని వీధిపోటు ఉన్న దుకాణాలు, ఇంటి ఎదుట, కాంపౌండ్ వాల్‌కు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీధిపోటు ఉత్తరం వైపు, పడమట, దక్షిణం, తూర్పు… ఇలా ఏ కార్నర్‌లో ఉన్నప్పటికీ శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ, దుష్పరిణామాలు తొలగి పాజిటివ్ రిజల్ట్ వస్తాయంటున్నారు నిపుణులు.
శ్రీవాస్తు యంత్రంలో తొమ్మిది రౌండ్ షేప్స్ ఉంటాయి. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే అట్రాక్ట్ చేసుకుంటుందని చెబుతున్నారు. నెగిటివ్ ఎనర్జీ ఏ రూపంలో వచ్చినా వెనక్కి పంపేస్తుందని చెబుతున్నారు. ఇంటి ఎదుట ఓ మేకు కొట్టి దీన్ని తగిలించుకోవడం వల్ల వాస్తు దోషాలు ఎన్ని ఉన్నా తొలగిపోతాయంటున్నారు. వాస్తు దోషం ఉందని ఇల్లు కాళీ చేయాల్సిన పని లేదని, ఇల్లు కూలగొట్టాల్సిన పని లేదని, మార్పులు చేయాల్సిన పని అసలే లేదని చెబుతున్నారు.
ఇదీ చదవండి: Vastu Tips for luck: అదృష్టం మీ తలుపు తట్టాలంటే… 5 వాస్తు టిప్స్ ఇవే