YSRCP Social Media: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న పోస్టులు, ఆడ వాళ్లపై పెడుతున్న పోస్టులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైయస్సార్ సీపీ సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టే వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో తొలి జీఐఎస్ విద్యుత్ ఉపకేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. వైయస్సార్ సీపీ సోషల్ మీడియాపై (YSRCP Social Media) సీఎం చేసిన కామెంట్స్ ముఖ్యాంశాలు..
– సోషల్ మీడియాకు ఏ మాత్రం అడ్డు అదుపు లేకుండాపోయింది. ఆడ బిడ్డలపైన పోస్టింగులు పెట్టేస్తున్నారు.
– క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఈ వెధవలకు ఏమీ లేదేమో కానీ, మనకో కుటుంబ వ్యవస్థ ఉంది. భార్యా, భర్త, పిల్లలతో బతుకుతున్నాం. కనీసం గౌరవంగా బతకాలని కోరుకుంటాం. మనల్ని గురించి ఆ పేపర్లో అవన్నీ పెడితే ఎంత బాధపడతారో ఆలోచించండి.
– నన్ను గురించి అసెంబ్లీలో మాట్లాడితే, మా మిసెస్ గురించి మాట్లాడితే, బాంబులకు కూడా భయపడలేదు కానీ మొట్ట మొదటిసారిగా నేను కూడా కళ్లవెంట నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను.
– మనకు బాంధవ్యాలున్నాయి. ఇలాంటివి చేసినప్పుడు మనం కూడా మనుషులమే రోషం వస్తుంది. బాధ కలుగుతుంది.
– ఈరోజు విచ్చలవిడితనం వచ్చింది. సోషల్ మీడియాలో వాళ్లు వాడే భాష మీరు చూస్తున్నారు. ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది. ఆంబోతుల మాదిరిగా తయారవుతున్నారు. ఆడబిడ్డలపైన ఇష్టానుసారం మాట్లాడతారు. నన్ను గురించి మాట్లాడారు. అనిత ఓ ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు.
– మా కుటుంబం, ఎమ్మెల్యేల గురించి, మిమ్మల్ని గురించి, నిన్నా మొన్న పవన్ కల్యాణ్ గురించి, ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారం మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని వారు బాధ పడే పరిస్థితికి వచ్చారు.
– అంటే యాక్షన్ తీసుకోకూడదా? వదిలిపెట్టాలా వీళ్లను? అంటే.. మదం ఎక్కువై, కొవ్వు ఎక్కువై నేరస్తులుగా తయారయ్యారు.
– ఆరోజు నేనే ముఖ్యమంత్రి. తెల్లవారితే వివేకానందరెడ్డి చనిపోతే మొట్ట మొదటిసారి బ్రాడ్ కాస్ట్ చేసింది సాక్షి టీవీలో. గుండెపోటుతో చనిపోయాడని. నేను కూడా ఒక ముఖ్యమంత్రిగా నమ్మాను.
– నేను ఎప్పుడూ రాజకీయం చేయను. కానీ రాజకీయాల్లో మాత్రం నన్ను మోసం చేయాలనుకుంటే, నాతో ఆడుకోవాలనుకుంటే ఎవడినీ వదిలిపెట్టను.
– లా అండ్ ఆర్డర్ ఉండాలి. నాగరిక ప్రపంచంలో అభివృద్ధికి అదే సాధ్యం. 1995 నుంచి చూస్తే తీవ్ర వాదులతో పోరాడాను. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్లతో పోరాడి మత సామరస్యాన్ని కాపాడాను.
– రాయలసీమలో, పల్నాడులో ఫ్యాక్షన్, ముఠాల సంస్కృతి ఉండేది. ఒకర్ని చంపితే ఆ ఇంట్లో ఆడబిడ్డ మంగళ సూత్రం కూడా తీయకుండా కొడుకుల్ని ప్రోత్సహించి మళ్లీ వాడిని చంపిన తర్వాతే నేను కార్యక్రమాలు చేస్తానని ప్రతిజ్ఞ చేసేది. గ్రామాలు రావణ కాష్టంగా మారే పరిస్థితి వచ్చింది.
– అలాంటి చనిపోయిన వారి పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ స్కూలు పెట్టి వాళ్లను చదివించి ప్రయోజకుల్ని చేయాలనుకున్నప్పుడు పిల్లలతో మాట్లాడాను..
– మీ నాయన చనిపోయాడు.. తెలుగుదేశం కుటుంబ పెద్దగా నీ కుటుంబాన్ని పైకి తెస్తానని చెప్పేవాడిని. ఏమవుతానని అడిగితే ఇక్కడ చదువుకున్నాక పెద్దయ్యాక ఊరికి పోయి మా నాన్నను చంపిన వాడిని చంపి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అనేవాడు.
– అంత పౌరుషంగా మాట్లాడేవారు. అక్కడి నుంచి నేను ఎడ్యుకేషన్ చేశాను. హత్యకు హత్య సమాధానం కాదు. చట్టప్రకారం చేద్దాం అని చెప్పేవాడిని.
– అలాంటి ముఠాలను నేను అణచివేశాను. మా పార్టీ ఆ పార్టీ అని కాదు. అందర్నీ సమానంగా చూశాను. అవసరమైతే మా పార్టీ వాళ్లను కూడా అరెస్టు చేశాను. మొత్తం సమస్య పరిష్కారమైంది.
– నేరస్తులు రాజకీయ ముసుగులో ఉండి ఘోరాలు చేస్తున్నారు. మనుషులను చంపుతున్నారు. ఆస్తుల్ని కొట్టేస్తున్నారు. మాట్లాడితే ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నారు. ఆడ బిడ్డలపైన ఇష్టానుసారం పోస్టులు పెట్టిన వ్యక్తులకు ఆడ బిడ్డల విలువ తెలియదా?
– అంటే మనం కుంగి కుంగి చావాలా? ఆరోజే మీరు చూశారు. ముందు గుండెపోటు అని చెప్పి పోస్ట్ మార్టం చేస్తే భయంకరమైన మర్డర్. మొత్తం తలంతా బద్దలు కొట్టి మెదడు కూడా బయటకొచ్చింది. ఇల్లు, బాత్రూం బ్లడ్ కడిగేశారు.
– రెండోరోజు నామీద నారాసుర రక్త చరిత్ర అని వాళ్ల పేపర్లో పెట్టి సింపతీ సంపాదించుకునే ప్రయత్నం చేశారు.
– ఒక కరుడుగట్టిన ఒక నేరస్తుడు ఎలాంటి పనులు చేస్తాడో మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీరూ సఫర్ అయ్యారు.
– అభివృద్ధికి యజ్ఞం చేస్తుంటే మా మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మానసికంగా దెబ్బతీస్తూ మనల్ని బాధపెట్టే పరిస్థితికి వచ్చారు.
– మీరు ఏమీ చేయలేరు. దేశంలో, ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ అధ్యయనం చేస్తా. డెమోక్రటిక్ గా ఆలోచిస్తా. ఆడ బిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే ఖబడ్దార్. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యే లేదని హెచ్చరిస్తున్నా.
– దేనికైనా హద్దులుంటాయి. ఇష్టానుసారంగా చేస్తే చేత కాదనుకుంటే అది జరగదు.
– రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి విజ్ఞప్తి చేస్తున్నా. మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. పాత ప్రభుత్వం చేసిన దరిద్రమైన పనుల వల్ల ఎక్కడికక్కడ డ్రగ్స్, గంజాయి వచ్చి మద్యం తాగి కడాన చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది.
– నాలుగేళ్ల ఆడబిడ్డలపైన హత్యాచారాలు చేయడం ఏంటి? మీరు మనుషులేనా? మీకూ మృగాలకు తేడా ఏంటి? వీళ్లను ఏం చేయాలి? అదే సీరియస్ గా ఆలోచిస్తున్నా. ప్రజాచైతన్యం తీసుకొచ్చి ఇలాంటి కొవ్వెక్కిన వారికి కొవ్వు తగ్గిస్తాం.
– మీరు నేరస్తులకంటే సమర్థులుగా ఉంటే మీది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. నేరస్తులకంటే ఇన్ఫీరియర్ గా ఉంటే నేరస్తులదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. అది ఈ ఎన్డీయే ప్రభుత్వంలో జరగనివ్వను.
– భావ వ్యక్తీకరణ అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ల ఇష్టప్రకారం ఆడబిడ్డలు, చెల్లెమ్మల వ్యక్తిత్వాన్ని హననం చేయడమా?
– అశ్లీలమైన, అసత్యమైన, అసభ్యకరమైన పోస్టులు పెట్టడమా? అని అడుగుతున్నా. ఏ చట్టం మీకు ఇది ఇచ్చింది.
– కడాన జడ్జిల కుటుంబ సభ్యులపైన కూడా పెట్టే ధైర్యాన్ని చేశారు. వాళ్లు కూడా చెప్పుకోలేని పరిస్థితి.
– లెక్కలేని తనం. ఒకరిద్దరు కాకుండా నా మీద కూడా చూస్తుంటారు. నేను బయట ఏ ఇంటికి పోయి డిన్నర్ కూడాచేయలేదు. అది నా డిసిప్లిన్.
– బిల్ గేట్స్ వస్తే ఢిల్లీకి వచ్చినప్పుడు నేను కలవాలంటే మీరు రండి కాక్ టేల్ డిన్నర్ ఉంటుందంటే నేను రానని చెప్పాను.
– ఈరోజు మళ్లీ హెచ్చరిస్తున్నా. చెప్పకపోతే ఏమనుకుంటారు.. మేం భయపడుతున్నామని అనుకుంటారు.
– ప్రజా చైతన్యం లేకపోతే ఈ దుర్మార్గులు చెప్పే మాటలు కొంత మంది అయినా వినే పరిస్థితికి వస్తున్నారు.
– ఇది నా ఒక్కడి మనో వేదన కాదు. మీ అందరి మనో వేదన. లా అండ్ ఆర్డర్ అనేది నా ఒక్కడి కోసం కాదు, రాష్ట్రం కోసరం. భావి తరాల భవిష్యత్తు కోసరం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసరం. ఆడ బిడ్డల ఆత్మగౌరవం కోసరం.
– ప్రతి ఇంటికీ ఆడ బిడ్డలు ఉన్నారు. ఈ నేరస్తులకు ఆడ బిడ్డలంటే గౌరవం లేకపోవచ్చు. వాళ్లను కూడా కోరుతున్నా. అలాంటి పార్టీలో ఉండటానికి అర్హత ఉందా అని నిలదీస్తున్నా.
– నేను ఏ పార్టీ అని చెప్పను. రేపు రాబోయే రోజుల్లో ఎన్డీయే పార్టనర్స్ కు కూడాచెబుతున్నా. ఏ ఆడ బిడ్డపైన కూడా మీరు అసభ్యకరమైన పోస్టు పెట్టొద్దండి. అదే సమయంలో నేరస్తులైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నా.
– మీకు చెబితే వినరు కానీ, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే, ఎక్కడ వాత పెడితేనే మీకు బుద్ధి వస్తుంది. అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని హెచ్చరిస్తున్నా.
– కావాలంటే రాజకీయంగా మీరు విషయాలు మాట్లాడండి. వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రం, ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని వదిలి పెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా.
– గౌరవంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. గౌరవ ప్రదమైన రాజకీయాలకు నాంది పలకాలనుకుంటున్నాం. ఐదారు నెలల నుంచి మీరు చూస్తున్నారు. బూతులు లేవు. ఇష్టానుసారం బిహేవ్ చేయడం లేదు. ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తున్నాం.
– దీన్ని మీరు ఆసరాగా చేసుకుని ఏం చేసి అయినా సరే బెదిరిస్తాం అని రౌడీలను పెట్టుకుని, హత్యలు చేసే వారిని పార్టీల్లో చేర్చుకుని వాళ్ల ద్వారా బెదిరిస్తే మాత్రం.. నేరస్తులు ఏ ముసుగుతో ఉన్నా నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప గౌరవంగా ట్రీట్ చేసే సమస్యే ఉండదని హెచ్చరిస్తున్నా.
– చెప్పకపోతే నేను డీఫాల్టర్ అవుతాను. చేసిన పనులు చెప్పాలి. ప్రజా చైతన్యం తీసుకురావాలి. దుర్మార్గులు చేసే పని కూడా మీకు చెప్పి ఆ దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నాపై ఉంది.
– రాజులు కూడా ప్రజల కోసరం యజ్ఞాలు చేసేవారు. రాక్షసులు వచ్చి భంగం కలిగించేవారు. దేవతలకు కూడా ఇది తప్పలేదు. మానవ మాత్రులం మనం. మనకూ ఇవి తప్పవు. ఇలాంటి ఆటలు సాగనివ్వనని చెబుతున్నా.
ఇవీ చదవండి: Chandrababu: ఆంధ్రా ఎస్కోబార్.. రోడ్లన్నీ నాశనం చేశాడు
Nara Chandrababu Naidu: నా మీటింగ్‌లో ఆర్భాటాలు ఉండవు.. చెట్లు నరకడం ఉండదు
CM Chandrababu: ఇసుక, మద్యంలో జోక్యం వద్దు.. చంద్రబాబు వార్నింగ్
Chandrababu: జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి
