HomeAndhra PradeshNew York: న్యూయార్క్ లో లోకేష్.. విట్ బై హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ

New York: న్యూయార్క్ లో లోకేష్.. విట్ బై హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ

New York: అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ న్యూయార్క్ కు వెళ్లారు. అక్కడి విట్ బై హోటల్ లో పారిశ్రామికవేత్తలతో (New York) సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను లోకేష్ ఈ సందర్భంగా వివరించారు. ఆ వివరాలను ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.

“బ్లూప్రింట్ తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని తెలిపాను.” 974 కి.మీ.ల సువిశాల తీరప్రాంతానికి అనుసంధానంగా రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. రాబోయే 18 నెలల్లో విశాఖ సమీపంలోని భోగాపురంవద్ద జిఎంఆర్ సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది.

మూలపేట, కాకినాడ గేట్ వే, మచిలీపట్నం, రామాయపట్నంలలో 4 కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తాయి. ఆయా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవవనరులను సిద్ధం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

తద్వారా పరిశ్రమలకు అవసరమయ్యే మ్యాన్ పవర్ అందుబాటులోకి తెస్తాం. అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీలో అంతర్జాతీయస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు తయారవుతారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి” అని పారిశ్రామికవేత్తలను మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు.

ఇవీ చదవండి: Lokesh Red Book: రెడ్ బుక్‌లో మూడో ఛాప్టర్ త్వరలోనే ఓపెన్ చేస్తాం
Nara Lokesh with Satya Nadella: సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ.. ఏం మాట్లాడారంటే
Nara Lokesh in USA: ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఆహ్వానం
Nara Lokesh: ఏఐ చాన్సుల వినియోగం.. వేగంగా ఏపీ అభివృద్ధి
Nara Lokesh: 43వ రోజు ప్రజా దర్బార్.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
American Education: అందుబాటులో విదేశీ విద్య.. అమెరికా చదువులపై సందేహాలకు సమాధానాలు
America: అగ్రరాజ్యంలో సంపన్నులపై పన్ను ఎఫెక్ట్.. పెరగనున్న ట్యాక్స్ భారం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు